Love Marriage For Prabhas: లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పిన ప్రభాస్! ఆ అమ్మాయి ఎవరు?
ప్రభాస్ ప్రేమలో ఉన్నాడా? ఒకవేళ ఉంటే ఆ అమ్మాయి ఎవరు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్!
![Love Marriage For Prabhas: లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పిన ప్రభాస్! ఆ అమ్మాయి ఎవరు? Prabhas says he will have a love marriage, Who is that girl? Love Marriage For Prabhas: లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పిన ప్రభాస్! ఆ అమ్మాయి ఎవరు?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/10/da6da71a70029eca48a87e6ab180ebb2_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పెళ్లి ఎప్పుడు? మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ప్రభాస్‌కు తరచూ ఎదురు అవుతున్న ప్రశ్న. ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్, బాహుబలికి 42 ఏళ్ళు. 'రాధే శ్యామ్' వంటి ప్రేమకథా చిత్రం చేయడంతో ప్రేమ, పెళ్లి గురించి మీడియా నుంచి ఆయనకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇటీవల ముంబైలో 'నిజ జీవితంలో ప్రేమ విషయంలో మీ లెక్క ఎన్నిసార్లు తప్పింది?' అని అడిగితే... 'చాలాసార్లు తప్పింది. అందుకే, నాకు ఇంకా పెళ్లి కావడం లేదని అనుకుంట' అని సరదాగా చెప్పుకొచ్చారు. అయితే... ఓ ఇంటర్వ్యూలో మాత్రం పెళ్లి గురించి ప్రభాస్ ఓపెన్ అయ్యారు.
'పెళ్లి ఎప్పుడు చేసుకోవాలని అనుకుంటున్నారు?' అని ప్రభాస్‌ను ప్రశ్నించగా... ''నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. అయితే... అది ఎప్పుడు? అనేది ఇప్పుడు చెప్పలేను. నాకు కూడా తెలియదు. నేను పెళ్లి చేసుకోవాలని మా అమ్మ కోరిక. మా ఇంట్లో డిస్కషన్స్ కూడా జరుగుతాయి'' అని చెప్పారు. 'పెద్దలు కుదిర్చిన వివాహమేనా?' అని అడిగితే... ''లవ్ మ్యారేజ్'' అని ప్రభాస్ బదులు ఇచ్చారు. సో... ప్రభాస్ ప్రేమలో ఉన్నారని అనుకోవచ్చు. అయితే... ఆ అమ్మాయి ఎవరు? అనేది ఇక్కడ టాపిక్. ఈ మధ్య ఓ ఆస్ట్రాలజిస్ట్ కూడా ఈ ఏడాది ప్రభాస్ పెళ్లి తప్పకుండా జరుగుతుందని చెప్పారు. ఏమవుతుందో చూడాలి.
Also Read: 'అందుకే నాకింకా పెళ్లి కాలేదు' ప్రభాస్ ఫన్నీ కామెంట్స్
'బాహుబలి విడుదలైన తర్వాత 5000 మంది మహిళలు పెళ్లి ప్రతిపాదనలు పంపించారని విన్నాం?' అని అడిగితే... ''కన్‌ఫ్యూజన్ స్టేట్ అది. ఎక్కువ ప్రపోజల్స్ వస్తే ఏం చేయం'' అని ప్రభాస్ సరదాగా సమాధానం ఇచ్చారు.
Also Read: ‘యుద్ధం’ చూడాలని ఉందా? ఈ 8 వెబ్‌సీరిస్‌లు కట్టిపడేస్తాయ్, డోన్ట్ మిస్!
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)