By: ABP Desam | Updated at : 07 Mar 2022 12:19 PM (IST)
పూజా హెగ్డే
సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'మహర్షి' సినిమాలోనూ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'అరవింద సమేత వీర రాఘవ'లోనూ పూజా హెగ్డే నటించారు. ప్రభాస్‌తో ఆమె నటించిన 'రాధే శ్యామ్' త్వరలో విడుదల కానుంది. రామ్ చరణ్‌కు జంటగా నటించిన 'ఆచార్య' ఏప్రిల్ 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే. తెలుగులో యంగ్ సూపర్ స్టార్స్ సరసన ఆమె సినిమాలు చేస్తున్నారు. మరి, పవన్ కల్యాణ్‌తో సినిమా ఎప్పుడు? అంటే... దర్శకుడిని అడగమని పూజా హెగ్డే చెబుతున్నారు.
'పవన్ కల్యాణ్ - హరీష్ శంకర్ సినిమా (భవదీయుడు భగత్ సింగ్) షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు?' అని పూజా హెగ్డేను 'ఏబీపీ దేశం' అడగ్గా... "హరీష్ శంకర్ గారికి ఫోన్ చేయండి. అడగండి' అని సమాధానం ఇచ్చారు. పవన్ సినిమాలో తాను నటిస్తున్నట్టు నేరుగా చెప్పలేదు. కానీ, కన్ఫర్మ్ చేశారు.
త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానున్న మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. త్రివిక్రమ్ దర్శకత్వంలో, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణంలో మూడోసారి సినిమా చేస్తుండటం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. అలాగే, మహేష్ బాబుతో రెండోసారి సినిమా చేయడం కూడా! ఒకసారి సినిమా చేసిన దర్శక - నిర్మాతలు, హీరోలతో మళ్ళీ సినిమాలు చేసే అవకాశాలు వస్తుండటం సంతోషంగా ఉందని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రెండు సినిమాలు చేశానని, మూడో సినిమా త్వరలో చేసే అవకాశాలు ఉన్నాయని ఆమె తెలిపారు.
Also Read: పూజా హెగ్డేతో కిస్సింగ్ సీన్స్ పై ప్రభాస్ రియాక్షన్
హరీష్ శంకర్ నెక్స్ట్ సినిమా పవన్ కల్యాణ్ 'భవదీయుడు భగత్ సింగ్'. అందులో పూజా హెగ్డే కథానాయికగా ఎంపిక చేశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 'రాధే శ్యామ్' విడుదల కోసం ఎదురు చూస్తున్న పూజా హెగ్డే... ఈ ఏడాది మొత్తం మీద ఐదు సినిమాలతో సందడి చేయనున్నారు.
Also Read: సమంత - పూజా హెగ్డే మధ్య గొడవ ముగిసినట్టేనా!?
Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు
Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!
RRR Visual Effects: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!
Mahesh Babu vs Bollywood: మహేష్ బాబును నేషనల్ మీడియా టార్గెట్ చేసుకుందా? ఆ యాడ్‌పై ట్రోలింగ్!
Jagapathi Babu: 'ఇది అవసరం, లేకపోతే ఒళ్లు బలుస్తుంది' - జగపతి బాబు కామెంట్స్‌కు నెటిజన్స్ ఫిదా!
TRS ZP Chairman In Congress : కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ - గుట్టుగా చేర్పించేసిన రేవంత్ !
Akhilesh On Temples : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
ప్రేమ పేరుతో నమ్మించి, రెండుసార్లు గర్భవతిని చేసి అబార్షన్ - ప్రియుడిని నిలదీస్తే ఏమన్నాడంటే !
Yasin Malik Convicted: వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను ఆ కేసులో దోషిగా తేల్చిన కోర్టు