OG Trailer: పవన్ 'OG' ట్రైలర్ వచ్చేస్తోంది - అఫీషియల్ డేట్ అండ్ టైం అనౌన్స్ చేసిన టీం
OG Trailer Release Date: పవర్ స్టార్ అవెయిటెడ్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'ఓజీ' నుంచి పవర్ ఫుల్ ట్రైలర్ వచ్చేస్తోంది. ఇప్పటికే సాంగ్స్, బీజీఎం వేరే లెవల్‌లో ఉండగా ట్రైలర్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Pawan Kalyan OG Movie Trailer Release Date: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్ ఇది. అంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అవెయిటెడ్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'OG' మూవీ ట్రైలర్ వచ్చేస్తోంది. ఈ మేరకు మూవీ టీం అఫీషియల్‌గా ట్రైలర్ రిలీజ్ డేట్ టైం అనౌన్స్ చేసింది.
ట్రైలర్ ఎప్పుడంటే?
ఈ మూవీ ట్రైలర్‌ను ఈ నెల 21న (ఆదివారం) ఉదయం 10 గంటల 8 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్టర్‌తో మూవీ టీం ఈ విషయాన్ని వెల్లడించింది. 'డెత్ కోటా. కన్ఫర్మ్ అంట. ది అవెయిటెడ్ ఓజీ ట్రైలర్ వచ్చేస్తోంది.' అంటూ రాసుకొచ్చారు. 'సాహో' ఫేం సుజీత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Death quota….confirm anta!! 🤙🏻🤙🏻
— DVV Entertainment (@DVVMovies) September 18, 2025
The most awaited #OGTrailer on Sep 21st.#OG #TheyCallHimOG pic.twitter.com/lmAo1CkdAU
Also Read: ఫస్ట్ తలైవాతో మూవీ... ఆ నెక్స్ట్ ప్రభాస్ 'కల్కి 2898AD' సీక్వెల్ - నాగ్ అశ్విన్ ప్లాన్ అదేనా!
మూవీ రిలీజ్‌కు ఇంకా వారమే ఉండగా... ఇప్పటికే సోషల్ మీడియాలో ఓజీ సంబరాలు మొదలయ్యాయి. థియేటర్లలో సందడి చేసేందుకు ఫ్యాన్స్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక ఒక్కో రోజు ఒక్కో అప్డేట్స్ ఫ్యాన్స్ హైప్ డబుల్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ప్రకాష్ రాజ్ రోల్ పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో ఆయన పవర్ ఫుల్ రోల్ 'సత్య దాదా'గా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పవన్ లుక్స్, సాంగ్స్, బీజీఎం స్పెషల్ వీడియోస్ వేరే లెవల్‌లో ఉన్నాయి.
థియేటర్లలో 'ఓజస్ గంభీర' పవర్ చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివవరకూ రిలీజ్ అయినవి ఒక లెక్క ఇక ట్రైలర్ మరో లెక్క అనేలా హైప్ క్రియేట్ అవుతోంది. పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా... బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తున్నారు. వీరితో పాటే శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మించారు.
ఏపీలో బెనిఫిట్ షోలకు అనుమతి
అటు, ఏపీ ప్రభుత్వం 'ఓజీ' బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 24న అర్ధరాత్రి ఒంటి గంట నుంచి షోలు ప్రదర్శించుకోవచ్చు. టికెట్ ధర వెయ్యి రూపాయలకు విక్రయించుకోవచ్చు. అలాగే రిలీజ్ అయిన 10 రోజుల వరకూ టికెట్ రేట్స్ పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి రూ.125, మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ.150 వరకూ పెంచుకోవచ్చు. అటు తెలంగాణలో ప్రీమియర్, బెనిఫిట్ షోలు ఉంటాయో లేదో అనే దానిపై సందిగ్ధత నెలకొంది. బెనిఫిట్ షోలతో పాటు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సుముఖంగానే ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.






















