అన్వేషించండి

Poonam Kaur: గురూజీ ఏదైనా చేసి తప్పించుకోగలడు - త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ కామెంట్స్

Trivikram: త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘గుంటూరు కారం’ కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే ఇది ఆయన సొంతంగా రాసుకున్న కథ కాదని వార్తలు వినిపిస్తుండగా.. పూనమ్ కౌర్ కౌంటర్ ఇచ్చింది.

Poonam Kaur on Trivikram: నటి పూనమ్‌ కౌర్‌కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే అస్సలు పడదు. దానికి కారణం ఏంటో స్పష్టంగా బయటపెట్టకపోయినా.. సోషల్ మీడియా వేదికగా త్రివిక్రమ్‌ను టార్గెట్ చేస్తూ పలుమార్లు వ్యాఖ్యలు చేసింది ఈ భామ. తాజాగా మరోసారి త్రివిక్రమ్‌పై ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్ చేస్తూ.. గురూజీ థింగ్స్ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను జతచేసింది.

గుడ్డివారు అయిపోయారు..
‘‘ఆయన ఏదైనా చేసి తప్పించుకోగలడు. ఆయన చేసే తప్పు పనులను గుర్తించలేనంత గుడ్డివారు అయిపోయారు జనాలు. గత ప్రభుత్వంలో మామూలు ప్రజలకు తమ సమస్యలను చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి ఆఫీస్‌కు వెళ్లలేనంత స్వేచ్ఛ ఆయనకు మాత్రమే ఉండేది. అది ఎందుకు అని నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది’’ అంటూ ఒక వ్యక్తిపై ట్విటర్ ద్వారా ఆరోపణలు చేసింది పూనమ్ కౌర్. కానీ ఆ వ్యక్తి ఎవరు అని మాత్రం చెప్పలేదు. చివరిగా ‘గురూజీ థింగ్స్’ అంటూ హ్యాష్‌ట్యాగ్ పెట్టడంతో మరోసారి పూనమ్.. త్రివిక్రమ్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పూనమ్ కౌర్.. త్రివిక్రమ్‌పై ఆరోపణలు చేయాలనుకున్న ప్రతీసారి ఇలా గురూజీ హ్యాష్‌ట్యాగ్‌ను తన ట్వీట్స్‌కు జతచేరుస్తూ ఉంటుంది.

సొంత కథ కాదు..
ప్రస్తుతం త్రివిక్రమ్.. తన అప్‌‌కమింగ్ మూవీ ‘గుంటూరు కారం’ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. జనవరి 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతికి ఇతర పెద్ద హీరోల సినిమాలతో పోటీ ఉన్నా కూడా ‘గుంటూరు కారం’కు తగినంత హైప్ క్రియేట్ అవ్వడంతో మూవీ టీమ్ ధీమాతో ఉన్నారు. పైగా అన్ని సినిమాలతో పోలిస్తే.. ప్రేక్షకులంతా ముందుగా ‘గుంటూరు కారం’కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఈ మూవీ విడుదల దగ్గర పడుతున్న సమయంలో ‘గుంటూరు కారం’ కథపై సోషల్ మీడియాలో పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇది త్రివిక్రమ్ సొంతంగా రాసుకున్న కథ కాదని కొందరు నెటిజన్లు అనుకుంటున్నారు.

కీర్తి కిరీటాలు’ నవల ఆధారంగా..
యద్ధనపూడి సులోచనారాణి రాసిన ‘కీర్తి కిరీటాలు’ అనే నవలలోని కథ ఆధారంగా ‘గుంటూరు కారం’ మూవీ తెరకెక్కిందని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కానీ ఒక నవలను సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటే కాపీరైట్స్‌ను దక్కించుకోవాలి. ఆ తర్వాత నవల రాసినవారికి తగిన క్రెడిట్స్ ఇవ్వాలి. కానీ త్రివిక్రమ్ అవేమీ చేయకుండానే కీర్తి కిరీటాలు కథను కాపీ కొట్టారని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. నితిన్ హీరోగా తను తెరకెక్కించిన ‘అ..ఆ..’ మూవీ సమయంలో కూడా ఇదే విధంగా కాంట్రవర్సీ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు మరోసారి ‘గుంటూరు కారం’ విషయంలో కూడా అదే విధంగా కాంట్రవర్సీలు క్రియేట్ అవుతున్నాయి.

Also Read: ఏంటి గురూజీ, 'గుంటూరు కారం' కూడా కాపీయేనా?

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget