Poonamkaur: త్రివిక్రమ్‌ను వదిలిపెట్టేది లేదు - పొలిటికల్ సపోర్ట్‌తో తప్పించుకుంటున్నారంటూ పూనమ్ ఫైర్
Trivikram Srinivas: పూనమ్ కౌర్ మరోసారి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఫైర్ అయ్యారు. ఆయనపై ఈ మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేసినట్లు తాజాగా ఆధారాలు బయటపెట్టారు.

Poonam Kaur About Her Complaint Against Trivikram Srinivas: హీరోయిన్ పూనమ్ కౌర్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలన కలిగించిన సంగతి తెలిసిందే. తాజాగా.. మరోసారి దీనిపై ఆమె స్పందించారు. త్రివిక్రమ్‌ను వదిలేది లేదని.. ఆయనపై ఈ మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇన్ స్టా వేదికగా పూనమ్ చేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.
అన్నీ ఆధారాలు ఉన్నాయి
తన దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయని.. త్రివిక్రమ్‌ను ఎవరో పొలిటికల్ లీడర్ కాపాడుతున్నారని.. ఆయన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని పూనమ్ తెలిపారు. 'నేను ఇంతకు ముందే చెప్పాను. ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను. త్రివిక్రమ్‌పై ఈ మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేశాను. ఝాన్సీ గారితో మాట్లాడాను. మీటింగ్ పెడదాం అని చెప్పి ఆలస్యం చేశారు. సడన్‌గా తనను డిస్టర్బ్ చెయ్యొద్దని అన్నారు. నేను ఎవరి పేరు చెప్పలేదు. ఇండస్ట్రీలో చాలా మంది వ్యక్తులు రక్షించే త్రివిక్రమ్‌పై నాకు కంప్లైంట్ ఉంది. నేను ఈ మెయిల్‌లో రాసినట్లుగా మహిళా సంఘంతో మాట్లాడతాను.' అని పూనమ్ తెలిపారు.
అంతే కాకుండా.. తన వద్ద ఆధారాలు ఉన్నాయంటూ ఝాన్సీతో చాట్ చేసిన స్క్రీన్ షాట్లను ఆమె బయటపెట్టారు. ఈ క్రమంలో మరోసారి వీరి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: 'హరిహర వీరమల్లు' నుంచి తుపాన్ వచ్చేసింది - పవర్ ఫుల్ 'అసుర హననం' సాంగ్ చూశారా?
ఆ సమయంలోనే..
మలయాళ ఇండస్ట్రీ, మీటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న టైంలోనే పూనమ్ కౌర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. సినిమా అవకాశాల పేరుతో తనను ఛీట్ చేశారని.. ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేశారని పూనమ్ ఆరోపించారు. దీనిపై 'మా'లో కూడా ఫిర్యాదు చేసినట్లు గతంలో చెప్పారు పూనమ్. అయితే, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ సోషల్ మీడియా వేదికగానే ఆమె ప్రశ్నించారు. రాజకీయంగా తనను ఇబ్బందికి గురి చేశారని.. అందుకే ఆ విషయాన్ని అప్పట్లో వదిలేశానని ఆమె చెప్పారు.
ఆ సమస్యతో బాధ పడుతున్నా
ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్వీట్స్‌తో వార్తల్లో నిలిచే పూనమ్ కౌర్ తాజాగా ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో ఆయన్ను కలిసి ఓ బహుమతిని అందించారు. ఈ ఫోటోను ఇన్ స్టా వేదికగా ఆమె షేర్ చేశారు. ఈ ఈవెంట్‌లో పాల్గొనే ముందు తనకు ఆరోగ్యం ఏమీ బాగాలేదని.. ఫుడ్ ఎలర్జీతో బాధ పడుతున్నట్లు చెప్పారు. అంతే కాకుండా ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధితో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నట్లు.. తన ఆరోగ్య సమస్యల్ని చెబుతూ ట్వీట్ చేశారు. అందువల్లే తాను అలా కనిపిస్తున్నట్లు తెలిపారు. దీంతో నెటిజన్లు ఆమెకు హెల్త్ టిప్స్ అందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక త్రివిక్రమ్‌తో సమస్య సమసిపోయిందని అంతా భావిస్తుండగా.. మళ్లీ తాజాగా ఆ వివాదానికి సంబంధించి పోస్ట్ పెట్టారు పూనమ్. ఆయన్ను వదిలేది లేదంటూ తాను 'మా'కు ముందే ఫిర్యాదు చేశానని చెబుతూ తాజాగా ఆధారాలు బయటపెట్టారు. మరి దీనిపై 'మా' ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. మరోవైపు.. ఆమె ఆరోపణలపై ఇప్పటివరకూ త్రివిక్రమ్ నుంచి ఎలాంటి స్పందన లేదు.






















