అన్వేషించండి

Salaar Runtime: ‘సలార్’ నుంచి మరో కీలక అప్ డేట్, మూవీ రన్ టైమ్ ఎంతో తెలుసా?

Salaar Runtime: ప్రభాస్ తాజాగా మూవీ ‘సలార్’ నుంచి మరో కీలక అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా రన్ టైమ్ ఫిక్స్ అయ్యింది. సెన్సార్ సర్టిఫికేషన్ కూడా కంప్లీట్ అయ్యింది.

Salaar Movie Runtime Locked: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సలార్’ రిలీజ్ డేట్ దగ్గర పడింది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నఈ సినిమా త్వరలో థియేటర్లలో అలరించనుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న అభిమానుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్  సోషల్ మీడియాను షేక్ చేసింది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ అన్ని భాషలు కలిపి 24 గంటల్లో ఏకంగా 116 మిలియన్ల వ్యూస్ అందుకుని కొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ ట్రైలర్ విషయంలో తొలుత కాస్త మిశ్రమ స్పందన లభించినా, ఆ తర్వాత పాజిటివ్ గా మారింది.   

‘సలార్’ రన్ టైమ్ ఫిక్స్

ఇక 'సలార్' పార్ట్-1 సీజ్ ఫైర్ రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆసక్తి పెరిగిపోతోంది. ‘ఆదిపురుష్’ పరాభవం తర్వాత వస్తున్న ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు. ‘బాహుబలి’ తర్వాత ఆయన నటించి ఏ సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ సినిమా అయినా, రికార్డులు బద్దలు కొడుతుందేమోనని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించి మరో కీలక అప్ అప్ డేట్ వచ్చింది. ‘సలార్’ రన్ టైమ్ ఫిక్స్ అయ్యింది. ఈ మూవీ 2 గంటల 55 నిమిషాల 22 సెకెన్లు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 3 గంటల సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అటు ఈ సినిమాకు సెన్సార్ షిప్ కంప్లీట్ అయ్యింది. ఈ మూవీకి A సర్టిఫికెట్ జారీ అయ్యింది.

భారీ రన్ టైమ్ కలిసి వచ్చేనా?

‘సలార్’ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు పెద్దమొత్తంలో ఉన్నాయి. వయెలెన్స్ కూడా పరిమితికి మించి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే A సర్టిఫికేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్తగా కనిపించనున్నట్లు సమాచారం. అయితే, 3 గంటల సినిమా అనే సరికి అభిమానులలో కాస్త ఆందోళన కలుగుతోంది. సినిమా అద్భుతంగా ఉంటే తప్ప, ప్రేక్షకులను బోర్ కొట్టదని భావిస్తున్నారు. లేదంటే నెగెటివ్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటున్నారు.

రూ. 160 కోట్లకు ఓటీటీ రైట్స్ అమ్ముడు

దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'సలార్' మూవీ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో భారీ బిజినెస్ జరుగుతోంది. ‘సలార్’ ఓటీటీ రైట్స్ రూ.160 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. 'సలార్' సినిమాని నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్‌ తో కొద్ది రోజుల కిందటే నెట్ ఫ్లిక్స్ ఈ భారీ డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు ప్రభాస్ సినిమాలన్నింటిలో ఇదే అత్యధికం కావడం విశేషం. సౌత్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, జగపతి బాబు, టిన్ను ఆనంద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.  

Read Also: బాబాయ్ హోటల్‌లో వెంకీ మామ సందడి - శ్రద్ధా శ్రీనాథ్‌తో కలిసి ఇంద్రకీలాద్రిపై వెంకటేష్ ప్రత్యేక పూజలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget