Kalki 2898 AD Collections: RRR రికార్డును బ్రేక్ చేసిన 'కల్కి 2898 AD'
Kalki 2898 AD: ప్రభాస్ నటించి 'కల్కి 2898 AD' సినిమా నాలుగో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో హిందీలో ఇప్పటి వరకూ RRR పేరిట ఉన్న రికార్డును బీట్ చేసింది.

Kalki 2898 AD Hindi Collections: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లకి పైగా వసూళ్ళు సాధించి, నాలుగో వారంలోనూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటికే ఎన్నో రికార్డులు బ్రేక్ చేసిన ఈ చిత్రం.. తాజాగా హిందీలో మరో అరుదైన రికార్డ్ నెలకొల్పింది.
ఉత్తరాదిలో 'కల్కి 2898 ఏడీ' సినిమా విజయయాత్ర కొనసాగుతోంది. హిందీలో ఆల్రెడీ రూ. 275 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అక్కడ కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడంతో శని, ఆదివారాల్లో ప్రభాస్ చిత్రానికి స్క్రీన్స్ కాస్త తగ్గాయి. అయినా సరే డీసెంట్ నంబర్స్ తో బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ గా నిలబడింది. ఫలితంగా నాలుగో వారాంతంలో ₹ 9.75 కోట్లు వసూలు చేయగలిగింది. ఓవరాల్ గా ₹ 277.40 కోట్ల కలెక్షన్స్ తో RRR రికార్డ్ ను బీట్ చేసింది.
ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం 'ఆర్.ఆర్.ఆర్'. ఈ సినిమా హిందీలో రూ. 274 కోట్ల వరకూ కలెక్ట్ చేసింది. ఇప్పుడు 'కల్కి 2898 AD' మూవీ కేవలం నాలుగు వారాల్లోనే దాన్ని క్రాస్ చేసి, హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో సౌత్ సినిమాగా అవతరించింది. ఇప్పటికే 2024లో హయ్యెస్ట్ గ్రాస్ వసూలు చేసిన హిందీ చిత్రంగా కల్కి నిలిచింది. ఈ ఏడాది 'ఫైటర్' సినిమా రాబట్టిన ₹215 కోట్ల కలెక్షన్స్ ను కేవలం 12 రోజుల్లోనే బీట్ చేసింది.
బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రాల్లో రాజమౌళి, ప్రభాస్ కాంబోలో వచ్చిన 'బాహుబలి 2' చిత్రం ₹511 కోట్ల కలెక్షన్స్ తో టాప్ ప్లేస్ లో ఉంది. కన్నడ హీరో యశ్ నటించిన 'KGF 2' సినిమా ₹435 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు 'కల్కి 2898 AD' మూవీ మూడో స్థానానికి చేరుకోగా.. RRR (₹274 కోట్లు), 2.0 (₹189 కోట్లు), సలార్ (₹170 కోట్లు), సాహో (₹145 కోట్లు), బాహుబలి-1 (₹ 119 కోట్లు), పుష్ప-1 (₹ 108 కోట్లు) సినిమాలు హిందీలో హయ్యెస్ట్ గ్రాస్ రాబట్టిన చిత్రాల జాబితాలో చోటు సంపాదించాయి.
'కల్కి 2898 AD' రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరిన 7వ భారతీయ సినిమాగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. 25 రోజుల రన్ టైమ్ ముగిసేనాటికి కేవలం మన దేశంలోనే రూ. 600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పోటీగా పెద్ద సినిమాలేవీ లేకపోవడం ప్రభాస్ కు కలిసొస్తుందని, రానున్న రోజుల్లో మరిన్ని నంబర్స్ గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వైజయంతీ మూవీస్ బ్యానర్ లో 'కల్కి 2898 AD' సినిమా రూపొందింది. ఇందులో ప్రభాస్ తో పాటుగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనె, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, మాళవిక నాయర్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ తదితరులు అతిథి పాత్రల్లో మెరిశారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.
Also Read: ప్రభాస్ జోడీగా పాకిస్తానీ బ్యూటీ - హను రాఘవపూడి గట్టిగా ప్లాన్ చేసిన్నట్లున్నాడే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

