అన్వేషించండి

Prabhas: పూజాహెగ్డేతో కిస్సింగ్ సీన్స్ పై ప్రభాస్ రియాక్షన్ 

ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ఈ స్టార్ 'రాధేశ్యామ్' సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. మార్చి 11న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ప్రస్తుతం ముంబైలో పలు ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ప్రభాస్. 

ఈ క్రమంలో ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నిజానికి ప్రభాస్ కి సిగ్గు చాలా ఎక్కువ. సినిమాల్లో రొమాంటిక్ సీన్స్, తన బాడీని ఎక్స్ పోజ్ చేసే సన్నివేశాల్లో నటించడానికి ప్రభాస్ చాలా ఇబ్బంది పడతారు. అందుకే దర్శకనిర్మాతాలకు ముందుగానే అలాంటి సీన్లు లేకుండా ఉండాలని చెబుతుంటారు. ఒకవేళ కథ డిమాండ్ చేస్తే మాత్రం.. ఇక తప్పని పరిస్థితి. అలాంటప్పుడు సెట్ లో అతి తక్కువ మంది ఉండేలా చూసుకుంటారు మేకర్స్. ఆ విధంగా ప్రభాస్ కొంత కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. 

అయితే 'రాధేశ్యామ్' సినిమా విషయంలో డైరెక్టర్ కి ఎలాంటి రిక్వెస్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ.. కాబట్టి సినిమాలో రొమాన్స్ కచ్చితంగా ఉంటుంది. కథ ప్రకారం.. ప్రభాస్ తన కోస్టార్ పూజాహెగ్డేతో కొన్ని కిస్సింగ్ సీన్స్ లో నటించాల్సి వచ్చిందట. ఆ సన్నివేశాలకు 'నో' చెప్పలేకపోయానని.. ఎందుకంటే ఈ సినిమాలో రొమాన్స్ ఉండాల్సిందేనని ప్రభాస్ చెప్పుకొచ్చారు. కమర్షియల్ సినిమాల్లో అలాంటి సీన్స్ ను అవైడ్ చేయొచ్చు కానీ 'రాధేశ్యామ్' లాంటి ప్రాజెక్ట్స్ లో పక్కన పెట్టలేమని అన్నారు. 

ఇన్ని సినిమాల్లో నటించినా.. ఇప్పటికీ తనకు సిగ్గు పోలేదని.. కోస్టార్స్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడానికి ఇబ్బంది పడతానని.. అలానే షర్ట్ లేకుండా క్రూ మెంబర్స్ ముందు యాక్ట్ చేయడం కూడా తన వల్ల కాదని చెప్పుకొచ్చారు. అందుకే ఇలాంటి సీన్స్ ను ఐసోలేటెడ్ ఏరియాల్లో చిత్రీకరించామని దర్శకులను రిక్వెస్ట్ చూస్తుంటానని తెలిపారు ప్రభాస్. చాలా కాలం తరువాత ప్రభాస్ ఓ లవ్ స్టోరీలో నటించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి వాటిని ఈ సినిమా ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)

టాప్ హెడ్ లైన్స్

Raaka Vs Avatar : అవతార్ Vs రాకా - హడావిడి చెయ్యొద్దన్న ఫ్యాన్... కంపేరిజన్‌పై అల్లు అర్జున్ మేనేజర్ రియాక్షన్
అవతార్ Vs రాకా - హడావిడి చెయ్యొద్దన్న ఫ్యాన్... కంపేరిజన్‌పై అల్లు అర్జున్ మేనేజర్ రియాక్షన్
Crime Thriller OTT : ఓటీటీలోకి రామ్ చరణ్ మెచ్చిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి రామ్ చరణ్ మెచ్చిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Chiranjeevi Kaaka : మరోసారి చిరు లీక్స్ - 'కాకా'కు కదిరికి లింక్ ఏంటో చెప్పేసిన మెగాస్టార్... ఫ్యాన్స్ వెయిటింగ్
మరోసారి చిరు లీక్స్ - 'కాకా'కు కదిరికి లింక్ ఏంటో చెప్పేసిన మెగాస్టార్... ఫ్యాన్స్ వెయిటింగ్
Samavarthi Teaser Review : టైగర్ వర్సెస్ మహాదేవ్ - 'సమవర్తి'లో సత్యదేవ్ పవర్ ఫుల్ రోల్‌... డోంట్ మిస్ దిస్ అడ్వెంచరస్ యాక్షన్
టైగర్ వర్సెస్ మహాదేవ్ - 'సమవర్తి'లో సత్యదేవ్ పవర్ ఫుల్ రోల్‌... డోంట్ మిస్ దిస్ అడ్వెంచరస్ యాక్షన్

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Secretariat Employees: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
HYDRA News: లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్య‌క్తి ప్రాణాలు కాపాడిన హైడ్రా, మూసాపేట‌లో గంటన్నర పాటు రెస్క్యూ ఆపరేషన్
లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్య‌క్తి ప్రాణాలు కాపాడిన హైడ్రా, మూసాపేట‌లో గంటన్నర పాటు రెస్క్యూ ఆపరేషన్
Mega DSC Sports Quota: ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు
ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు
Asian Games Medal: షూటింగ్‌లో బోణీ కొట్టిన భారత్.. ఇలావేనిల్ డబుల్ ధమాకా.. వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో సిల్వర్ సాధించిన షూటర్..
షూటింగ్‌లో బోణీ కొట్టిన భారత్.. ఇలావేనిల్ డబుల్ ధమాకా, వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో సిల్వర్ సాధించిన షూటర్..
Mrunal Thakur Social Thriller OTT : నాలుగేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ మూవీ - సస్పెన్స్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
నాలుగేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ మూవీ - సస్పెన్స్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేరు కోరిన రేవంత్ రెడ్డి.. టాలీవుడ్ డైరెక్టర్లలో ఎవరి మాట నెగ్గుతుందో!
వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేరు కోరిన రేవంత్ రెడ్డి.. టాలీవుడ్ డైరెక్టర్లలో ఎవరి మాట నెగ్గుతుందో!
Suryapet Road Accident: హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
The Paradise : 'ఒక్కడి ఫేస్‌లోనూ నవ్వు లేదు' - ది ప్యారడైజ్‌పై ట్రోలింగ్స్... నాని, శ్రీకాంత్ ఓదెల ఇచ్చి పడేశారుగా...
'ఒక్కడి ఫేస్‌లోనూ నవ్వు లేదు' - ది ప్యారడైజ్‌పై ట్రోలింగ్స్... నాని, శ్రీకాంత్ ఓదెల ఇచ్చి పడేశారుగా...
Embed widget