Bro Audience review - ‘బ్రో’ ప్రేక్షకుల రివ్యూ: ఆ చివరి 20 నిమిషాలు చాలట - ఈ మూవీ ఫ్యాన్స్ కోసమా?
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ టైమ్ కలిసి నటించిన ‘బ్రో’ మూవీ ఎలా ఉంది? ప్రేక్షకులకు నచ్చిందా? ఈ మూవీ చూసిన ఆడియెన్స్ ఏమంటున్నారు?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా 'బ్రో' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తమిళ చిత్రం ‘వినోదయ సీతం’కు రీమేక్ అనే సంగతి తెలిసిందే. అయితే, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగులో పవర్ స్టార్ అభిమానులు మెచ్చే విధంగా మార్పులు చేశారు. ఈ మూవీకి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు. ఎన్నో అంచనాల మధ్య ఈ మూవీ ప్రేక్షకుల్లోకి వచ్చింది.
మూవీ ఎలా ఉంది?
సాధారణంగా పవన్ కళ్యాణ్ మూవీ అంటేనే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. పైగా మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. తమ ఫేవరెట్ హీరోలు ఇద్దరినీ ఒకే స్క్రీన్‌పై కనబడితే ఆ కిక్కే వేరప్పా అన్నట్లుగా శుక్రవారం థియేటర్ల వద్ద సందడి చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా ఈ మూవీపై అంచనాలు పెంచేసింది. మరి.. ప్రేక్షకులకు ఈ మూవీ నచ్చిందా?
‘బ్రో’ మూవీపై మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీకి అంచనాలకు తగినట్లు లేదని.. చాలా సీన్లు సాగదీసినట్లు ఉందని అంటున్నారు. తమన్ మ్యూజిక్ నిరుత్సాహపరిచిందని, కొన్ని సీన్లు అనవసరంగా తీశారేమో అనే అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు.
మూవీలో ఫస్ట్ ఆఫ్ పూర్తిగా ఫ్యాన్స్ కోసమేనని, సెకండాఫ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చుతుందని పలువురు అంటున్నారు. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు త్రివిక్రమ్ మార్క్ సీన్స్ కనిపిస్తాయని తెలుపుతున్నారు. ఓవరాల్‌గా మూవీ బాగుందని అంటున్నారు. తమ్ముడు, తొలి ప్రేమ, గుడుంబా శంకర్, భీమ్లా నాయక్, జల్సా, ఖుషీ మూవీస్‌లో ఉన్న హై మూమెంట్స్ అన్నీ ‘బ్రో’లో పెట్టేశారని, దర్శకుడికి ఆడియెన్స్ పల్స్ తెలుసని మరొకరు తెలిపారు. ఇది పక్కా ఫ్యాన్స్ కోసం తీసిన మూవీ అని పేర్కొన్నారు. కొందరు పాజిటీవ్ రివ్యూలు కూడా ఇస్తున్నారు. ఇంకా ఎవరెవరు ఏమంటున్నారో కింద ట్వీట్లలో చూడండి.
#Bro : 4/5
— John wick 𝕏 (@RohithRuthless) July 28, 2023
pk energy & fan moments 🔥🔥
Trivikram dialogues 👌👌
Thaman bgm music 🔥
Entertainment n funn 💯
#BroTheAvathar #BRO@PawanKalyan @IamSaiDharamTej pic.twitter.com/x7mm13Vqp6
#Bro Final review:
— CinemaPichodu (@SaiTarun2409) July 28, 2023
Oka #Thammudu
Oka #tholiprema
Oka #GudumbaShankar
Oka #BheemlaNayak
Oka #Jalsa
Oka #Khushi
Anni movies lo unna high moments Anni oka cinema lo petesadu.
Director knows the audience pulse#BroTheAvathar - Treat for fans #PowerStar #PawanaKalyan #SaiDharamTej pic.twitter.com/Nc82fmsNTV
Bro మూవీ రిపోర్ట్.
— akhill 9999 (@akhillreddy) July 28, 2023
First Half: భీమవరం
Secound Half: గాజువాక.
Final : అనంతపురం. 🔥🔥🔥🔥 #BroTheAvathar
#BroTheAvatar FDFS 🎬 @kamala_cinemas
— Mersal Vasanth (@MersalVasant22) July 28, 2023
Good Fantasy Emotional Comedy Film
Fun & Enjoy ... Watchable 💯#PawanKalyan 🥳 Pakka For PK Fans@PawanKalyan garu🔥 #PowerStar@IamSaiDharamTej gud 👍@MusicThaman na bgms & Songs🔥✨ @thondankani na #BRO#BroTheAvathar #Leo pic.twitter.com/jQdkOwTUh6
2nd off kuda same Good 👌
— వైజాగ్ BR🕗 🔥😎 (@Rams_pkcult) July 28, 2023
Overall ga Families ki nachutundi 👍
Fans enjoy chestharu 🔥
Climax inkoddiga better ga unte Hit Bomma ayyundedi
My rating 2.75/5#BroTheAvathar https://t.co/iJNkVLTQMd
Parledu aa Bheemla Nayak kante chaala better #BroTheAvathar
— Shamshu (@SpideyxStark_) July 28, 2023
ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి జోడిగా కేతిక శర్మ నటించింది. ప్రియా ప్రకాష్ వారియర్ తేజ్ కి చెల్లి పాత్రలో కనిపించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీను నిర్మించింది. తమన్ సంగీతం అందించాడు. సినిమాని లిమిటెడ్ బడ్జెట్ లోనే పూర్తి చేయడంతో టికెట్ రేట్లు అందుబాటులోనే ఉన్నాయి. ఇది కూడా ఒకరకంగా మూవీకి పాజిటివ్‌గా మారనుంది. మరి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందనేది వీకెండ్ కలెక్షన్స్ తర్వాత స్పష్టమవుతుంది.
Also Read : ధనుష్ మాస్ విధ్వంసం - 'కెప్టెన్ మిల్లర్' టీజర్, ఆ యాక్షన్ మామూలుగా లేవుగా
Join Us on Telegram: https://t.me/abpdesamofficial