అన్వేషించండి

Poonam Pandey: నేను బతికే ఉన్నా - షాకిచ్చిన పూనమ్ పాండే, అందుకే ఆ మరణ వార్త అంటూ వీడియో వదిలిన బ్యూటీ

Poonam Pandey: బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరణ వార్త ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ అదంతా నిజం కాదని తేలిపోయింది. త్వరలోనే లైవ్‌లోకి వచ్చి అందరికీ సమాధానమిస్తానని పూనమ్ ప్రకటించింది.

Poonam Pandey: బాలీవుడ్ నటి పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్ వల్ల మరణించిందని శుక్రవారం.. తన టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 32 ఏళ్లకే క్యాన్సర్‌తో మరణించిందంటూ సోషల్ మీడియాలో ఈ వార్త సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. కానీ ఇంతలోనే తను మరణించలేదంటూ మరొక వార్త వైరల్ అయ్యింది. తన కుటుంబం దీనిపై స్పందించలేదంటూ, ఒకవేళ నిజంగా పూనమ్ పాండే మరణిస్తే తన మృతదేహం ఏది అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంతలోనే తాను బ్రతికే ఉన్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షాక్ ఇచ్చింది పూనమ్ పాండే. దీంతో ప్రేక్షకులంతా ఒక్కసారి ఏంటి ఈ పని అంటూ ఆశ్చర్యపోతున్నారు.

అదంతా ఫేక్..

‘‘ఈ ఉదయం మేం ఎంతో బాధాకరమైన విషయాన్ని పంచుకుంటున్నాం. మాకు ఎంతో ఇష్టమైన పూనమ్ పాండేను కోల్పోయాం. సర్వైకల్ క్యాన్సర్‌ కు ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. ఆమె ప్రతి ఒక్కరితో ప్రేమ, ఆప్యాయతను పంచుకుంది. ఈ సమయంలో బాధాకరమైన విషయాన్ని పంచుకునేందుకు ఎంతో చింతిస్తున్నాం. ఆమె ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేం” అంటూ తను మరణించిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బయటపెట్టారు పూనమ్ పాండే టీమ్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా పోస్ట్ షేర్ చేసిన తర్వాత మళ్లీ తన టీమ్ నుండి ఎలాంటి స్పందన రాలేదు. తన కుటుంబం కూడా దీని గురించి ప్రకటించడానికి ముందుకు రాలేదు. దీంతో పూనమ్ పాండే బ్రతికే ఉందని చాలామందిలో అనుమానాలు మొదలయ్యాయి. చివరికి ఆ అనుమానాలే నిజమయ్యాయి.

లైవ్‌లోకి పూనమ్ పాండే..

‘మధ్యాహ్నం 1 గంటకు లైవ్‌లోకి వస్తాను. అందరి ప్రశ్నలకు సమాధానం చెప్తాను’ అంటూ పూనమ్ పాండే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ను షేర్ చేసింది. సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం కోసమే తాను ఇదంతా చేశానని ఇన్‌డైరెక్ట్‌గా హ్యాష్ ట్యాగ్‌తో బయటపెట్టింది. కానీ పూనమ్ చేసిన పనిపై చాలామంది నెటిజన్లు మండిపడుతున్నారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం కోసం ఇది మార్గం కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్రతికి ఉన్నా కూడా చనిపోయానని చెప్పడం పిచ్చి పని అంటూ తిడుతున్నారు. ఇక మరికొందరు మాత్రం లైవ్‌లోకి వచ్చిన తర్వాత పూనమ్ పాండే అసలు ఏం మాట్లాడుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

ఎవ్వరూ నమ్మలేదు..

పూనమ్ పాండే మరణ వార్తను తన సన్నిహితులు సైతం నమ్మలేకపోయారు. తన బాడీగార్డ్ అమీన్ సింగ్ సైతం దీనిపై స్పందించాడు. తను ఈ విషయం నమ్మలేకపోతున్నానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇది వినగానే పూనమ్ అక్కకు ఫోన్ చేయడానికి ప్రయత్నించినా రీచ్ అవ్వలేదని బయటపెట్టాడు. జనవరి 31న ఒక ఫోటోషూట్ కోసం ముంబాయ్‌లోని ఫినిక్స్ మాల్‌కు వెళ్లింది పూనమ్ పాండే. ఆ సమయంలో అమీన్ ఖాన్.. తన పక్కనే ఉన్నాడు. ‘‘తను చాలా ఫిట్‌గా, ఆరోగ్యంగానే అనిపించింది. తను ఎప్పుడూ తన ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యను షేర్ చేసుకోలేదు. నాకు కూడా తన ఆరోగ్యం బాలేదని ఎప్పుడూ అనిపించలేదు. తన అక్క వచ్చి నిజం చెప్తుందని ఎదురుచూస్తున్నాను’’ అంటూ పూనమ్ పాండే మరణ వార్తపై స్పందించాడు బాడీగార్డ్ అమీన్ ఖాన్.

Also Read: ముందు నీ భర్త సినిమా గురించి మాట్లాడు, ఆమీర్ ఖాన్ మాజీ భార్యకు ‘యానిమల్’ డైరెక్టర్ కౌంటర్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Embed widget