అన్వేషించండి

చంద్రయాన్-3 సక్సెస్ తో మరోసారి తెరపైకి 'ఆదిపురుష్' - దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!

ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రం ఇప్పటికే తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా చంద్రయాన్-3 సక్సెస్ తో మరోసారి 'ఆదిపురుష్' ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్..

చంద్రయాన్- 3 సక్సెస్ తో మరోసారి ప్రభాస్ నటించిన 'అదిపురుష్' తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో మళ్లీ 'ఆదిపురుష్' పై ట్రోలింగ్ మొదలైంది. చంద్రయాన్-3 సక్సెస్ అయితే ఆదిపురుష్ ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? అనేగా మీ సందేహం? ఇదిగో ఇందుకే.. 

ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి చంద్రయాన్-3ని చంద్రుడి పైకి పంపించారు. ఆ మిషన్ విజయవంతం అవడం భారతీయులందరినీ గర్వపడేలా చేసింది. అదే సమయంలో ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఓ రేంజ్ రోల్ చేస్తున్నారు. చంద్రయాన్-3 కోసం రూ.615 కోట్ల బడ్జెట్ ఖర్చయింది. కానీ 'ఆదిపురుష్' కోసం ఏకంగా రూ.700 కోట్లు ఖర్చు పెట్టారు. అన్ని వందల కోట్లతో తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

దీంతో చంద్రయాన్ 3 కి అయిన బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేసి ఏం సాధించారని ‘ఆదిపురుష్’ టీమ్ ని ట్రోల్ చేస్తున్నారు నెటీజన్లు. ఈ లెక్కన చూసుకుంటే 'అదిపురుష్' కంటే తక్కువ ఖర్చుతో ఇస్రో శాస్త్రవేత్తలు భారతీయ జెండాను చంద్రమండలంపై సగర్వంగా ఎగరవేశారని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఓ నెటిజన్ అయితే.. ‘ఆదిపురుష్’కు ఖర్చు చేసిన రూ.600 కోట్లు ఇస్రో సైంటిస్టులకు ఇవ్వాల్సింది. అలా అయినా దేశానికి ఉపయోగపడేది.. అంటూ కామెంట్ పెట్టాడు. సినీ స్టార్లు, సూపర్ స్టార్లకు కాకుండా దేశం కోసం కృషి చేసే ఇలాంటి సైంటిస్టులకు సెక్యూరిటీ ఇవ్వండి అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. అంతేకాకుండా మరికొందరు 'అదిపురుష్' లాంటి చెత్త సినిమాలు తీయకుండా దేశానికి ఉపయోగపడే పనులకు డబ్బులు ఖర్చు పెడితే బాగుంటుందని ఫైర్ అవుతున్నారు.

ఈ క్రమంలోనే వివిధ సినిమాలకు సంబంధించిన బడ్జెట్లతో చంద్రయాన్-3 బడ్జెట్‌ను పోలుస్తూ ఇస్రోని తెగ ప్రశంసిస్తున్నారు నెటిజన్స్. హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోళన్ కూడా 'ఓపెన్ హైమర్' సినిమా కోసం రూ.800 కోట్లకు పైగా బడ్జెట్ ని ఖర్చు పెట్టారు. అణుబాంబు సృష్టికర్త ఆధారంగా తీసిన ఈ సినిమా ఈ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదే దర్శకుడు సుమారు పదేళ్ల కింద 'ఇంటర్‌సెల్లార్' అంతరిక్షం కాన్సెప్ట్ తో తీసిన సినిమా కోసం ఏకంగా రూ. 1350 కోట్లు ఖర్చు పెట్టాడు.

అలా సోషల్ మీడియాలో 'ఆదిపురుష్' సహా మరికొన్ని సినిమాలను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇక 'ఆదిపురుష్' విషయానికొస్తే.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ ఫిలిం మేకర్ ఓం రౌత్ మోషన్ క్యాప్చర్ త్రీడీ టెక్నాలజీ తో రూపొందించారు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో వీఎఫెక్స్, రావణుడి పాత్ర తీరు పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం ఎన్నో రకాల విమర్శలను ఎదురుకోవడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

Also Read : అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డ్, RRRకూ పురస్కారాల పంట, బెస్ట్ తెలుగు ఫిల్మ్‌గా ఉప్పెన

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget