News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ జాతీయ నాయకుడు, ఆయన విజన్ వేరు - సముద్రఖని సంచలన వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ జాతీయ నాయకుడు అని దర్శకుడు సముద్రఖని చెప్పారు. ఈ నెల 28న 'బ్రో' విడుదల కానున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

FOLLOW US: 
Share:

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కేవలం తెలుగు చిత్రసీమలో కథానాయకుడు మాత్రమే కాదు... తెలుగు రాష్ట్ర రాజకీయాలలో చాలా కీలకమైన వ్యక్తి. జనసేన పార్టీ  అధినేత. సినిమాలు, రాజకీయాలను వేర్వేరుగా చూడాలని పవన్ సహా చిత్రసీమ ప్రముఖులు చెప్పే మాట. అయితే... జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాల్లో సన్నివేశాలను రాజకీయ కోణంలో చూసే ప్రేక్షకులు, తెలుగు ప్రజలు ఉన్నారు. పవన్ సినిమాల్లో నటించిన, పవన్ సినిమాలకు పని చేసిన దర్శక నిర్మాతలు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు సముద్రఖని కూడా పవన్ పొలిటికల్ విజన్ గురించి మాట్లాడారు. 

పవన్ జాతీయ నాయకుడు - సముద్రఖని
జూలై 28న పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో' థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించారు. ఓటీటీ కోసం ఆయన తీసిన, నటించిన తమిళ హిట్ 'వినోదయ సీతం'కు రీమేక్ ఇది. 'బ్రో' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ పొలిటికల్ విజన్ గురించి సముద్రఖని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

పవన్ కళ్యాణ్ రాష్ట్ర నాయకుడు కాదని, జాతీయ నాయకుడు అని సముద్రఖని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''నేను పవన్ కళ్యాణ్ గారితో 21 రోజులు 'బ్రో' షూటింగ్ చేశా. ఈ సమాజం గురించి ఆయన మనసులో ఉన్నది చెప్పారు. ఆయన విజన్ వేరు. ఆ విజన్ అమలులోకి తీసుకొస్తే మనం కొత్త లోకంలో ఉంటాం. అది చాలా త్వరగా జరుగుతుంది. ఈ ఎనర్జీని పవన్ కళ్యాణ్ గారికి దేవుడు ఇస్తారు'' అని చెప్పారు. 

ఆయనకు ఐలవ్యూ చెబుతా - సముద్రఖని
Pawan Kalyan Bro Interview : పవన్ కళ్యాణ్ చుట్టూ ఒక ఎనర్జీ ఉంటుందని, ఆయనను కలిసిన తర్వాత హాగ్ చేసుకుని ఐ లవ్యూ చెబుతానని సముద్రఖని చెప్పారు. అప్పుడు ఆ ఎనర్జీ మనకు కూడా వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. 
శిల్పకళా వేదికలో 'బ్రో' ప్రీ రిలీజ్ ఫంక్షన్!

Also Read : నిర్మాతగా 'బాహుబలి' సేతుపతి - ఈసారి కొత్త హీరో హీరోయిన్లతో!

Bro Movie Pre Release Event Date : జూలై 28న 'బ్రో' ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదలకు మూడు రోజుల ముందు హైదరాబాద్, శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ సహా ఇతర చిత్ర బృందం హాజరు కానున్నారు.

'బ్రో'... రెండు పాటలకు మిశ్రమ స్పందన!
'బ్రో' నుంచి కొన్ని రోజులు 'మై డియర్ మార్కండేయ' సాంగ్ విడుదల చేశారు. ఈ సినిమాలో రెండో పాట... సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej), కేతికా శర్మపై తెరకెక్కించిన 'జాణవులే'ను తాజాగా వచ్చింది. ఈ పాటలకు మిశ్రమ స్పందన లభిస్తోంది. 'బ్రో'లో సాయి ధరమ్ తేజ్ జోడీగా 'రొమాంటిక్' భామ కేతికా శర్మ నటించారు. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఉన్నారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు. 

Also Read మళ్ళీ రెమ్యూనరేషన్ పెంచేసిన శ్రీ లీల - నితిన్ సినిమాకు డిమాండ్ మామూలుగా లేదుగా!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 19 Jul 2023 03:33 PM (IST) Tags: Sai Dharam Tej Samuthirakani Pawan Kalyany Pawan Politics Bro Movie interview Samuthirakani On Pawan

ఇవి కూడా చూడండి

2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?

2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?

'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3పై - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రియమణి!

'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3పై - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రియమణి!

ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్న రణ్ వీర్, అలియా భట్ రీసెంట్ హిట్ - ఎక్కడంటే?

ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్న రణ్ వీర్, అలియా భట్ రీసెంట్ హిట్ - ఎక్కడంటే?

Sai Pallavi: అది నీచమైన పని, నా కుటుంబం జోలికొస్తే..: సాయి పల్లవి మాస్ వార్నింగ్

Sai Pallavi: అది నీచమైన పని, నా కుటుంబం జోలికొస్తే..: సాయి పల్లవి మాస్ వార్నింగ్

‘ఏజెంట్’ ఓటీటీ రిలీజ్ డేట్, ‘సప్త సాగరాలు దాటి’ రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘ఏజెంట్’ ఓటీటీ రిలీజ్ డేట్, ‘సప్త సాగరాలు దాటి’ రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!

టాప్ స్టోరీస్

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు

ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు

చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం

చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం