అన్వేషించండి

The Raja Saab Collections : ప్రభాస్ ది రాజా సాబ్ కలెక్షన్స్ - నాలుగు రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లో డార్లింగ్ హారర్ ఫాంటసీ

‌The Raja Saab Day 4 Collections : ప్రభాస్ 'ది రాజా సాబ్' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. 4 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లో చేరింది. అటు ఓవర్సీస్‌లోనూ టికెట్ బుకింగ్స్‌లో అదరగొడుతోంది.

Prabhas's The Raja Saab Four Days Worldwide Collections : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ 'ది రాజా సాబ్' మంచి కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఫస్ట్ డే మిక్స్‌డ్ టాక్ వచ్చినా ప్రభాస్ ఓల్డ్ గెటప్ సీన్స్ యాడ్ చేసినప్పటి నుంచీ సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ డేనే 100 కోట్ల కలెక్షన్స్ దాటేసిన మూవీ 4 రోజుల్లో 200 కోట్ల క్లబ్‌లో చేరింది.

4 రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?

'ది రాజా సాబ్' నాలుగు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.201 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మూవీ టీం వెల్లడించింది. 'టాలీవుడ్ సంక్రాంతి పండుగ సీజన్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హవా కొనసాగుతోంది.' అంటూ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్, పిల్లలు మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపింది.

ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 112 కోట్ల వసూళ్లు సాధించింది. ఇండియావ్యాప్తంగా 100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం. ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్స్‌లో మూవీకి భారీగా టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగిస్తూ ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ నెంబర్ క్రియేట్ చేసేందుకు 'రాజా సాబ్' రెడీ అవుతోందని మూవీ టీం చెబుతోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @peoplemediafactory

Also Read : 'పరాశక్తి' మూవీ కొత్త కాంట్రవర్శీ - బ్యాన్ చేయాలని డిమాండ్... అసలు రీజన్ ఏంటంటే?

మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్స్‌‌గా నటించారు. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ రోల్ చేశారు. వీరితో పాటే జరీనా వహాబ్, వీటీవీ గణేష్, సత్య, సప్తగిరి, బొమ్మన్ ఇరానీ, ప్రభాస్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. మారుతి దర్శకత్వం వహించగా... తమన్ మ్యూజిక్ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ప్రభాస్ ఓల్డ్ గెటప్, యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

స్టోరీ ఏంటేంటే?

దేవనగర సంస్థాన ఒకప్పటి జమీందార్ గంగాదేవి (జరీనా వహాబ్) తన మనవడు రాజు అలియాస్ రాజా సాబ్ (ప్రభాస్)తో కలిసి సాధారణ జీవితం గడుపుతూ ఉంటుంది. నానమ్మ అంటే రాజా సాబ్‌కు ప్రాణం. అయితే, వయసు ప్రభావంతో తన గతం అంతా మర్చిపోయిన గంగాదేవి తన భర్త కనకరాజు (సంజయ్ దత్) ను మాత్రం గుర్తించుకుంటుంది. తన కలలో వస్తున్న తాతను తన దగ్గరకు తీసుకురావాలంటూ మనవడిని అడుగుతుంది.

అలాంటి టైంలో కనకరాజు హైదరాబాద్‌లో ఉన్నాడని తెలిసి రాజా సాబ్ అక్కడకు వెళ్తాడు. అలా వెళ్లిన రాజు నర్సాపూర్‌లోని ఓ పాడుపడిన కోటలో చిక్కుకుంటాడు. ఎన్నో మార్మిక విద్యలు తెలిసిన కనకరాజు రాజా సాబ్‌ను చంపాలనుకుంటాడు. ఈ క్రమంలో రాజా సాబ్ తన తాతయ్యను ఎలా ఎదుర్కొన్నాడు? అసలు కనకరాజు, గంగాదేవిల గతం ఏంటి? రాజా సాబ్ జీవితంలోకి వచ్చిన భైరవి (మాళవిక మోహనన్), అనిత (రిద్ధి కుమార్), బ్లెస్సీ (నిధి అగర్వాల్) ఎవరు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget