Kalki 2898 AD Part 2: 'కల్కి 2868 ఏడీ పార్ట్ 2' షూటింగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత... ఒకేసారి ప్రభాస్ 3 సినిమాలు సెట్స్ మీదకు?
Kalki 2898 AD Part 2 : ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ ఏడాదే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లబోతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఇండియన్ సినిమాలోనే బిజీయెస్ట్ స్టార్ ఎవరు అంటే... ప్రభాస్ అని టక్కున చెప్పేస్తారు. ప్రస్తుతం చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్న ప్రభాస్ ఒకేసారి రెండు మూడు సినిమాలతో, రేయి పగలు తేడా లేకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ పై ఉండగా, మరో రెండు సీక్వెల్స్ ప్రభాస్ కోసం వెయిటింగ్ లో ఉన్నాయి. అంతే కాదు మరో ఇద్దరు దర్శకులు ప్రభాస్ ఎప్పుడు టైం ఇస్తాడా? అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మోస్ట్ అవైటింగ్ పాన్ ఇండియా 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ షూటింగ్ ఎప్పుడు మొదలు కాబోతోంది? అన్న విషయంపై అప్డేట్ ఇచ్చారు నిర్మాత అశ్వనీదత్.
జూన్‌లో 'కల్కి 2898' సీక్వెల్ సెట్స్ పైకి
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొనే ప్రధాన పాత్రలు పోషించిన భారీ పాన్ ఇండియా మూవీ 'కల్కి 2898 ఏడీ'. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా 2024లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని ఆల్రెడీ మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలా సినిమాలు ఉండడంతో, అసలు ఏ సినిమా ముందు సెట్ పైకి వెళ్ళబోతోంది అన్న విషయంలో గందరగోళం నెలకొంది. కానీ ప్రభాస్ మాత్రం కూల్ గా ఒక దాని తర్వాత ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా 'కల్కి 2898 ఏడీ' నిర్మాత అశ్వని దత్ ఓ ఇంటర్వ్యూలో సీక్వెల్ ఎప్పుడు మొదలు కాబోతోంది అనే విషయంపై అప్డేట్ ఇచ్చారు. "జూన్లో 'కల్కి 2898 ఏడి' సీక్వెల్ షూటింగ్ సెట్స్ పైకి వెళ్ళబోతోంది" అని ఆయన స్వయంగా వెల్లడించిన వీడియో వైరల్ అవుతుంది.
SHOCKINGLY #Prabhas going to Join #Kalki2898AD Part 2 Shoot From JUNE - #AshwiniDutt 😳😳😳😳😳
— GetsCinema (@GetsCinema) January 20, 2025
It Means #Prabhas going to Work #FAUJI #SPIRIT and #Kalki2898 Part 2 Films in 2025 Not a EASY TASK ✅
pic.twitter.com/PLraNNjjho
ఒకేసారి మూడు సినిమాలు
అశ్విని దత్ "కల్కి 2898 పార్ట్ 2" షూటింగ్ జూన్ లో స్టార్ట్ అవుతుంది అని వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇప్పటికే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' సినిమాని చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తికాకముందే, హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజి' మూవీ షూటింగ్ ని మొదలుపెట్టారు. ఈ రెండు సినిమాలను 2025 లోనే రిలీజ్ చేయాలనే ప్లాన్ తో శర వేగంగా పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ ప్రభాస్ షూటింగులో గాయపడడంతో 'ఫౌజీ' వచ్చేయడానికి వాయిదా పడే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఈ గ్యాప్ లోనే 'కల్కి 2898 పార్ట్ 2' గురించి నిర్మాత క్రేజీ అప్డేట్ ఇవ్వడంతో, ప్రభాస్ జూన్ నుంచి 'కల్కి 2898 ఏడీ' మూవీ సీక్వెల్ షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తోంది. 'ది రాజా సాబ్' షూటింగ్ పూర్తవుతుంది.
అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' మూవీని కూడా ప్రభాస్ స్టార్ట్ చేయనున్నాడు. మొత్తానికి ఒకే టైంలో ప్రభాస్ 'స్పిరిట్' 'కల్కి 2898 ఏడీ', 'ఫౌజీ' సినిమాల కోసం వర్క్ చేయబోతున్నారు. ఇదేమంత ఈజీ టాస్క్ కాదు. ఒకేసారి మూడు సినిమాల షూటింగ్లలో పాల్గొనడం అనేది కత్తి మీద సాము లాంటిది. అయితే ఈ మూడు సినిమాల్లో కూడా ప్రభాస్ డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నారు. మరి దీన్నెలా మేనేజ్ చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే 'సలార్ పార్ట్ 2' సంగతి ఏంటి? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ చేయడంలో బిజీగా ఉన్నారు. కాబట్టి 'సలార్ 2 ' సెట్స్ పైకి వెళ్లడానికి చాలా టైం పట్టే ఛాన్స్ ఉంది. అంతలోపు ప్రభాస్ మిగతా సినిమాలను పూర్తి చేసే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

