అన్వేషించండి

Producer Dil Raju: 5 రోజులు షూటింగ్ చేశాక రకుల్‌ను ఆ మూవీ నుంచి తీసేశాం, చాలా బాధేసింది: దిల్ రాజు

దిల్ రాజు.. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ గా ఎన్నో సినిమాల‌ను ప్రొడ్యూస్ చేశాడు. ఎన్నో హిట్ లు అందించాడు. అయితే, ఆయ‌న మొద‌టిసారి త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నాడు. ఒక ఇంట‌ర్వ్యూలో చాలా విష‌యాలు చెప్పాడు.

Producer Dil Raju shares Behind Stories of Mr Perfect, Brindavanam : ఒక సినిమా థియేట‌ర్ స్క్రిన్ పైన చూస్తున్నాం అంటే దాని వెనుక చాలా క‌ష్టం ఉంటుంది. దాని వెనుక ఎన్నో మార్పులు, చేర్పులు ఉంటాయి. తెర వెనుక ఎంతోమంది క‌ష్ట‌ప‌డ‌తారు ఆ సినిమా ఔట్ పుట్ కోసం. నిజానికి తెర వెనుక ఏం జ‌రుగుతుంది అనే విష‌యాలు చాలావ‌ర‌కు మ‌న‌కు తెలియ‌దు. ప్రొడ్యూస‌ర్ల గురించైతే చెప్ప‌క్క‌ర్లేదు. సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుంచి తెర మీద‌కి వ‌చ్చే వ‌ర‌కు ఎన్నో ఇబ్బందులు. అలాంటి విష‌యాలు పంచుకున్నారు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఆయ‌న చాలా సినిమాల‌ను ప్రొడ్యూస్ చేశారు. త‌న సినిమాల‌కి సంబంధించి చాలా విష‌యాలు పంచుకున్నారు ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు.   

'ప‌రుగు' మూవీకి చాలా ఒత్తిడి ఎదుర్కొన్నా..

"ప‌రుగు' సినిమాకి చాలా ఒత్తిడి అనుభవించా. ప్ర‌కాశ్ రాజు గారు క‌థ వినేసి నేచుర‌ల్ గా చేస్తాను అని షేవ్ చేసేసుకున్నారు. కొంచెం షూట్ అయ్యాక సింగిల్ షెడ్యూల్ లో చేసేస్తున్నాం క‌దా అని అడిగారు. అప్పుడు డైరెక్ట‌ర్, డీఓపీ అంద‌రూ చేతులెత్తేశారు. ఏం చేయాలి అనుకున్న‌ప్పుడు ఒక విగ్ తెచ్చి పెట్టి లుక్ ఓకేనా అన్నారు. ఇంక వెంట‌నే షూట్ చేశాం. ఇలాంటివి చాలా జ‌రుగుతుంటాయి. ‘ప‌రుగు’ చాలా ఒత్తిడి మధ్య రిలీజ్ చేశాను. కానీ సినిమా హిట్ అవుతుంది అని న‌మ్మాను. ఫస్ట్ రోజు సినిమాకి డివైడ్ టాక్ వ‌చ్చింది. మూడో రోజు సినిమా ఎక్క‌డికో వెళ్లిపోయింది."

'బృందావ‌నం'లో ఎన్టీఆర్‌ను అందుకే..  

