అన్వేషించండి

Prabhas New Movie: ప్రభాస్, హను సినిమా పూజకు ముహూర్తం ఫిక్స్ - సెట్స్ మీదకు వెళ్ళేది ఎప్పుడంటే?

Prabhas Hanu Raghavapudi Movie: హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఖరారు చేశారని తెలిసింది.

'సలార్', 'కల్కి 2898 ఏడీ' విజయాలతో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) మాంచి జోరు మీద ఉన్నారు. రీసెంట్ రిలీజ్ 'ది రాజా సాబ్' ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ ప్రేక్షకులు, అభిమానులను ఆకట్టుకుంది. ఈ జోరులో కొత్త సినిమాకు పూజ చేయడానికి పాన్ ఇండియా డార్లింగ్ రెడీ అవుతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే...

ఆగస్టు రెండో వారంలో హను సినిమాకు పూజ!
ప్రేక్షకుల మనసులను హత్తుకునే హృద్యమైన ప్రేమ కథలు తెరకెక్కించడంలో స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న తెలుగు దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi)తో ప్రభాస్ ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. ఆ సినిమాకు 'ఫౌజీ' (Fauji Prabhas Movie) టైటిల్ ఖరారు చేసినట్టు టాలీవుడ్ టాక్. ఆ సంగతి దర్శకుడు అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. కానీ, లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...

ప్రభాస్, హను రాఘవపూడి సినిమా ఆగస్టు 17న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని తెలిసింది. ఆ తర్వాత వారం సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళతారట. అంటే... ఆగస్టు 24న 'ఫౌజీ' రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అధినేతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

పాకిస్తానీ నటి కదా? 'సీతా రామం' భామను ఫైనల్ చేశారా?
ప్రభాస్ సరసన ఈ సినిమాలో ఎవరు నటిస్తారు? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే... ఇందులో ఆయనది సైనికుడి పాత్ర అని, ఇండో - పాక్ బోర్డర్ నేపథ్యంలో సన్నివేశాలు ఉన్నాయని, అందుకని పాకిస్తానీ నటి సజల్ అలీని ఎంపిక చేసినట్టు ప్రచారం జరిగింది.

లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే... ఆమె బదులు మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)ను ఫైనలైజ్ చేశారని టాక్. 'సీతా రామం'తో ఆమెను తెలుగు తెరకు హను రాఘవపూడి పరిచయం చేశారు. మరొకసారి ఆమెతో సినిమా చేయనున్నారని టాక్.

రజాకార్ నేపథ్యం... బ్రాహ్మణ యువకుడిగా ప్రభాస్!?
Prabhas Role In Hanu Raghavapudi's Fauji Movie: 'ఫౌజీ'లో ప్రభాస్ బ్రాహ్మణ యువకుడిగా నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో పూజారి తనయుడిగా ఆయన కనిపిస్తారట. ఇప్పటి వరకు బ్రాహ్మణ యువకుడి పాత్రలు అంటే దర్శక రచయితలు వినోదాత్మకంగా చూపించారు. కానీ, ప్రభాస్ సీరియస్ రోల్ చేస్తారని టాక్. మరో టాక్ ఏమిటంటే... ఈ సినిమా రజాకార్ నేపథ్యంలో ఉంటుందట. మరి, ఆ బ్యాక్డ్రాప్ ఎలా డీల్ చేస్తారో? 

Also Read: 'వెంకీ' వర్సెస్ 'విశ్వం'... ఆ ట్రైన్ సీక్వెన్స్, శ్రీను వైట్ల మీద అందరి చూపు, ఏం చేస్తారో మరి?


ఇప్పటి వరకు ఇటు ప్రభాస్, అటు హను రాఘవపూడి చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉండబోతుందని తెలిసింది. ఈ సినిమా కంటే ముందు 'ది రాజా సాబ్' సినిమాతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వస్తారు. ఆ సినిమా ఏప్రిల్ 10, 2025న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తర్వాత 'సలార్ 2' రావచ్చు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898 ఏడీ' పార్ట్ 2 కూడా ఉంది.

Also Readఅబ్బబ్బా అనసూయ... ముద్దులు ఎక్కడ ఇస్తావ్ రీతూ... శ్రీముఖి మాటల్లో డబుల్ మీనింగ్!

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Embed widget