By: Suresh Chelluboyina | Updated at : 13 Apr 2023 08:17 PM (IST)
Image Credit: Renu Desai/Instagram
హీరో కొడుకు అంటే.. భవిష్యత్తులో తప్పకుండా హీరోగానే ఎంట్రీ ఇస్తాడని, అభిమానులను ఆనందంతో ముంచెత్తుతాడని అనుకుంటారు. అయితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ విషయంలో అది ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే.. అఖిరా, నటనకు బదులు సంగీతాన్ని ఎంచుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గా కొత్త జర్నీని స్టార్ట్ చేశాడు. ఈ విషయాన్ని అకీరా తల్లి రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘మ్యూజిక్ డైరెక్టర్ అకీరా నందన్’ అని ఉన్న చిన్న వీడియో క్లిప్‌ను రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సంగీత దర్శకుడిగా తనకు ఇష్టమైన రంగంలోకి అడుగుపెడుతున్న తన కొడుకు అకీరాను ఆశీర్వదించాలని ఆమె కోరారు. దీంతో రేణు ఫాలోవర్లు అకీరాకు ‘ఆల్ ది బెస్ట్’ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.
అకీరాకు చిన్నప్పటి నుంచే సంగీతమంటే చాలా ఇష్టమని రేణు దేశాయ్ చాలాసార్లు చెప్పారు. అయితే, సంగీత దర్శకుడు అయ్యేంత ఇష్టమనే సంగతి ఇటీవలే తెలిసింది. తాజాగా ‘Writer's Block’ అనే షార్ట్ ఫిల్మ్‌కు అకీరా సంగీతాన్ని అందించాడు. చెప్పాలంటే.. ఒక ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంత శ్రద్ధగా.. క్లారిటీగా బ్యాక్‌గ్రౌండ్ సంగీతాన్ని అందిస్తాడో అంత చక్కగా అకీరా మ్యూజిక్ ఇచ్చాడు. ఈ షార్ట్ ఫిల్మ్ చూస్తే.. మీకు అకీరాలో మ్యూజిక్‌లో సంగీత దర్శకుడు అనిరుద్ స్టైల్ కనిపిస్తుంది. అయితే, అకీరా షార్ట్ ఫిల్మ్స్‌కు మాత్రమే పరిమితం అవుతాడా? లేదా స్వయంగా ఏమైనా మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. మూవీస్‌కు సంగీతాన్ని అందించినా ఆశ్చర్యపోవక్కర్లేదు. పవర్ స్టార్ కొడుకు, పైగా టాలెంటెడ్ కాబట్టి అది పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
అకీరా సంగీతాన్ని విని పవర్ స్టార్ అభిమానులు మనసులో ఉప్పొంగి పోతున్నారు. కానీ, ఏదో తెలియని ఆందోళన కూడా వారిని వెంటాడుతోంది. అకీరా ఈ మ్యూజిక్ ఫీల్డ్‌లో సెటిలైపోతాడో ఏమిటోనని అనుకుంటున్నారట. నట వారసుడిగా టాలీవుడ్ రంగ ప్రవేశం చేస్తారనుకుంటే.. ఈ కొత్త ట్విస్ట్ ఏమిటి అకీరా అనుకుంటున్నారు. అయితే, రేణు, పవన్ కళ్యాణ్‌లు అకీరాపై ఎలాంటి ఒత్తిడి తేవడంలేదని తెలుస్తోంది. సినిమాల్లోకి రావాలా, వద్దా అనే నిర్ణయం పూర్తిగా అకీరా చేతిలోనే ఉందట. మరి, భవిష్యత్తులో అకీరా ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
పవర్ స్టార్ అభిమానులపై రేణు దేశాయ్ చాలా ఆగ్రహంతో ఉన్నారు. గత కొద్ది రోజులుగా ఆమె సోషల్ మీడియాలో.. కనిపించని ఆ అభిమానులతో పోరాటం చేస్తున్నారు. ఓ నెటిజన్ శృతి మించి స్పందించడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకు గురించి అడ్డగోలుగా మాట్లాడకూడదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలని హెచ్చరించారు. నెటిజన్లు చేసే పిచ్చి కామెంట్స్ కారణంగా తాను తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు గొడవ? తాజాగా అకీరా నందన్ పుట్టిన రోజు జరిగింది. ఈ సందర్భంగా రేణూ దేశాయ్ తన అబ్బాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఓ వీడియో ఇన్ స్టాలో షేర్ చేసింది. దీనిపై ఓ నెటిజన్ ఆమెను కించపరిచే రీతిలో ఓ కామెంట్ చేశాడు. ‘‘మేడం, ఒక్కసారైనా మా అకీరాని సరిగ్గా చూపించండి. మా అన్నయ్య కొడుకును చూడాలని మాకెంతో ఆశగా ఉంటుంది’’ అని రాసుకొచ్చాడు. ఈ కామెంట్ చూడగానే రేణుకు కోపం కట్టలు తెచ్చుకుంది. “ మీ అన్నయ్య కొడుకా? అకీరా నా అబ్బాయి. మీరు వీరాభిమానులు అయి ఉండవచ్చు. కానీ, మాట్లాడే పద్దతి మార్చుకోండి” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇలాంటి కామెంట్స్ చాలాసార్లు పట్టించుకోకుండా వదిలేశాను. కానీ. ప్రతిసారి ఇదే పద్దతి కొనసాగిస్తున్నారు. మరింత చెత్త కామెంట్స్ పెడుతున్నారు” అంటూ ఘాటుగా స్పందించారు.
Also Read : దేవుడి దయ వల్ల బావున్నా, గాయాలు కాలేదు - స్పందించిన సంజయ్ దత్
మే నెలలో డబ్బింగ్ సినిమాలదే హవా - ఈ మూవీస్‌కు పాజిటీవ్ రెస్పాన్స్!
Mentoo Movie: ఓటీటీలోకి ‘మెన్ టూ’ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అవికా గోర్ '1920 హారర్ ఆఫ్ ది హార్ట్' ట్రైలర్ చూశారా - వెన్నులో వణుకు పుట్టడం ఖాయం!
ఆ ఐదేళ్లు నేను చెన్నైవాడిని కాదని చెప్పుకోవడమే సరిపోయేది: రానా
వచ్చేస్తోంది తమన్నా కొత్త వెబ్ సీరిస్ - స్ట్రీమింగ్ ఆ ఓటీటీలోనే!
YS Viveka Murder Case: వైఎస్ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు