అన్వేషించండి

Preethi Pagadala: మా నాన్న ముద్దు సీన్లు వద్దన్నారు, అయినా వాళ్లు వినలేదు: ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రీతి పగడాల

Preethi Pagadala: టాలీవుడ్‌లో మరో ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్.. హీరోయిన్‌గా మారింది. తనే ప్రీతి పగడాల. త్వరలోనే హీరోయిన్‌గా వెండితెరపై వెలగనున్న ఈ భామ.. తన తండ్రికి ఇచ్చిన మాట గురించి బయటపెట్టింది.

Instagram Influencer Preethi Pagadala: గత కొన్నేళ్లలో ఎంతోమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ సెన్సేషన్స్ సినిమాల్లో అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందరిలాగా ఒకే కంటెంట్‌ను ఫాలో అవ్వకుండా తమకంటూ కొత్త కంటెంట్‌ను క్రియేట్ చేసుకొని ఎక్కువమంది నెటిజన్లు ఆకట్టుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎంతోమంది.. ప్రస్తుతం వెండితెరపై కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి ప్రీతి పగడాల కూడా యాడ్ అయ్యింది. అమెరికన్ స్లాంగ్‌లో తెలుగులో మాట్లాడుతూ లైఫ్‌స్టైల్ వీడియోలు షేర్ చేసేది ప్రీతి. ఇక ఇండస్ట్రీలో హీరోయిన్‌గా పరిచయమవుతుండగా పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.

గ్లామర్ పాత్రలు ఓకే..

టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమయ్యి.. హాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది అవంతిక. ఇక అవంతిక లాగానే ప్రీతి కూడా ఒక ఇండో అమెరికన్. అందుకే తన తెలుగు అలా ఉండేది. అమెరికన్ స్లాంగ్‌లో వీడియోలు చేయడంతో ప్రీతి వైరల్ అయ్యింది. త్వరలోనే తను హీరోయిన్‌గా నటించిన ‘పతంగ్’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే సందర్భంలో తాను పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో గ్లామర్ పాత్రలు చేయడంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ప్రీతి. ‘‘ఇప్పటికే గ్లామర్ పాత్రల కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. గ్లామర్ అంటే ఓకే కానీ ఇంటిమేట్ సీన్స్ మాత్రం చేయను. నాన్న మాత్రం ముద్దు సీన్స్ అసలు చేయొద్దు అని చెప్పారు’’ అంటూ తన తండ్రి గురించి చెప్పుకొచ్చింది.

వరుసగా ఫోన్లు..

‘‘మా నాన్న నన్ను నమ్మి ఇంత దూరం పంపారు. ఆయన చెప్పిన ఒక్క మాట దాటకుండా ఉండలేనా అని అనుకున్నాను. ఆయన మీద గౌరవంతో నేను సినిమాల్లో ముద్దు సీన్స్ చేయకూడదని అనుకుంటున్నాను. అది ఎలాగైనా కచ్చితంగా చేయాల్సిందేమీ కాదు. చిన్న బట్టలు వేసుకోవడంలో అయితే నాకేం ప్రాబ్లమ్ లేదు. ముద్దు సీన్ చేయను అని చెప్పినా వినకుండా ఒక మూవీ టీమ్ దాదాపు రెండు వారాలు ఫోన్లు చేశారు. మంచి డైరెక్టర్, మంచి మూవీ అని చెప్పి ఒప్పించడానికి ప్రయత్నించారు. అయినా నో చెప్పాను. పదేళ్ల తర్వాత నేను పెద్దదాన్ని అయ్యి, నేనేం చేయాలో మా నాన్న చెప్పకుండా ఉన్నప్పుడు అలాంటి సీన్స్ చేస్తానేమో. అప్పుడు ఎవరూ పట్టించుకోరు’’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ప్రీతి పగడాల.

ఇబ్బందేమీ లేదు..

తనను సినిమా అవకాశాల కోసం సంప్రదిస్తున్న సమయంలో ఇబ్బందికరమైన ఎక్స్‌పీరియన్స్ అయితే ఏమీ ఎదురవ్వలేదని తెలిపింది ప్రీతి. ఒకవేళ తనకు సినిమా చేయాలని అనిపించకపోతే మా నాన్న ఒప్పుకోవడం లేదు అంటూ తన తండ్రి మీద తోసేస్తానని బయటపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రొడక్ట్స్‌కు ప్రమోషన్స్ చేస్తే.. తనను పూర్తిగా ఇన్‌ఫ్లుయెన్సర్ అని ఫిక్స్ అయిపోతారని, సినిమాల్లో అవకాశాలు తగ్గుతాయని అభిప్రాయం వ్యక్తం చేసింది ప్రీతి. ప్రస్తుతం తనకు హాలీవుడ్ గురించి, అక్కడ జరిగే ఆడిషన్స్ గురించి ఇంకా ఏమీ తెలియదని, దానికి ప్రయత్నించాలంటే సమయం పడుతుందని చెప్పింది. ఇక తను హీరోయిన్‌గా లాంచ్ అవుతున్న ‘పతంగ్’.. సమ్మర్‌లో విడుదల అవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Also Read: అల్లు అర్జున్ మూవీలో ఆ పాత్ర చెయ్యాలన్నారు - ఏదో తేడా కొడుతుందని వద్దన్నా: హీరో విశాల్

టాప్ హెడ్ లైన్స్

I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Samantha Cooking Show : సమంత హోస్ట్‌గా కుకింగ్ షో - సెలబ్రిటీస్ వంటలు వెరీ స్పెషల్... ప్రోమో చూశారా!
సమంత హోస్ట్‌గా కుకింగ్ షో - సెలబ్రిటీస్ వంటలు వెరీ స్పెషల్... ప్రోమో చూశారా!
Ameer Log: రానా చేతికి 'అమీర్ లోగ్'... బస్తీల్లో పెరిగిన కుర్రాళ్ళే హీరోలుగా... సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రానా చేతికి 'అమీర్ లోగ్'... బస్తీల్లో పెరిగిన కుర్రాళ్ళే హీరోలుగా... సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

వీడియోలు

Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget