News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

'బ్రో' ఎఫెక్ట్ - 'భోళా శంకర్' విషయంలో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారా?

చిరంజీవి నటించిన 'భోళా శంకర్' సినిమా మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ రీమేక్ మూవీ రిజల్ట్ విషయంలో మెగా ఫ్యాన్స్ కాస్త కలవరపడతున్నారని టాక్ నడుస్తోంది.

FOLLOW US: 
Share:

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తోంది. చిరు సోదరి పాత్రలో మహానటి కీర్తి సురేష్ నటిస్తుండగా, అక్కినేని హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది. అయినప్పటికీ ఇది రీమేక్ మూవీ కావడంతో, రిజల్ట్ ఎలా ఉంటుందో అని మెగా అభిమానులు కాస్త కలవరపడతున్నారని తెలుస్తోంది. 

తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్టైన 'వేదాళం' చిత్రానికి రీమేక్ గా 'భోళా శంకర్' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇది 2015లో వచ్చిన రొటీన్ మాస్ మసాలా యాక్షన్ మూవీ. అక్కడ అజిత్ కుమార్ హీరోగా నటించారు. అతని మార్క్ యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ మరియు యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే ఈపాటికే ఈ సినిమాని యూట్యూబ్ లో అందరూ చూసేశారు. ఇప్పుడు దాదాపు 8 ఏళ్ళ తర్వాత అలాంటి కంటెంట్ ను చిరుతో రీమేక్ చేసి, తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 

మెగాస్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా 'భోళా శంకర్' స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు జరిగినట్లుగా నివేదికలు పేర్కొన్నాయి. ఎన్ని చేంజెస్ చేసినా రీమేక్ మూవీ కాబట్టి, కంపేరిజన్స్ అనేవి కచ్చితంగా ఉంటాయి. అందుకే అజిత్ పోషించిన పాత్రకు చిరంజీవి న్యాయం చేయగలరా? అదే ఇంపాక్ట్ క్రియేట్ చెయ్యగలరా? అనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈమధ్య వచ్చిన ట్రైలర్ కొన్ని రోజులపాటు నెట్టింట ట్రెండ్ అయింది. 

'భోళా శంకర్' ట్రైలర్ ని బట్టి చూస్తే, ఒరిజినల్ స్క్రిప్ట్ లో పెద్దగా మార్పులు చేసినట్లుగా అనిపించలేదు. ఇందులో చిరంజీవితో తెలంగాణ యాసలో మాట్లాడించే ప్రయత్నం చేసారు. దానికి హైదరాబాదీ హిందీ కలిపి చెప్పిన డైలాగ్స్, ఓ వర్గం ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి. కానీ మెజారిటీ సినీ అభిమానులు మాత్రం మెగాస్టార్ కు తెలంగాణ స్లాంగ్ సూట్ అవ్వలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. 

అలానే 'భోళా శంకర్' లో ఇతర హీరోల రిఫరెన్స్ లు ఉండటంపైనా చర్చలు జరుగుతున్నాయి. 'ఖుషి' చిత్రంలో పవన్ కళ్యాణ్ ను ఇమిటేజ్ చేసారు బిగ్ బాస్. తనయుడు రామ్ చరణ్ 'రంగస్థలం' రిఫరెన్స్ కూడా ఉంది. వీటికి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభించింది. చిరంజీవి లాంటి 'మెగా' స్టార్ ఇతర హీరోలకు రిఫరెన్స్‌గా ఉండాలి కానీ, ఇలా తన సినిమాల్లో ఇతర హీరోలను అనుకరించడం లేదా సినిమాల రిఫరెన్స్ లు తీసుకోవడం ఏంటని కొందరు నెటిజన్లు అంటున్నారు. మరికొందరు మాత్రం చిరు తనయుడిని, తమ్ముడిని ఇమిటేజ్ చేస్తే తప్పేంటని సమర్థిస్తున్నారు. 

Also Read: 'ఇలాంటి చెత్త సినిమా తీసినందుకు కరణ్ సిగ్గుపడాలి.. సౌత్ హీరోలను చూసి నేర్చుకో రణ్‌వీర్‌'

చిరంజీవి గతేడాది 'గాడ్‌ ఫాద‌ర్' అనే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ తో వచ్చారు. ఇది మలయాళంలో ఘన విజయం సాధించిన 'లూసిఫర్' చిత్రానికి తెలుగు రీమేక్. మోహ‌న్‌ రాజా ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ మూవీ, పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆశించిన మేరకు బాక్సాఫీస్ వసూళ్లు రాబట్టలేకపోయింది. సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోకపోవడానికి ప్రధాన కారణం రీమేక్ ఫ్యాక్టర్ అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులో అందుబాటులో ఉన్న సినిమాని ఆల్రెడీ జనాలు చూసేశారని, అందుకే థియేట్రికల్ కలెక్షన్స్ ఆశించిన మేర రాలేదని విశ్లేషకులు పేర్కొన్నారు. 

