Peter Telugu Release: తెలుగులోకి మరో కన్నడ హారర్... 'సు ఫ్రమ్ సో' మేజిక్ రిపీట్ చేస్తుందా?
Rajesh Dhruva's Peter Update: కన్నడ ఇండస్ట్రీ భారీ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తోంది. వాటి మధ్య వచ్చిన హారర్ బేస్డ్ కామెడీ 'సు ఫ్రమ్ సో' తెలుగులోనూ హిట్ అయ్యింది. ఇప్పుడు మరొక సినిమా 'పీటర్' వస్తోంది.

హారర్... సస్పెన్స్... థ్రిల్లర్... ఈ జానర్ సినిమాల కోసం వెయిట్ చేసే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ప్రతి భాషలోనూ ఉంటారు. అందుకే హారర్ జానర్ సినిమాలు డబ్ చేసి ఇతర భాషల్లో విడుదల చేసినా మంచి విజయాలు వస్తాయి. రీసెంట్‌గా కన్నడ నుంచి తెలుగుకు వచ్చిన రాజ్ బి శెట్టి 'సు ఫ్రమ్ సో' మంచి విజయం సాధించింది. ఇప్పుడు మరొక కన్నడ సినిమా కూడా తెలుగులోకి వస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
తెలుగులోనూ రాజేష్ ధ్రువ 'పీటర్'
Raajesh Dhruva's Peter Telugu Release Update: రాజేష్ ధ్రువ ప్రధాన పాత్రలో నటించిన కన్నడ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ 'పీటర్'. వృద్ధి స్టూడియోస్ పతాకంపై రవి హిరేమత్, రాకేష్ హెగ్డే నిర్మించారు. సుకేష్ శెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో జాన్వి రాయల, రవిక్ష శెట్టి ఇతర ప్రధాన తారాగణం. తాజాగా సినిమా టీజర్ విడుదల చేశారు.
'పీటర్' టీజర్ గమనిస్తే... కేరళ నేపథ్యంలో తెరకెక్కించినట్టు అర్థం అవుతోంది. ఆ రాష్ట్ర సంప్రదాయాల్ని, సుందరమైన లొకేషన్లను చూపించారు. 'జెస్సీ మళ్లీ వచ్చింది. డెవిడ్‌ను ఇక్కడకు తీసుకురా... చెండే వాయిద్యం అంటే మాకు దైవంతో సమానం. ఎవరైనా అవమానిస్తే ఊరుకోను' అంటూ సాగిన టీజర్ ఉత్కంఠ కలిగించింది. 'పీటర్' కథ ఏమిటి? జెస్సీ ఎవరు? అనేది థియేటర్లలో చూడాలి.
Also Read: మహేష్ - రాజమౌళి సినిమాకు టైటిల్ ఇష్యూ... అదే పేరుతో మరో చిన్న సినిమా
'పీటర్'లో రాజేష్ ధ్రువ ఇంటెన్స్ పర్ఫామెన్స్ హైలైట్ అయ్యేలా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల కానుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాక విడుదల తేదీ అనౌన్స్ చేయనున్నారు.
Also Read: సందీప్ రెడ్డి వంగాకు 'కింగ్' కౌంటర్... ప్రభాస్ vs షారుఖ్... ఎవరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్?
Peter Movie Cast And Crew: రాజేష్ ధృవ హీరోగా నటించిన 'పీటర్'లో జాన్వీ రాయల, రవిక్షా శెట్టి, రామ్ నాద గౌడ్, వరుణ్ పటేల్, ప్రతిమా నాయక్, రఘు పాండేశ్వర్, రాధాకృష్ణ కుంబ్లే, దీనా పూజారి, సిద్దు, భరత్, మను కాసర్‌గోడ్, రక్షిత్ దొడ్డెర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ శెట్టి, కళ: దేవరాజ్, ఛాయాగ్రహణం: గురుప్రసాద్ నార్నాడ్, సంగీతం: రిత్విక్ మురళీధర్, నిర్మాణ సంస్థ: వృద్ధి స్టూడియోస్, నిర్మాతలు: రవి హిరేమత్ - రాకేష్ హెగ్డే, రచయిత & దర్శకుడు: సుకేష్ శెట్టి.





















