Mega Verse OTT : మెగాస్టార్ టాక్ షో... చిరు ఓటీటీ ఎంట్రీ - ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Chiranjeevi OTT : మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ ఎంట్రీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 'మెగా వర్స్' ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్‌పై సోషల్ మీడియాలో లేటెస్ట్ బజ్ ట్రెండ్ అవుతోంది.

Chiranjeevi's Mega Verse First Episode OTT Release Date : మెగాస్టార్ చిరంజీవి ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఆయన హోస్ట్‌గా సెలబ్రిటీలతో 'మెగా వర్స్' టాక్ షో నిర్వహించనున్నారు. చిరు టాక్ షోపై భారీ హైప్ క్రియేట్ అవుతుండగా... ఫస్ట్ ఎపిసోడ్ ఈ దీపావళికి స్ట్రీమింగ్ అవుతుందని భావించినా... రాలేదు. ఇప్పుడు డిజిటల్ రిలీజ్ డేట్‌పై మెగా అభిమానులతో పాటు అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
'మెగావర్స్' (Megaverse) ఫస్ట్ ఎపిసోడ్ డిసెంబర్ సెకండ్ వీక్ ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. తొలి ఎపిసోడ్‌లో హాస్య బ్రహ్మ 'బ్రహ్మానందం', వెన్నెల కిశోర్, సత్య వంటి స్టార్స్ సందడి చేసినట్లు తెలుస్తోంది. ఇక కింగ్ నాగార్జునతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ ఎపిసోడ్ కూడా పూర్తైనట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే 'మెగా వర్స్' ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్‌పై అఫీషియల్ ప్రోమో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
చిరు, నాగ్ అంటేనే టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్స్. ఇద్దరి మధ్య స్నేహం, మూవీ జర్నీలో హ్యాపీయస్ట్ మూమెంట్స్ ఈ ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇక మరో క్రేజీ న్యూస్ ఏంటంటే... పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా చిరు టాక్ షోలో పాల్గొనన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20న ఈ ఎపిసోడ్ షూటింగ్ జరగనుందని ఫిలింనగర్ వర్గాల సమాచారం.
ఇదే ఎపిసోడ్‌లో స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా సందడి చేసినట్లు టాక్. ఇద్దరి కాంబోలో రాబోతోన్న 'స్పిరిట్' విశేషాలతో పాటు ఇతర విశేషాలను కూడా పంచుకునే ఛాన్స్ ఉందని బజ్ వినిపిస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. కేవలం స్టార్ హీరోలు మాత్రమే కాకుండా టాలీవుడ్ ప్రముఖులు కూడా చిరు టాక్ షోలో పాల్గొంటున్నట్లు సమాచారం.
Also Read : OM Trailer Review : O.M ట్రైలర్ వచ్చేసింది - ధనుష్ మాస్ యాక్షన్... టైటిల్ ఛేంజ్ చేశారుగా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















