ప్రభాస్ - మారుతి మూవీ నుంచి మరోసారి లీకైన ఫోటోలు - షాకింగ్ లుక్‌లో డార్లింగ్!
మారుతీ - ప్రభాస్ సినిమాకు సంబంధించి తాజాగా కొన్ని ఫోటోలు లీకై నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో ప్రభాస్ లుక్ డిఫరెంట్ గా ఉండడం గమనించవచ్చు.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమాలకు లీకుల బెడద అస్సలు తప్పడం లేదు. ఓవైపు ప్రభాస్ నటిస్తున్న సినిమాలు ఒక్కొక్కటిగా ప్లాప్ అవుతూ వస్తుంటే మరోవైపు ఆయన చేస్తున్న లేటెస్ట్ మూవీస్‌కు సంబంధించి షూటింగ్ నుంచి ఫోటోలు లీక్ అవ్వడం అభిమానుల్లో తీవ్ర నిరాశను కలిగిస్తోంది. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న 'సలార్', 'కల్కి2898AD' సినిమాల నుంచి వరుస లీకులు బయటికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలతో పాటు ఆ మధ్య మారుతి - ప్రభాస్ మూవీకి సంబంధించి కూడా కొన్ని ఫొటోస్ లీకై నెట్టింట తెగ హల్చల్ చేశాయి. ఇక ఇప్పుడు మరోసారి మారుతీ సినిమా నుంచి ప్రభాస్ పిక్స్ లీకై సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.
'రాధే శ్యామ్', 'ఆదిపురుష్' వంటి ప్లాప్స్ తర్వాత అభిమానుల ఆశలన్నీ ప్రభాస్ నటిస్తున్న 'సలార్', 'కల్కి' సినిమాలపైనే ఉన్నాయి. ప్రభాస్ నుంచి రాబోయే చిత్రాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ నటిస్తున్న 'సలార్' విడుదలకు ముస్తాబవుతోంది. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా 'సలార్' విడుదల కానుంది. మరోవైపు 'సలార్' తర్వాత ప్రభాస్ నటిస్తున్న 'కల్కి', మారుతీ సినిమాలు షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. ప్రభాస్ తో సినిమాని అనౌన్స్ చేయకుండానే మారుతి షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాడు. గత కొంతకాలంగా ఈ మూవీ సెట్స్ నుంచి కొన్ని ఫొటోస్ లీకై సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా తాజాగా మరోసారి ఈ సినిమాకు సంబంధించి కొన్ని పిక్స్ నెట్టింట లీక్ అయ్యాయి.
Vintage looks Mass #Prabhas 🥵🔥
— . (@Umesh__Prabhas) October 14, 2023
Leaked pic from #PrabhasMaruthi sets.#BrandedFeatures | #INDvsPAK pic.twitter.com/KqJd2L2fsj
ఒక ఫైట్‌లో భాగంగా ప్రభాస్ విలన్స్‌తో పోరాడుతున్నట్లు లీకైన ఫోటోల్లో కనిపించడాన్ని గమనించవచ్చు. అయితే ఇందులో ప్రభాస్ లుక్ మాత్రం ఆశ్చర్యం కలిగించేలా ఉంది. ఇప్పటివరకు డార్లింగ్ కాస్త లావుగా కనిపించారు. కానీ తాజాగా లీక్ అయిన పిక్స్ లో మాత్రం ప్రభాస్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. దీంతో ఈ లీక్ అయిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా దీని కంటే ముందు ఇదే సినిమా నుంచి హీరోయిన్ మాళవిక మోహనన్‌కి సంబంధించిన యాక్షన్ సీన్ వీడియో లీకైన సంగతి తెలిసిందే. సెట్స్ నుంచి తరచూ ఫోటోలు లీక్ అవుతున్నా మూవీ టీమ్ ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంపై కొంతమంది డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
మరికొందరేమో కావాలని మూవీ టీం ఫొటోస్ లీక్ చేస్తున్నారంటూ అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ప్రాజెక్టు విషయానికి వస్తే.. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు బొమన్ ఇరానీ కీలక పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ తో పాటు రిలీజ్ డేట్‌ని త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం.
Also Read : విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' - అఫీషియల్ నామకరణం ఆ రోజే, టైటిల్‌తో పాటు టీజర్ కూడా!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial