Pawan Kalyan: మూవీ తీయాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే - ఇండస్ట్రీలో టాలెంట్ వెరీ ఇంపార్టెంట్ అన్న పవన్ కల్యాణ్
Hari Hara Veera Mallu: తనకు సినిమా ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలియదని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. 'హరిహర వీరమల్లు' తాజా ప్రెస్ మీట్‌లో కీ కామెంట్స్ చేశారు.'

Pawan Kalyan Speech About HHVM: ఓ చిన్న పాటి సౌకర్యం కోసం ఓ యుద్ధమే చేయాలని... అలాంటిది ఓ మూవీ తీయాలంటే ఎన్నో మినీ యుద్ధాలే చేయాల్సి ఉంటుందని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. 'హరిహర వీరమల్లు' మూవీ ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన కీలక కామెంట్స్ చేశారు. ఈ ఈవెంట్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్‌తో పాటు దర్శక నిర్మాతలు కూడా పాల్గొన్నారు.
పోడియం లేకుండా కష్టమే...
పోడియం లేకుండా మాట్లాడడం కష్టంగా ఉందంటూ నవ్వులతో స్పీచ్ ప్రారంభించిన పవన్ తనదైన మార్క్‌తో కీలక విషయాలు పంచుకున్నారు. 'ఈవెంట్‌కు ముందు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ప్రొడ్యూసర్ ఎఎం రత్నం. సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో నాకు తెలియదు. నా జీవితంలో సినిమాపరంగా మీడియాతో మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. ఓ మూవీ తీయాలంటే మినీ యుద్ధాలే చేయాలి. సినిమా కోసం ఏ మాట్లాడాలో నాకు తెలియదు. ఇంత కష్టపడ్డాం అంత కష్టపడ్డాం అని చెప్పుకోవాలంటే నాకు మోహమాటంగా ఉంటుంది. ఇక్కడి మూవీస్‌ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎఎం రత్నం.' అని అన్నారు.
Also Read: ఇది కేవలం మూవీ మాత్రమే కాదు... ఓ శక్తి - 'వరల్డ్ ఆఫ్ కాంతార' గ్లింప్స్ అదుర్స్
కోహినూర్ వజ్రం చుట్టూ...
గతంలో తాను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఈ మూవీకి ఎంతగానో ఉపయోగపడ్డాయని పవన్ అన్నారు. 'ఈ మూవీ చాలా ఒడుదొడుకులు ఎదుర్కొంది. పాలిటిక్స్‌కు వెళ్లిన తర్వాత సినిమాకు టైం ఇవ్వలేకపోయాను. అయినప్పటికీ నా బెస్ట్ నేను ఇచ్చాను. ఈ మూవీకి క్లైమాక్స్ హైలైట్. క్రిష్ చాలా మంది కాన్సెప్ట్‌తో ముందుకొచ్చారు. ఆయనకు మా టీమ్ తరఫున థాంక్స్. కోహినూర్ వజ్రం చుట్టూ మూవీ తిరుగుతుంది. రత్నం ఈ మూవీ కోసం ఎంతో నలిగిపోయారు. మూవీ కంప్లీట్ అవుతుందా? లేదా? అనే పరిస్థితి వచ్చినప్పుడు కీరవాణి దానికి ప్రాణం పోశారు.
ఇండస్ట్రీ బాగు కోరే వ్యక్తుల వెంట నిలవడం ఎంతో ముఖ్యం. అందుకే ప్రత్యర్థులు తిడుతున్నా ఈ ప్రెస్ మీట్‌కు వచ్చాను. సినిమా అంటే నాకు ప్రాణవాయువుతో సమానం. మిగతా హీరోలకు బిజినెస్ అయినంతగా నా మూవీస్‌కు అవ్వదు.' అని అన్నారు పవన్.
టాలెంట్... వెరీ ఇంపార్టెంట్
సినీ ఇండస్ట్రీలో టాలెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అది లేకుంటే చాలా కష్టమని అన్నారు పవన్. 'భారతీయ సినిమాకు కుల, మత భేదాలు ఉండవు. క్రియేటివిటీ మీదనే ఆధారపడి ఉంటుంది. చిరంజీవి కుమారుడైనా. తమ్ముడైనా ఎవరైనా టాలెంట్ లేకపోతే నిలబడలేరు. రేపు నా కుమారుడైనా అంతే. ఇక్కడ ప్రతిభే ముఖ్యం. బాబీ డియోల్ అద్భుతంగా చేశారు. ప్రమోషన్‌ను నిధి తన భుజాలపై వేసుకున్నారు. ఈ సినిమా అనాథ కాదు. నేనున్నా అని చెప్పడానికే వచ్చాను.' అని చెప్పారు.
అది నాకు నచ్చదు
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంటూ వేరు చేయడం తనకు నచ్చదని పవన్ కల్యాణ్ అన్నారు. 'ఈ సినిమా కోసం తెల్లవారుజామున 2 గంటలకు లేచి కష్టపడేవాడిని. జ్యోతికృష్ణ సత్తా ఉన్న డైరెక్టర్. మూవీ రిజల్ట్ పూర్తిగా ప్రజల చేతుల్లోనే ఉంది. మన ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ఎంతో ఆదరిస్తోంది.' అని చెప్పారు. పవన్‌తో నటించే ఛాన్స్ రావడం తన అదృష్టమని అన్నారు నిధి అగర్వాల్. ఈ నెల 24న పాన్ ఇండియా స్థాయిలో 'హరిహర వీరమల్లు' రిలీజ్ కానుంది.






















