Prabhas Hanu Raghavapudi Movie: బెంగాలీలోనూ ప్రభాస్ - హను సినిమా రిలీజ్... రేపే టైటిల్ రివీల్!
Prabhas Fauji's Update: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా టైటిల్ ('ఫౌజీ') రేపు అనౌన్స్ చేయనున్నారు. అలాగే ఈ సినిమా రిలీజ్ గురించి అప్డేట్ ఇచ్చారు.

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ గురువారం (అక్టోబర్ 23న) ప్రభాస్ పుట్టిన రోజు (Prabhas Birthday) సందర్భంగా ఫ్యాన్స్ & ప్రేక్షకుల కోసం అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం.
ప్రభాస్ బర్త్ డేకి టైటిల్ రివీల్!
Prabhas - Hanu Raghavapudi Movie Titled Fauji: ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి 'ఫౌజీ' టైటిల్ ఖరారు చేశారనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. అయితే... ఆ విషయాన్ని పుట్టినరోజు నాడు అనౌన్స్ చేయనున్నారు. ప్రస్తుతానికి టైటిల్ టీజ్ పేరుతో ఒక పోస్టర్ విడుదల చేశారు. అది గమనిస్తే... ఓ విషయం అర్థం అవుతోంది.
బెంగాలీలోనూ 'ఫౌజీ' మూవీ రిలీజ్!
Fauji to release in Bengal also: ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. 'బాహుబలి' తర్వాత నుంచి ఆయన ప్రతి సినిమా హిందీలో భారీ ఎత్తున విడుదల అవుతోంది. తెలుగు రాష్ట్రాల కంటే హిందీ ప్రేక్షకుల నుంచి ఎక్కువ వసూళ్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. పాన్ ఇండియా రిలీజ్ అంటే... హిందీతో పాటు దక్షిణాది నాలుగు భాషలు - తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేస్తారు. మరో అడుగు ముందుకు వేసి బెంగాలీలోనూ 'ఫౌజీ'ని విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.
Also Read: బాక్సాఫీస్ బాహుబలి... అప్ కమింగ్ మూవీస్ @ 4000 కోట్లు - ఎవ్వరికీ అందనంత ఎత్తులో ప్రభాస్
View this post on Instagram
'ఫౌజీ' సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి నటిస్తున్నారు. కథానాయికగా ఆమెకు అది తొలి సినిమా. ఇంకా ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: సుదీప్ ఛటర్జీ, సంగీత దర్శకుడు: విశాల్ చంద్రశేఖర్, పాటలు: కృష్ణకాంత్.





















