అన్వేషించండి

చిరంజీవి నుంచి కమల్ హాసన్ వరకు.. హిట్టు కొట్టాలంటే గన్ను పట్టాల్సిందే - గాట్లింగ్ గన్స్ లేకపోతే ఏమైపోయేవారో!

హీరోలు వెండితెర మీద హెవీ మెషిన్ గన్స్ తో విధ్వంసం సృష్టించడం అనేది ఇప్పుడు సరికొత్త ట్రెండ్ గా మారింది. ప్రతి ఒక్కరూ ట్రిగ్గర్‌ నొక్కి, బాక్సాఫీసును టార్గెట్ చేస్తున్నారు.

సినిమాలలో గన్‌ కల్చర్‌ అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఇది తెలుగు చిత్రాల్లోనూ ఉంది. కాకపోతే మన ఫిలిం మేకర్స్ ట్రెండ్ కు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు సరికొత్త గన్స్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వస్తున్నారు. పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో హీరోలు పొడవాటి నాటు తుపాకులతో రౌడీ మూకలను కాల్చేవారు. ఆ తర్వాత రోజుల్లో ఆరు తూటాలు ఉంటే తుపాకీలు, రివాల్వర్లు, ఫిస్టల్స్, రైఫిళ్స్ వంటి రకరకాల గన్స్ వచ్చాయి. 

ఇక 90వ దశకం నుంచి సినిమాల్లో మెషిన్‌ గన్లను చూపిస్తున్నారు. తమ ఫేవరేట్ హీరోల చేతుల్లో ఉండే ఏకే 47లు తెర మీద బుల్లెట్ల వర్షం కురిపిస్తుంటే, సినీ అభిమానులు సంబరపడిపోయేవారు. అయితే రాను రాను ట్రెండు మారుతూ వచ్చింది. ఇప్పటి సినిమాలలో హీరోలు మోయలేనంత భారీ గన్‌లతో విలన్స్ పై విరుచుకుపడుతున్నారు. చూసీ చూడగానే విలన్లు బెంబేల్తెతిపోయే హెవీ మెషిన్ గన్స్, గాట్లింగ్ గన్స్ తో ఫైరింగ్ చేస్తున్నారు. ఈ 'పేద్ద' తుపాకులతో నాలుగైదు నిమిషాలు విధ్వంసం సృష్టిస్తున్నారు.

హలీవుడ్ చిత్రాలలో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ, 'ఖైదీ' సినిమా నుంచే దక్షిణాదిలో గాట్లింగ్ గన్స్ ఊపందుకున్నాయని చెప్పొచ్చు. వాటిని ఉపయోగించిన చిత్రాలు ఆడియన్స్ కు సరికొత్త థ్రిల్ ను పంచడమే కాదు.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో M-51లు, గాట్లింగ్ గన్స్ అనేవి హిట్ ఫార్ములాగా మారిపోయాయి. స్టార్ హీరో సినిమా అంటే ఏదోక కీలక సన్నివేశంలో భారీ తుపాకీ పట్టుకొని దర్శనం ఇవ్వడం కామన్ అయిపోయింది. ఇటీవల కాలంలో గాట్లింగ్ గన్స్ తో బాక్సాఫీస్‌ను టార్గెట్‌ చేసిన ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!

ఖైదీ:
కార్తీ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'ఖైదీ'. 2018లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం ఒక రాత్రి సమయంలో జరిగే ఈ కథ ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. జైల్ నుంచి బెయిల్ పై విడుదలయిన ఢిల్లీ పాత్రలో కార్తీ అధ్బుతమైన నటన కనబరిచాడు. ఇక క్లైమాక్స్ సీన్ ఈ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఢిల్లీ చేతికి ఒక భారీ గన్ దొరకడంతో విలన్లకు తన విశ్వరూపం చూపిస్తాడు. కార్తీ M51 గన్ ను భుజానికి తగిలించుకొని దాదాపు నాలుగు నిమిషాల పాటు విద్వంసం సృష్టిస్తాడు. థియేటర్ లో ఆ బుల్లెట్ల శబ్దానికి ప్రేక్షకులు చెవులు చిల్లులు పడతాయని అనుకునే రేంజ్ లో ఆ ఫైరింగ్ సీన్ ఉంటుంది. ఇది సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిందని చెప్పాలి.

KGF చాప్టర్-2:
కన్నడ హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన యాక్షన్ మూవీ ‘కేజీఎఫ్‌’. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. ముఖ్యంగా గతేడాది వచ్చిన రెండో చాప్టర్, ప్రపంచ వ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో రాఖీ భాయ్‌ సృష్టించే విధ్వంసానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రంలో యశ్ 'పెద్దమ్మ' అనే ఒక భారీ మెషిన్‌ గన్‌ తీసుకొచ్చి, ప్రభుత్వ కార్యాలయంపై బుల్లెట్ల వర్షం కురిపించే సీన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పోలీస్ వాహనాలు గాల్లోకి లేస్తుంటే, యశ్ ఆ గన్ తో సిగరెట్ ముట్టించుకునే సన్నివేశం ఫ్యాన్స్ కి గూస్ బమ్స్ తెప్పించింది. 'KGF పెద్దమ్మ' అని ఆ గన్ గురించి నెట్టింట సెర్చ్‌ చేశారంటే.. ఆ సీన్‌కు ఆడియన్స్ ఎంతగా కనెక్ట్‌ అయ్యారో అర్థమవుతుంది. 

Read Also: 'నా ఫ్లాట్ పక్కనే స్మశానం.. ఒక దెయ్యం రోజూ నన్ను స్మశానానికి తీసుకెళ్లేది'

విక్రమ్:
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన సినిమా విక్రమ్'. 1986లో కమల్ నటించిన 'ఏజెంట్ విక్రమ్ 007' చిత్రానికి కొనసాగింపుగా తీశారు. చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూసిన కమల్.. ఈ చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇందులో క్లైమాక్స్ సీన్ లో ఆయన గాట్లింగ్ గన్ తో బీభత్సం సృష్టించారు. 69 ఏళ్ల వయసులో సీనియర్ హీరో పాతకాలం నాటి ఒక భారీ గన్ ను లాక్కొచ్చి, బుల్లెట్లు లోడ్ చేసి పేలుస్తుంటే ఆశ్చర్యపోవడం ఆడియన్స్ వంతైంది. ది ఘోస్ట్:కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ది ఘోస్ట్'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఏజెంట్ విక్రమ్ అనే పాత్రలో నాగ్ కనిపించారు. క్లైమాక్స్ లో ఒక హెవీ మెషిన్ గన్ తో అండర్ వరల్డ్ డాన్స్ భరతం పట్టే సీన్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీసు రిజల్ట్ ఎలా ఉన్నా, పతాక సన్నివేశం మాత్రం హైలైట్ అని చెప్పాలి. 

గాడ్‌ ఫాదర్‌ & వాల్తేరు వీరయ్య:
ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఒక పెద్ద గన్ కామన్ అయిపోయింది. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన 'గాడ్‌ ఫాదర్‌' చిత్రంలో హెవీ మెషిన్ గన్ పట్టుకున్నారు. 'బాసులు వచ్చిండ్రే' అనే సాంగ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో కలిసి బిగ్ బాస్ బుల్లెట్లు పేల్చారు. అలానే బాబీతో చేసిన 'వాల్తేరు వీరయ్య' మూవీలోనూ భారీ గన్ తో అలరించారు చిరు. రాబోయే 'భోళా శంకర్' సినిమాలో కూడా రకరకాల తుపాకీలు వినియోగించినట్లు తెలుస్తోంది.

ఏజెంట్:
యూత్ కింగ్ అఖిల్ అక్కినేని, స్టైలిష్ డైరక్టర్ సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్'. ఇందులో అఖిల్ ఒక రా ఏజెంట్ గా కనిపించారు. ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ లో అక్కినేని చిన్నోడు తనలోని ఫైర్ ఎంతో చూపించాడు. కండలు తిరిగిన సిక్స్ బాడీని చూపిస్తూ, M51 గన్ తో విలయతాండవం చేసిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. కాకపోతే ఇది సక్సెస్ అందించలేకపోయింది.

కెప్టెన్ మిల్లర్:
లేటెస్ట్ గా తమిళ్ హీరో ధనుష్ కూడా హెవీ మెషిన్ గన్ తో వచ్చాడు. ధనుష్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన 'కెప్టెన్ మిల్లర్' టీజర్ లో మిల్లర్‌ ఓ భారీ మషన్‌ గన్‌తో కాల్పులు జరపడం అందరినీ ఆకట్టుకుంది. నిమిషానికి పైగా నిడివి ఉన్న ఈ వీడియోలో ఆద్యంతం తుపాకుల మోతే వినిపించింది. 1930-40ల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విప్లవ వీరుడిగా ధనుష్ సరికొత్త లుక్‌తో కనిపించాడు. బందిపోటుగా, హంతకుడిగా ముద్రపడిన కెప్టెన్‌ మిల్లర్‌ను పట్టుకోవడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం రంగంలోకి దిగడం.. వాళ్ల సైన్యంపై మిల్లర్‌ అండ్ టీమ్ తిరగబడటం వంటివి టీజర్ లో చూపించారు. అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో ఈ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది.

F 3:
ఇక అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ‘F 3’ సినిమాలో అలీ చేతికి ఒక హెవీ గన్‌ ఇచ్చి, స్పూఫ్ కామెడీ చేయించారు. ఇలా అనేక చిత్రాలలో హెవీ గన్ కల్చర్ కనిపించింది. 'సైంధవ్' సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఒక పెద్ద గన్ పట్టుకోబోతున్నారు. ఈ ట్రెండ్ ఇంకొన్నాల్లు ఇలానే కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. పాత్రోచితంగా భారీ గన్‌లు పట్టుకుంటే ఓకే కానీ, అవసరం లేకున్నా భారీతనం కోసం అలాంటి హంగులు జోడిస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది. మరి రానున్న రోజుల్లో ఈ హెవీ గన్నులు ఎవరెవరికి హిట్లు ఇస్తాయో వేచి చూడాలి.

Read Also: బాలయ్య Vs రవితేజ Vs విజయ్ - ఈసారి బాక్సాఫీస్ బరిలో నిలిచేదెవరు? గెలిచేదెవరు?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
Chiranjeevi: చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Cyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP DesamIndian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach | గోవాలో తెలుగు టూరిస్టును కొట్టి చంపేశారు | ABP DesamRohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
Chiranjeevi: చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Dmart Stocks, Avenue Supermarts share price highlights: అదరగొట్టిన దమానీ.. దూసుకెళ్లిన DMart. 15శాతం పెరిగిన షేర్ ధర
అదరగొట్టిన దమానీ.. దూసుకెళ్లిన DMart. 15శాతం పెరిగిన షేర్ ధర
Reels Contest: మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
Telangana Blockchain City: యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
Embed widget