వంశీ.. 'మున్నా' సినిమా త‌ర్వాత చాలా లో అయ్యాడు. అప్పుడు నువ్వు దిగులు పడకు.. డైరెక్ట‌ర్‌గా నువ్వు ఫెయిల్ అవ్వ‌లేదు అని ధైర్యం చెప్పా. అంద‌రూ నువ్వు బాగా తీశావు అన్నారు, పాట‌లు బాగున్నాయి అని కూడా అన్నారు. కానీ, మ‌నం త‌ప్పు చేసింది క‌థ ద‌గ్గ‌ర‌. ఇప్పుడు అది స‌రి చేసుకుందాం. మ‌ళ్లీ క‌థ మీద దృష్టి పెట్టు అన్నాను. అప్పుడు కొర‌టాల శివ మున్నాకు వ‌ర్క్ చేశాడు. అత‌ను వ‌చ్చి 'బృందావ‌నం' క‌థ చెప్పాడు. వెంట‌నే నేను ఎన్టీఆర్‌ను ఒప్పిస్తాను అని చెప్పాను. ఎందుకంటే.. ఎన్టీఆర్ అప్ప‌టి వ‌ర‌కు సీరియ‌స్ సినిమాలు చేశాడు. ఒక ఫ్యామిలీ సినిమా ప‌డితే బాగుంటుంది అనిపించింది. వెళ్లి ఎన్టీఆర్‌ను క‌లిసి చెప్పాను. విన‌గానే భ‌లే ఉంద‌ని అన్నాడు. ఆ త‌ర్వాత కొడాలి నాని వీళ్లంద‌రూ ఓకే అన్నారు. అలా సెట్ చేసి చేశాం. తార‌క్ కూడా కొత్త లుక్ లో క‌నిపించాడు. అంద‌రూ ముందు ట్రోల్ చేశారు. కానీ, త‌ర్వాత బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. వాళ్ల ఇంట్లో వాళ్ల‌కి వారం రోజుల ముందే సినిమా వేశాం. వాళ్లంతా చూసి చాలా చాలా హ్యాపీ. అప్పుడే తార‌క్ వాళ్ల గృహ‌ప్ర‌వేశం. కొత్త ఇంట్లోకి వెళ్తున్నావు. 'బృందావ‌నం' బ్లాక్ బస్ట‌ర్ కొడుతున్నాం అని చెప్పాను. అలానే జ‌రిగింది." 

ఐదు రోజులు షూట్ చేసి ర‌కుల్ ని వ‌ద్ద‌న్నాను.. 

"మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్' క‌థ అనుకున్న‌ప్పుడు ప్ర‌భాస్ మ‌లేషియాలో 'బిల్లా' షూటింగ్ లో ఉన్నాడు. వెళ్లి అక్క‌డ క‌థ చెప్పాం. అప్పుడు సెకండ్ హాఫ్ మీద డౌట్ ఉంది అన్నాడు ప్ర‌భాస్. స‌రే షూటింగ్ అయ్యాక వ‌చ్చాక విను. మార్పులు చేస్తాం అని చెప్పాను. ఇండియా వ‌చ్చిన ప్ర‌భాస్.. నా ఆఫీస్‌కు వ‌చ్చాడు. నిజానికి క‌థ‌కు నో చెప్ప‌డానికి వ‌చ్చాడు. కానీ, మొత్తం విని బ‌య‌టికి వ‌చ్చి గ‌ట్టిగా ప‌ట్టుకుని, నో చెప్దాం అని వ‌చ్చాను. కానీ, నువ్వు న‌న్ను లాక్ చేశావు. ఏం మ్యాజిక్ చేశావు అన్న అని అన్నాడు. ఇక ఆ త‌ర్వాత ర‌కుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా అనుకున్నాం. ఐదు రోజులు షూట్ చేశాం. ర‌ష్ చూసేస‌రికి మాకు ఎవ్వ‌రికీ న‌చ్చ‌లేదు. అస్స‌లు సంతృప్తిగా లేము. సినిమా అంతా అమ్మాయి మీద ఉంది. ఎమోష‌న్స్ పండివ్వాలి. సెకెండ్ హాఫ్‌లో చాలా స‌న్న‌గా ఉంది ర‌కుల్. వ‌ర్కౌట్ అవ్వ‌దు అనిపించింది. ఐదు రోజులు అయ్యాక షూట్ ఆపేసి వ‌ద్ద‌ని చెప్పాం. ప్ర‌భాస్ కి చెప్పాం. ఎవ‌రైనా స్ట్రాంగ్ హీరోయిన్ కావాలి అన్నాను. వెంట‌నే కాజ‌ల్ అని అన్నారు. అయితే, ఇప్ప‌టికే ‘డార్లింగ్’ చేస్తున్నాను అన్నాడు. అయితేనేం అని చెప్పి.. కాజ‌ల్ ని అడిగితే ఓకే చెప్పింది. అలా ర‌కుల్ ప్లేస్ లో కాజ‌ల్ వ‌చ్చింది. ఫ‌స్ట్ టైం అలా చేయ‌డం.. చాలా బాధ అనిపించింది. కానీ, సినిమా కంటే ఏదీ ముఖ్యం కాదు నాకు" అని త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నారు దిల్ రాజు.    

Also Read: బాలకృష్ణ బ్రాండ్ న్యూ అవతార్‌తో 'అన్‌స్టాపబుల్ 4' - స్టార్ట్ చేసేది ఎప్పుడో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget