Happy Birthday Prabhas: అందరి డార్లింగ్... అజాత శత్రువు... అతిథి మర్యాదల్లో కింగ్ సైజ్ హార్ట్... ప్రభాస్ వ్యక్తిత్వానికి ఫిదా
Prabhas Birthday Special: ప్రభాస్ అంటే అభిమానులకు డార్లింగ్. ఇండస్ట్రీలో అజాత శత్రువు. ఎక్కడ ఉన్నా సరే రాజే. ఎందుకు ఆయన అంటే అంత స్పెషల్. బర్త్ డే సందర్భంగా తెలుసుకోండి.

Prabhas Birthday Special: ప్రభాస్... పాన్ ఇండియా రెబల్ స్టార్. కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అయితే పెదనాన్నను మించి పాన్ ఇండియా స్థాయిలో స్టార్ అయ్యారు. ప్రేక్షకులలో అభిమానం సొంతం చేసుకున్నారు. దీని వెనుక సినిమాలు మాత్రమే లేవు. ఆయన వ్యక్తిత్వం కూడా ఉంది.
హీరోగా ప్రభాస్ సినీ జర్నీ ఎలా మొదలైంది? ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు? ఇంత వరకు రావడానికి ప్రభాస్ ఎంత కష్టపడ్డారు? అన్నది అందరికీ తెలిసిందే. 'ఈశ్వర్' సమయంలో ప్రభాస్ ఎదుర్కొన్న కష్టాలు... హిట్టు కొట్టేందుకు పడిన శ్రమ... ఓ సినిమా (బాహుబలి) కోసం ఐదేళ్ల సమయం కేటాయించే డెడికేషన్... వెరసీ ఇప్పుడు భారతీయ సినీ చరిత్రలో ఆయనకు అంటూ ప్రత్యేక చరిత్ర ఏర్పడింది.
'బాహుబలి'కి ముందు... 'బాహుబలి' తర్వాత!
ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీని బాహుబలికి ముందు... బాహుబలి తరువాత... అన్నట్టుగా డివైడ్ చేశారు. నాన్ బాహుబలి రికార్డులు అని సపరేట్‌గా ఓ బెంచ్ మార్క్ కూడా పెట్టేసుకున్నారు. బాహుబలిగా ప్రభాస్ ఇండియన్, ఇంటర్నేషనల్ మార్కెట్‌ను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అయితే వసూళ్లు, రికార్డులు కాదు... ప్రభాస్ వ్యక్తిత్వం ఆయన్ను 'ఎక్కడున్నా రాజే' అన్నట్టు చేసింది. ఆ డైలాగ్ ఆయనకు సరిగ్గా సెట్ అవుతుంది. హిట్టు ఫ్లాపులకు ప్రభాస్ అతీతంగా ఉంటారు.
కింగ్ సైజ్ హార్ట్... ప్రభాస్ ఆతిథ్యం అంతే!
ఇండస్ట్రీలో ప్రభాస్ అందరినీ సమానంగా చూస్తారు. చిన్నా పెద్దా వంటి తేడాలు ఆయన చూపించారు. దర్శక నిర్మాతల నుంచి మొదలు పెడితే చిన్న ఆర్టిస్టులు, లైట్ బాయ్ వరకు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు. ఇక ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్లు మాత్రమే కాదు... మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం ఫుడ్ పెట్టి చంపేస్తారని, ప్రభాస్ ఉన్నప్పుడు డైట్ చేయడం కుదరదని చెబుతారు. అతిథి మర్యాదల విషయంలో ప్రభాస్ ది కింగ్ సైజ్ హార్ట్.
Also Read: తెలుగులో స్పీచ్ అదరగొట్టిన ధృవ్ విక్రమ్... తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచిన 'బైసన్'
ప్రభాస్‌కు ఆన్ స్క్రీన్ ఎంత ఫాలోయింగ్ ఉంటుందో... ఆఫ్ స్క్రీన్ అంతకు మించిన ఫాలోయింగ్ ఉంటుంది. డార్లింగ్ అంటూ అందరూ ప్రేమగా పిలుచుకునే ప్రభాస్ ఆతిథ్యం గురించి దేశం మొత్తం చెబుతుంటుంది. అమితాబ్ సైతం ప్రభాస్ ఆతిథ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఓ బెటాలియన్, మిలటరీకి సరిపోయేంత ఫుడ్ పెడతాడు అని బాలీవుడ్ సెలెబ్రిటీలు ప్రభాస్‌ను ప్రశంసలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే.
ప్రభాస్ ఎప్పుడూ కూడా తన సెట్ మీదున్న ప్రతీ ఒక్కరికి కడుపుని నింపాలని, అందరికీ భోజనం పెట్టాలని పరితపిస్తుంటాడు. ఇంటికి వచ్చే అభిమానుల్ని సైతం భోజనం పెట్టి, కడుపు నింపే వరకు పంపించరని చెబుతుంటారు. అలా ప్రభాస్ ఎప్పుడూ అందరి ఆకలి గురించి ఆలోచిస్తుంటాడు. ఇక దాతృత్వంలో ప్రభాస్ మనసు చాలా పెద్దదే అని చెప్పుకోవచ్చు. కరోనా, విపత్తు సమయాల్లో కోట్లకు కోట్లు ప్రభుత్వాలకు విరాళాలు ఇస్తుంటారు.
Also Read: సమంత కుటుంబంలో ఆ దర్శకుడు... దీపావళితో మరోసారి వార్తల్లోకి వాళ్ళిద్దరి బంధం
ప్రభాస్ బర్త్ డే (అక్టోబర్ 23) సందర్భంగా తన అప్ కమింగ్ చిత్రాల నుంచి అదిరిపోయే అప్డేట్లు రానున్నాయి. ఫౌజీ నుంచి ఆల్రెడీ స్పెషల్ పోస్టర్ వచ్చింది.ప్రభాస్ బర్త్ డేకి బ్లాస్ట్ ఉంటుందని హింట్ ఇచ్చారు. 'ది రాజా సాబ్' నుంచి కూడా అదిరిపోయే అప్డేట్ రానుంది. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. 'కల్కి 2', 'స్పిరిట్' చిత్రాలకు సంబంధించిన ఎలాంటి హడావుడి ఉంటుందో చూడాలి.





