అందులోనూ లేటెస్టుగా థియేటర్లలోకి వచ్చిన మరో మెగా రీమేక్ మూవీ 'బ్రో' మిక్స్డ్ టాక్ తో నడుస్తోంది. ఇది 'వినోదయ సిత్తం' అనే తమిళ్ చిత్రానికి రీమేక్. జీ5 ఓటీటీలో కొన్ని రోజుల ముందు వరకూ అందుబాటులో ఉన్న తెలుగు వెర్షన్ ను చాలామంది చూసేసారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా కొన్ని మార్పులు చేసారు. మేకర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అని పోస్టర్స్ వదులుతున్నా, పవర్ స్టార్ రేంజ్ కలెక్షన్స్ రావడం లేదని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి కారణం 'రీమేక్' మూవీ కావడమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'వేదలమ్' రీమేక్ గా వస్తోన్న 'భోళా శంకర్' ఎలాంటి వసూళ్లు రాబడుతుందో అని మెగాభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

ఇప్పటికైతే 'భోళా శంకర్' ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ స్వరపరిచిన మూడు పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. 67 ఏళ్ల వయసులో చిరంజీవి గ్రేస్ ఫుల్ డ్యాన్స్‌లు, తమన్నా అందాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇవన్నీ సినిమా చుట్టూ బజ్ క్రియేట్ చేసే అంశాలు. మరి ఇవి సినిమా విజయానికి ఏమేరకు దోహదం చేస్తాయో వేచి చూడాలి. ఏకే ఎంటర్టైనెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న 'భోళాశంకర్' చిత్రాన్ని 2023 ఆగస్టు 11న విడుదల చేయనున్నారు. 

Also Read: హిట్టు కొట్టాలంటే గన్ను పట్టాల్సిందే - ఈ గన్స్ లేకపోతే ఏమైపోయేవారో!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 31 Jul 2023 04:41 PM (IST) Tags: Megastar Chiranjeevi Tollywood News Tamannaah Bhatia Meher Ramesh Pawan Kalyan Bholaa Shankar Keerthi Suresh BRO Movie Sushanth Akkineni

ఇవి కూడా చూడండి

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు

Aishwarya Marriage: రెండో పెళ్లికి హీరో కుమార్తె రెడీ - దర్శకుడితో ఐశ్వర్య ప్రేమ!

Aishwarya Marriage: రెండో పెళ్లికి హీరో కుమార్తె రెడీ - దర్శకుడితో ఐశ్వర్య ప్రేమ!

Amma Nanna o Tamila Ammayi Sequel: 15 ఏళ్ల తర్వాత ‘అమ్మ‌నాన్న ఓ త‌మిళ అమ్మాయి’ సీక్వెల్ - కానీ, ఓ ట్విస్ట్!

Amma Nanna o Tamila Ammayi Sequel: 15 ఏళ్ల తర్వాత ‘అమ్మ‌నాన్న ఓ త‌మిళ అమ్మాయి’ సీక్వెల్ - కానీ, ఓ ట్విస్ట్!

Richest South Indian Actor: దక్షిణాదిలో సంపన్న నటుడు ఎవరో తెలుసా? రూ.3 వేల కోట్ల ఆస్తి, సొంత విమానం మామూలుగా లేదు మరీ!

Richest  South Indian Actor: దక్షిణాదిలో సంపన్న నటుడు ఎవరో తెలుసా? రూ.3 వేల కోట్ల ఆస్తి, సొంత విమానం మామూలుగా లేదు మరీ!

Navdeep Love Mouli: నవదీప్‌లో మార్పు - ఒంటి మీద నూలు పోగు లేకుండా!

Navdeep Love Mouli: నవదీప్‌లో మార్పు - ఒంటి మీద నూలు పోగు లేకుండా!

టాప్ స్టోరీస్

Koushik Reddy: గెలిస్తే విజయ్ యాత్రతో వస్తా లేకుంటే శవయాత్రకు రండీ- బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎమోషనల్‌ స్పీచ్‌

Koushik Reddy: గెలిస్తే విజయ్ యాత్రతో వస్తా లేకుంటే శవయాత్రకు రండీ- బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎమోషనల్‌ స్పీచ్‌

Andhra News : అనంతపురంలో బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ! టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై వివాదం

Andhra News : అనంతపురంలో బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ! టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై వివాదం

KCR Election Campaign: హైదరాబాద్‌ మినహా 97 నియోజకవర్గాల్లో కేసీఆర్‌ ప్రచారం- నేడు గజ్వేల్‌లో ఫైనల్‌ మీటింగ్

KCR Election Campaign: హైదరాబాద్‌ మినహా 97 నియోజకవర్గాల్లో కేసీఆర్‌ ప్రచారం- నేడు గజ్వేల్‌లో ఫైనల్‌ మీటింగ్

Kriti Sanon : బన్నీతో కలిసి పనిచేసే క్షణాల కోసం ఎదురుచూస్తున్నా: కృతిసనన్

Kriti Sanon : బన్నీతో కలిసి పనిచేసే క్షణాల కోసం ఎదురుచూస్తున్నా: కృతిసనన్