అన్వేషించండి

Jawan 2: ‘పాన్ ఇండియా’ పదాన్ని వాడకండి, ‘జవాన్ 2’లో నా క్యారెక్టర్ చూసి ఆశ్చర్యపోయా - ప్రియమణి

సీనియర్ హీరోయిన్ ప్రియమణి ‘జవాన్’ చిత్రంలో కీలకపాత్ర పోషించింది. ప్రస్తుతం 2022లో ఓటీటీలో విడుదలైన ‘భామాకలాపం’ సీక్వెల్ లో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

సీనియర్ హీరోయిన్ ప్రియమణి వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతోంది. ఉత్తరాది, దక్షిణాది చిత్రాలు అనే తేడా లేకుండా ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తోంది. హీరోయిన్ ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ప్రియమణి,  తమిళ చిత్రం ‘పరుత్తివీరన్‌’తో నటనకుగాను జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. పెళ్లి తర్వాత నటనా ప్రాధాన్యత ఉన్న చిత్రాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్‌’ మూవీలో కీలపాత్ర పోషించింది.  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పలు కీలక విషయాలను ఆమె వెల్లడించింది.

‘జవాన్’లో నా పాత్ర చూసి ఆశ్చర్యపోయా- ప్రియమణి

‘జవాన్’ చిత్రంలో అవకాశం వచ్చినట్లు తెలియగానే సంతోషం కలిగిందని చెప్పింది ప్రియమణి. అయితే, ఏదో క్యామియో పాత్ర ఉంటుందని భావించినట్లు వెల్లడించింది.  కానీ, షారుఖ్ టీమ్ లో కీలక పాత్ర చేసే అవకాశం రావడంతో ఆశ్చర్యపోయినట్లు వెల్లడించింది. ‘జవాన్’ చిత్రం అద్భుత విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉందని చెప్పింది. 2013లో విడుదలైన ‘చెన్నై ఎక్స్ ప్రెస్’లో షారుఖ్ తో కలిసి నటించిన విషయాన్ని గుర్తు చేసుకుంది. అప్పట్లో ఓపాటలో ఆయనతో జతకట్టినట్లు వివరించింది.  ఈ పాట కోసం 5 రోజులు తనతో పని చేయగా,  ‘జవాన్’ చిత్రం కోసం తనతో ఏకంగా 4 నెలల పాటు పని చేసినట్లు తెలిపింది. అట్లీ దర్శకత్వం వహించిన ‘జవాన్’ చిత్రంలో, షారుఖ్ కు సాయం చేసే ఆరుగురు స్త్రీలలో ఒకరైన లక్ష్మి పాత్రను ప్రియమణి పోషించింది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. ఇప్పటి వరకు  రూ.574.89 కోట్లు వసూలు చేసింది.

‘పాన్ ఇండియన్’ పదాన్ని వాడకపోవడం మంచిది- ప్రియమణి

ఇక  ‘పాన్ ఇండియన్’ మూవీస్ విషయంలో ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇకపై మనం పాన్-ఇండియన్ అనే పదాన్ని ఉపయోగించకపోవడం మంచిదని భావిస్తున్నట్లు చెప్పింది.  “మనమందరం భారతీయులం. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా ఉండకూడదు. సౌత్ కు చెందిన శ్రీదేవి, జయప్రద బాలీవుడ్ లో అద్భుతంగా రాణించారు. నార్త్ కు చెందిన రేఖ, వైజయంతిమాల అద్భుత చిత్రాలతో అలరించారు.  ప్రస్తుతం ఉత్తరాది, దక్షిణాది కళాకారులు సమాన అవకాశాలు పొందుతున్నారు.  మనకు అన్ని చోట్లా అవకాశాలు వస్తున్నాయి. పాన్ ఇండియన్ మూవీ, పాన్ ఇండియన్ యాక్టర్ అని ఉపయోగించడం మానుకోవడం మంచింది. ప్రేక్షకుల ఆలోచనా విధానం కూడా మారింది. సౌత్ లో బాలీవుడ్ స్టార్స్ ను చక్కగా ఆదరిస్తున్నారు” అని ప్రియమణి తెలిపింది.  

షారుఖ్ అద్భుతమైన వ్యక్తి- ప్రియమణి

ఇక నటుడు షారుఖ్ ఖాన్ పై ప్రియమణి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  ఇక పదేండ్ల క్రిత షారుఖ్ ఎలా ఉన్నాడో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడని  వెల్లడించింది. ఇంకా చెప్పాలంటే, గతంతో పోల్చితే ఇప్పుడు మరింత యంగ్ గా కనిపిస్తున్నాడని తెలిపింది. తాను వర్క్ చేసిన నటుల్లో షారుఖ్ అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించింది. ప్రియమణి ప్రస్తుతం 2022లో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన తెలుగు చిత్రం ‘భామాకలాపం’ సీక్వెల్ లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

Read Also: అందుకే అక్షయ్ సినిమా నుంచి నానా పటేకర్‌ను తీసేశారా? ‘జంగిల్’ మేకర్స్‌పై నానా హాట్ కామెంట్స్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Peddi Advance Booking: 'పెద్ది'తో రామ్ చరణ్ రికార్డుల వేట... అడ్వాన్స్ బుకింగ్స్‌తో బాక్సాఫీస్ సునామీ
'పెద్ది'తో రామ్ చరణ్ రికార్డుల వేట... అడ్వాన్స్ బుకింగ్స్‌తో బాక్సాఫీస్ సునామీ
Balakrishna: వింటేజ్ బాలకృష్ణ కాదు... న్యూ ఏజ్ - అప్డేట్ ఇచ్చిన NBK111 టీమ్
వింటేజ్ బాలకృష్ణ కాదు... న్యూ ఏజ్ - అప్డేట్ ఇచ్చిన NBK111 టీమ్
Lalit Modi Sushmita Sen Breakup: సుస్మితా సేన్‌తో బ్రేకప్... రీజన్ రివీల్ చేసిన లలిత్ మోడీ
సుస్మితా సేన్‌తో బ్రేకప్... రీజన్ రివీల్ చేసిన లలిత్ మోడీ
Ram Charan Vs NTR: రామ్ చరణ్ vs ఎన్టీఆర్... 'ఆర్ఆర్ఆర్' తర్వాత బిజినెస్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది?
రామ్ చరణ్ vs ఎన్టీఆర్... 'ఆర్ఆర్ఆర్' తర్వాత బిజినెస్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది?

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Ticket Price Hike In Telangana:
Peddi Ticket Price Hike In Telangana: "పెద్ది"కి గుడ్ న్యూస్- తెలంగాణలో టికెట్‌ ధరలు పెంపు
Minister Ponnam Prabhakar counter to Pawan Kalyan: ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
NHAI Toll Exemption List: టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
AP DSC Sports Quota Controversy: ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
Kanpur Petrol Pump Scam: ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Embed widget