Rajinikanth : రజనీకాంత్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న మలయాళ స్టార్... ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా?
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఓ మలయాళ స్టార్ హీరో మాత్రం రిజెక్ట్ చేశారట. ఆయనెవరంటే ?
![Rajinikanth : రజనీకాంత్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న మలయాళ స్టార్... ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా? Prithviraj Sukumarans shocking revelation on rejecting to direct Rajinikanth at L2 Teaser Launch Event Rajinikanth : రజనీకాంత్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న మలయాళ స్టార్... ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/27/52afd03818b8b18c77be6767c22837f317379591424361106_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rajinikanth : స్టార్ హీరోలతో సినిమా చేయాలని ఎంతోమంది అప్ కమింగ్ దర్శకులు కలలు కంటారు. దిగ్గజ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించే ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ రజనీకాంత్ లాంటి స్టార్ హీరో కి దర్శకత్వం వహించే ఛాన్స్ వస్తే, ఓ డైరెక్టర్, హీరో మాత్రం ఆ అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకున్నారట. పైగా ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించడం ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది. ఆ స్టార్ డైరెక్టర్ మరెవరో కాదు పృథ్వీరాజ్ సుకుమారన్.
రజనీతో మూవీ మిస్
మలయాళ స్టార్ హీరోలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒకరు. హీరోగా మలయాళ, తెలుగు సినిమాల్లో నటిస్తూనే... మరోవైపు దర్శకుడిగా ప్రతిభని చాటుకుంటున్నారు పృథ్వీరాజ్. తాజాగా ఈ హీరో దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ అవైటింగ్ మలయాళ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఎల్2ఇ ఎంపురాన్'. మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ మూవీ 'లూసిఫర్' అనే బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్. త్వరలో రిలీజ్ కబోతున్నా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా టీజర్ ని రిలీజ్ చేశారు. 'ఎల్2ఇ ఎంపురాన్' టీజర్ లాంచ్ ఈవెంట్ లోనే పృథ్వీరాజ్ సుకుమార్ మాట్లాడుతూ రజనీకాంత్ సినిమాకు దర్శకుడిగా చేసే ఛాన్స్ ను చేజార్చుకున్నట్టు వెల్లడించారు.
నిజానికి మిస్ అయింది అనడం కన్నా ఆయన రిజెక్ట్ చేశారు అనడం కరెక్ట్. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటో కూడా ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ దర్శకత్వం వహిస్తున్న 'ఎల్2ఇ ఎంపురాన్' మూవీని లైకా ప్రొడక్షన్స్ నిర్మాత సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. అయితే గతంలోని వీళ్ళిద్దరి కాంబినేషన్లో రజనీకాంత్ హీరోగా ఓ మూవీ రావాల్సి ఉందట. అప్పట్లో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా సినిమాలపై ఫోకస్ పెట్టారు. మరోవైపు దర్శకుడిగా అప్పుడప్పుడే కెరీర్ ను స్టార్ట్ చేస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదట. నిజానికి సుభాస్కరన్ చెప్పిన టైంకి ఆ ప్రాజెక్ట్ పూర్తవ్వడం సాధ్యమయ్యే పని కాదని భావించి పృథ్వీరాజ్ ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేశారట. అయినప్పటికీ ఈ నిర్మాత, హీరో ఇద్దరూ టచ్ లోనే ఉన్నారు. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ పృథ్వీరాజ్ సుకుమారన్ "ఆయన లండన్ లో ఉన్నప్పుడల్లా వెళ్లి కలిసేవాడిని. చాలా సంవత్సరాల తర్వాత ఇద్దరం కలిసి చివరకు 'ఎల్2ఇ ఎంపురాన్' మూవీని తెరకెక్కించాము" అని వెల్లడించారు.
"Lyca offered me an opportunity to direct #Rajinikanth sir. This opportunity was so good for a new director like me. They wanted the project to take off at a particular timeline, but I couldn't come up with a subject for #Rajinikanth sir"
— AmuthaBharathi (@CinemaWithAB) January 26, 2025
- #Prithviraj pic.twitter.com/ChphJSrwiv
'లూసిఫర్ 3'ని అనౌన్స్ చేసిన సుకుమారన్
ఈ క్రమంలోనే 'ఎల్2ఇ ఎంపురాన్' మూవీకి దర్శకత్వం వహిస్తూ, కీలక పాత్ర పోషించిన పృథ్వీరాజ్ సుకుమారన్ మరో ముఖ్యమైన విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే 2019లో రిలీజ్ అయిన 'లూసిఫర్' మూవీకి 'ఎల్2ఇ ఎంపురాన్' సీక్వెల్ అన్న విషయం తెలిసిందే. అయితే త్వరలోనే 'లూసిఫర్ 3' కూడా రాబోతోందని పృథ్వీరాజ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా రిలీజైన టీజర్ తో 'ఎల్2ఇ ఎంపురాన్' మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. మరోవైపు దీనికి మూడో పార్ట్ కూడా రాబోతోందని మేకర్స్ అనౌన్స్ చేయడం మమ్ముక్క అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
Read Also : Thandel First Review: 'తండేల్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... ఎడిట్ రూమ్‌లో మూవీ చూసిన అల్లు అరవింద్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)