అన్వేషించండి

Deepika Padukone: అఫీషియల్ అనౌన్స్‌మెంట్ - 'కల్కి 2898 AD' సీక్వెల్ నుంచి దీపికా పదుకోన్ అవుట్

Kalki 2898AD Sequel: బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్‌‌ను ప్రభాస్ 'కల్కి 2898AD' సీక్వెల్ మూవీ నుంచి తప్పించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ స్వయంగా వెల్లడించింది.

Deepika Padukone Remove From Kalki 2898AD Sequel: బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్‌కు మరో షాక్ తగిలింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అవెయిటెడ్ మూవీ 'కల్కి 2898 AD' ఆమె భాగం కాదని చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. దీంతో మూవీ లవర్స్‌తో పాటు నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అసలు రీజన్ ఏంటంటే?

నిజానికి ప్రభాస్ 'స్పిరిట్' మూవీ విషయంలోనూ దీపికాకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు తాజాగా ప్రభాస్ 'కల్కి' సీక్వెల్‌లోనూ ఆమెను తప్పించారు. చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది. 'కల్కి 2898AD సీక్వెల్‌లో దీపికా పదుకోన్ నటించడం లేదని అధికారికంగా ప్రకటిస్తున్నాం. చాలా విషయాల్లో పరిశీలించిన తర్వాత తమ భాగస్వామ్యం నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నాం.

పార్ట్ 1 సినిమా చేయడానికి చాలా దూరం ప్రయాణించినప్పటికీ, మా మధ్య భాగస్వామ్య సరిగా కుదరలేదు. కల్కి వంటి భారీ చిత్రానికి కమిట్మెంట్ చాలా అవసరం. దీపికా భవిష్యత్తులో మరెన్నో సినిమాలు చేయాలని మేము విషెష్ తెలియజేస్తున్నాం. గొప్ప టీంతో కల్కి 2 త్వరలోనే మీ ముందుకు వస్తుంది.' అంటూ రాసుకొచ్చింది.

Also Read: సందీప్ వంగాతో మహేష్ బాబు మూవీ? - 'SSMB29' తర్వాత క్రేజీ ప్రాజెక్ట్!

నెట్టించ చర్చ

స్టార్ హీరోయిన్‌ను బిగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పించడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగుతోంది. 'కల్కి 2' టీం సడన్ షాక్ ఇచ్చిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీగా 2024లో వచ్చిన 'కల్కి 2898 AD' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇందులో సుమతి పాత్రలో దీపికా మెరిశారు. దీనికి సీక్వెల్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొంతకాలంగా దీపికా పేరు అటు సోషల్ మీడియా ఇటు ఇండస్ట్రీలో హైలైట్ అవుతుంది. ప్రభాస్ 'స్పిరిట్' విషయంలోనూ దీపికాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ మూవీ అనౌన్స్ చేసినప్పుడు కాంబినేషన్ అదిరిపోతుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు.

అయితే, 8 గంటల వర్కింగ్ అవర్స్ కండీషన్, ఎక్కువ షూటింగ్ చేస్తే ఎక్స్‌ట్రా పేమెంట్స్ డిమాండ్స్‌తో ఆమెను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పక్కన పెట్టినట్లు టాక్ వినిపించింది. ఆమె స్థానంలో 'యానిమల్' హీరోయిన్ త్రిప్తి దిమ్రిని సెలక్ట్ చేశారు. అప్పుడే 'కల్కి 2' నుంచి కూడా దీపికా అవుట్ అవుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఇప్పుడు తాజాగా సీక్వెల్ నుంచి ఆమెను తప్పిస్తూ అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక ఆ రోల్ ఎవరు చేస్తారు? కొత్త మూవీ టీం ఎలా ఉండబోతుంది? అనేది సస్పెన్స్‌గా మారింది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Aasmaan First Look : శ్రీహరి కొడుకు హీరోగా ఆస్మాన్ - ఫస్ట్ లుక్... యాక్షన్ వేరే లెవల్
శ్రీహరి కొడుకు హీరోగా ఆస్మాన్ - ఫస్ట్ లుక్... యాక్షన్ వేరే లెవల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Bigg Boss 10 Promo : ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
Fauzi Poster : ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Embed widget