Nag Ashwin: అన్నింటికీ ముగింపు కథే కల్కి - రావణుడు, దుర్యోధనుడు పాత్రలే కలియుగంలో..
Nag Ashwin on Kalki Story: డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి మూవీపై సాలీడ్ అప్‌డేట్ ఇచ్చారు. కల్కి జర్నీ పేరుతో తాజాగా ఆయన ఆసక్తికర వీడియో షేర్ చేశారు. ఇందులో అసలు కల్కి కథ ఎలా పుట్టిందో వివరించారు.
Nag Ashwin About an epic journey into the future of Prelude Of Kalki 2898 AD: 'కల్కి 2898 AD' ప్రమోషన్స్ విషయంలో నాగ్ అశ్విన్ ప్లాన్ ఎవరికి అర్థం కావడం లేదు. మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది సైలెంట్‌గా సాలిడ్ అప్‌డేట్స్ వదులుతూ మూవీపై బజ్ క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పటికే ట్రైలర్, ఫస్ట్ సింగిల్‌తో సినిమాపై బజ్ పెంచాడు. మొదటి నుంచి కల్కి మూవీ కథపై ఆడియన్స్‌లో ఓ క్యూరియాసిటీ ఉంది. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ అంటున్నారు. కానీ దీనికి మైథలాజికల్ టచ్ కూడా ఇచ్చాడు నాగ్ అశ్విన్. దీంతో కల్కికల్కి కథ, కథనంపై ఆసక్తి నెలకొంది.
అసలు ఈ సినిమా ఎలా ఉంటుంది? సైన్స్‌కు పురాణాలు జోడించడం సాధ్యమేనా? అసలు నాగ్ అశ్విన్ విజన్ ఎంటి? ఈ కథ ఆయనకు ఎలా తట్టింది.. ఇలా ఆడియన్స్‌లో ఎన్నో రకాల సందేహాలు ఉన్నాయి. ఇక వాటన్నింటికి చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ మేరకు 'వరల్డ్ ఆఫ్ కల్కి' పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో అసలు కల్కి కథ రాయడానికి ఎన్నేళ్లు పట్టింది.. ఈ కథ ఆయనకు ఎలా తట్టిందనేది వంటి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. భవిష్యత్తులోకి ప్రయాణం ఇంటూ రిలీజ్ చేసిన ఈ వీడియో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ..
బెసిగ్గా ఈ కథ అన్నింటికి క్లైమాక్స్ అన్నారు. అసలు కలియుగంలో ఎలా జరుగుతుంది, ఎలా జరగొచ్చు అనేది బేస్ చేసుకుని తీసిన సినిమా అన్నారు. "కల్కి సినిమా ఒక్క ఇండియన్ ఆడియెన్స్‌కి మాత్రమే కాదు ప్రపంచంలోని వారంతా కనెక్ట్ అవుతారు. నాకు చిన్నప్పటి నుంచి పౌరాణిక సినిమాలపై ఆసక్తి ఎక్కువ. అందులో భైరవ దీపం, ఆదిత్య 369 వంటి సినిమాలు నా ఫేవరేట్. అవి చూసినప్పుడు ఈ సినిమా ఎలా తీశారబ్బా అనిపించేది. అలాగే హాలీవుడ్ 'స్టార్ వరల్డ్' సినిమా చూసినప్పుడు చాలా బాగుంది అనిపించింది. కానీ ఇలాంటివి మన దగ్గర జరగవా? ఇవన్ని విదేశాల్లోనే జరుగుతాయా? అనిపించేది. మన పురాణాల్లో రాసిన అతిపెద్ద యుద్దం మహారాభారతం. మహాభారతంలో ఎన్నో గొప్ప పాత్రలు ఉన్నాయి. కృష్ణావతారంతో అది అంతమవుతంది.
View this post on Instagram
ఆ తర్వాత కలియుగం మొదలవుతుంది. ఈ కలియుగం ఎలా మొదలవుతుంది.. ఎలా ఉంటుందనే దానిపై కథ రాయాలనుకున్నా. ప్రతి యుగంలో కలి పురుషుడిలా ప్రవర్తించేవారు ఉంటారు. ఒక యుగంలో రావణాసురుడు.. మరో యుగంలో దుర్యోధనుడు.. కలియుగంలో ఎలా ఉంటారనేదే ఈ కథ. కలియుగంలో కల్కి ఎలా ప్రవర్తించాడు.. అతడితో పోరాటం చేయడం వంటివి చూపించాం. కలియుగంలో దశావతారమైన కల్కి ఎలా ఉంటుందనేది కథగా రాశాను. అదే మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నా. ఈ కథ రాయడానికి నాకు ఐదేళ్లు సమయంలో పట్టింది. మరి కల్కి ఆడియన్స్ ఎంత రీచ్ అవుతుందో చూడాలి" అంటూ నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. కాగా కల్కి మూవీ జూన్ 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.
Also Read: 'కల్కి 2898 AD' రికార్డుల జోరు - రిలీజ్‌కు ముందే బాక్సాఫీస్ షేక్ చేస్తున్న ప్రభాస్