అన్వేషించండి

Payal Rajput : ఆ ప్రొడ్యూసర్లు నా ఇమేజ్‌ను పాడుచేయాలని చూస్తున్నారు, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను - పాయల్ రాజ్‌పుత్

Payal Rajput: ప్రస్తుతం టాలీవుడ్‌లో పాయల్ రాజ్‌పుత్‌కు తనకంటూ ఒక ఇమేజ్ ఉంది. దానిని తన సినిమా నిర్మాతలే పాడుచేయాలని చూస్తున్నారని తాజాగా బయటపెట్టింది ఈ భామ.

Payal Rajput About Rakshana Movie: ప్రస్తుతం హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌కు టాలీవుడ్‌లో ఒక గుర్తింపు ఉంది. బోల్డ్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను తన గ్లామర్‌తో మెప్పించడంలో పాయల్ వెనకాడదు అని అంటుంటారు. అయితే పాయల్ క్రేజ్‌ను అడ్డం పెట్టుకొని కొందరు ప్రొడ్యూసర్స్ తన ఫేమ్‌ను ఉపయోగించుకోవాలని చూస్తున్నారట. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. అంతే కాకుండా అలా చేస్తున్నవారిపై కఠినమైన చర్యలు కూడా తీసుకుంటానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తను నటించిన మూవీ నిర్మాతలకు వార్నింగ్ ఇస్తూ పాయల్ చేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.

పేమెంట్ ఇవ్వలేదు..

‘నేను 2019, 2020లో రక్షణ అనే సినిమాకు షూటింగ్ చేశాను. దానికి ముందుగా '5Ws' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా రిలీజ్ లేట్ అయ్యింది. దీంతో నా రీసెంట్ సక్సెస్‌లను దృష్టిలో పెట్టుకొని నాకు ఇవ్వాల్సిన అమౌంట్‌ను క్లియర్ చేయకుండానే నన్ను ప్రమోషన్స్‌కు రమ్మని అడుగుతున్నారు. నాకు ముందుగానే కమిట్మెంట్స్ ఉండడంతో వారితో నా టీమ్ సంప్రదించింది. కానీ వాళ్లు నన్ను తెలుగు సినిమా నుంచి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు’ అంటూ తన అప్‌కమింగ్ మూవీ ‘రక్షణ’ గురించి క్లారిటీ ఇచ్చింది పాయల్ రాజ్‌పుత్. అంతే కాకుండా వాళ్లు తనను బెదిరిస్తున్న విషయం కూడా బయటపెట్టింది.

నేను అంగీకరించను..

‘రక్షణ సినిమాకు నేను డిజిటల్ ప్రమోషన్స్ చేస్తానని నా టీమ్.. వాళ్లతో చెప్పారు. కానీ ముందుగా పేమెంట్స్ క్లియర్ చేయమని అడిగారు. కానీ వాళ్లు కాంప్రమైజ్ అవ్వడానికి ఒప్పుకోలేదు. నా పేరును ఉపయోగించుకొని నా ఇమేజ్‌ను పాడుచేయాలని చూస్తున్నారు. అది నేను అస్సలు అంగీకరించను. ఇటీవల జరిగిన మీటింగ్స్‌లో నా గురించి తప్పుగా మాట్లాడారు. డిస్ట్రిబ్యూటర్ పాయల్‌ను కొన్ని చూపించమని అడిగారని, అలా చేయకపోతే వాళ్లు సినిమాను యాక్సెప్ట్ చేయను అన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అంటూ ‘రక్షణ’ మూవీ టీమ్ వల్ల తనకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి బయటపెట్టింది పాయల్ రాజ్‌పుత్.

మొదటిసారిగా అలాంటి పాత్రలో..

‘మేము ఇప్పుడు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్లు ఇంకా పేమెంట్స్ క్లియర్ చేయకపోగా నా అంగీకరం లేకుండా సినిమాను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు’ అని వివరించింది పాయల్. ‘రక్షణ’లో పాయల్ రాజ్‌పుత్ తన కెరీర్‌లో మొదటిసారిగా ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఈ మూవీకి ప్రందీప్ ఠాకోర్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించనుంది. జూన్ 7న ‘రక్షణ’ విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. దీంతో పాయల్.. ఈ విషయం గురించి నోరువిప్పింది. రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయడంతో పాటు పాయల్ అంగీకారం లేకుండా మూవీ టీజర్‌ను విడుదల చేసినట్టు తెలుస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal)

Also Read: ఎన్నికల తరవాత బాలీవుడ్‌ని వదిలేస్తా, అబద్ధాలతో నిండిపోయిన ఇండస్ట్రీ ఇది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget