అన్వేషించండి

Bunny Vas : పావలా కోసం కొట్టుకుంటున్నాం - పర్సంటేజీ ఇష్యూపై బన్నీ వాస్ టాప్ రీజన్స్

Bunny Vas Reaction : టాలీవుడ్ ఇండస్ట్రీలో పర్సంటేజీ విధానం అమలు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ డిమాండ్‌పై నిర్మాత బన్నీ వాస్ రియాక్ట్ అయ్యారు.

Producer Bunny Vas Reaction About Percentage Sharing Issue : రెంటల్ విధానంలో కాకుండా పూర్తిగా పర్సంటేజీల విధానం అమలు చేయాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఇండస్ట్రీ పెద్దలను కోరింది. సింగిల్ స్క్రీన్లకు పర్సంటేజీ విధానం అమలు చేయాలని... లేకుంటే సినిమాలు ప్రదర్శన నిలిపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అద్దె విధానంలో సినిమా ప్రదర్శించడం వల్ల ఏడాదిలో 9 నెలలు నష్టాల్నే చూస్తున్నామని వాపోయారు. దీనిపై తాజాగా ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ రియాక్ట్ అయ్యారు.

పావలా కోసం...

ఇండస్ట్రీలో అందరి ఆదాయం పడిపోయిందని... పెద్ద సినిమాలకు కూడా ఆదాయం రూపాయి నుంచి అర్ధరూపాయికి పడిపోయిందని బన్నీ వాస్ ట్వీట్ చేశారు. 'ప్రస్తుతం సినిమాలకు వస్తున్న వందల కోట్ల కలెక్షన్స్... ఆడియన్స్ పెరగడం వల్ల వచ్చినవి కాదు. టికెట్ రేట్స్, ఇతర ధరలు పెరగడం వల్ల  వచ్చినవని అర్థం చేసుకోవాలి. అంటే, సగటు ప్రేక్షకుడు థియేటర్‌కు రావడం తగ్గిపోయింది. వచ్చే కొద్ది మంది ప్రేక్షకుల మీదే అధిక భారం వేసి వసూళ్లు పెంచుకుని, దాన్నే భారీ కలెక్షన్లు అని చెప్పుకోవడం కన్నా పెద్ద తెలివి తక్కువతనం ఇంకొకటి ఉండదు.

చిన్న సినిమాల పరిస్థితి ఇంకా దారుణం. వారి ఆదాయం పావలాలో ఎవరు ఎంత తీసుకోవాలి అని మనం కొట్టుకుంటున్నాం కానీ, అసలు మన రూపాయి ఆదాయం ఎందుకు పోయిందో మాత్రం మర్చిపోతున్నాం. ఇక్కడ నిర్మాతలు నష్టపోతున్నారు. అదే విధంగా సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు కూడా నష్టపోతున్నారు, ఇది వాస్తవం. ఇందులో ఎలాంటి సందేహం లేదు.' అంటూ రాసుకొచ్చారు.

Also Read : రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ లాంచ్ డీటెయిల్స్... ఎప్పుడు, ఎక్కడంటే?

టాప్ రీజన్స్ ఇవే...

ఈ పరిస్థితి ఎందుకు  వచ్చిందనే టాప్ రీజన్స్ ఓసారి చూస్తే...

1. హీరోలు సినిమాలు పూర్తి చేయడానికి చాలా ఎక్కువ టైం తీసుకోవడం. సగటు ప్రేక్షకుడిని థియేటర్‌కు తీసుకురావడంలో హీరోల పాత్ర చాలా ముఖ్యమని ఎవరు అవునన్నా, కాదన్నా ఇది నిజం. హీరోల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఇండస్ట్రీలో హీరోలు రెండు సంవత్సరాలకు ఒక సినిమా మాత్రమే చేస్తే, ప్రేక్షకుడికి సినిమాలపై ఆసక్తి క్రమంగా తగ్గిపోతుంది. దాని ప్రభావం కేవలం పెద్ద సినిమాలపైనే కాదు, చిన్న సినిమాల మీద కూడా పడుతుంది.

2. సినిమాలను కేవలం 27 రోజుల్లోనే OTTలో విడుదల చేయడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోవడం.

3. ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయి కంటెంట్ లేకపోవడం. 'ఇంత ఖర్చు పెట్టి థియేటర్‌కు వెళ్లాల్సిన అవసరమా?' అనే భావన ఆడియన్స్‌లో రావడం.

4. మల్టీప్లెక్సుల్లో అధిక క్యాంటీన్ ధరలు.

ఇవే కారణాలు కావచ్చొని తన అభిప్రాయం వ్యక్తం చేశారు బన్నీ వాస్. ఇందులో మూడే మన చేతుల్లో ఉన్నాయని... కంటెంట్ పూర్తిగా మన నియంత్రణలో ఉండదని చెప్పారు. ప్రధాన సమస్యపై పోరాడకుండా... ఇప్పటికే తగ్గిన ఆదాయంపై పోరాడడం వల్ల ఏం లాభం చేకూరుతుంది? అంటూ ట్వీట్ చేశారు.

Also Read : ఓటీటీలోకి విజువల్ వండర్ అవతార్ 3 - పండోరా గ్రహాన్ని ఎలా రక్షించారు... తెలియాలంటే ఇప్పుడే చూసెయ్యండి!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
Naga Babu: భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Irumudi First Day Collections : మాస్ మహారాజ ఖాతాలో మరో హిట్ - ఇరుముడి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
మాస్ మహారాజ ఖాతాలో మరో హిట్ - ఇరుముడి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget