Pavitra Lokesh Naresh Kiss : నరేష్‌కు ముద్దు పెట్టిన పవిత్రా లోకేష్ - మీరు చూశారా?
నరేష్ మీద తనకు ఉన్న ప్రేమను పవిత్రా లోకేష్ ముద్దు రూపంలో చూపించారని అనుకోవచ్చు. అసలు, వాళ్ళిద్దరూ ఎక్కడ ముద్దు పెట్టుకున్నారు? అనే వివరాల్లోకి వెళితే...
సీనియర్ కథానాయకుడు, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ విజయ కృష్ణ (Sr Naresh) & ఒకప్పటి కన్నడ కథానాయిక, ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లో తల్లి పాత్రలు చేస్తున్న నటి పవిత్రా లోకేష్ (Pavitra Lokesh) మధ్య ఎటువంటి సంబంధం ఉంది? అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని 'మళ్ళీ పెళ్లి' చూస్తే సులభంగా చెప్పవచ్చు. ఇప్పుడు మరోసారి వాళ్ళ ప్రేమ కథ బుల్లితెరపై సెన్సేషన్ కాబోతోంది.
పబ్లిగ్గా ముద్దు పెట్టిన పవిత్రా లోకేష్
Pavitra Lokesh kisses Sr Naresh : పబ్లిగ్గా నరేష్ బుగ్గ మీద పవిత్రా లోకేష్ ముద్దు పెట్టారు. అదీ చాటు మాటుగా ప్రయివేటుగా ముద్దు పెట్టుకోలేదు. ఓ టీవీ షోలో తోటి నటీనటుల ముందు తమ ప్రేమను వ్యక్తం చేశారు.
కేవలం ముద్దు పెట్టుకోవడం మాత్రమే కాదు. ఓ పాటకు డ్యాన్స్ చేశారు. వినాయక చవితి పండగను పురస్కరించుకుని ఈటీవీ ఛానల్ కోసం మల్లెమాల సంస్థ రూపొందించిన 'స్వామి రా రా' కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. తమ ప్రేమను వ్యక్తం చేయడం, డ్యాన్స్ చేయడమే కాదు... ముద్దుగా ఏమని పిలుస్తారు అనేది కూడా చెప్పేశారు.
Also Read : స్టార్ బాయ్‌తో రొమాన్స్ చేయనున్న 'బేబీ' బ్యూటీ వైష్ణవి చైతన్య!
'మళ్ళీ పెళ్లి'లో నరేష్ పేరుకు ముందు 'నవరసరాయ' అని ట్యాగ్ వేసిన విషయం ప్రేక్షకులకు గుర్తు ఉండి ఉంటుంది. అందులో చివరి రెండు అక్షరాలను పవిత్రా లోకేష్ ముద్దు పేరు చేశారు. నరేష్ (Sr Naresh Nickname)ను తాను రాయ అని పిలుస్తానని చెప్పారు. ఆ వెంటనే 'హైపర్' ఆది 'నేను రసరాయ అని పిలుస్తా' అంటూ కామెడీ చేశారు. పవిత్రను నరేష్ 'బేబీ' అని పిలవడం గమనార్హం.
Also Read : విజయ్ దేవరకొండ మీద బురదజల్లే ప్రయత్నమా? మహేష్, రవితేజను ఇలా అడగగలరా?
నరేష్, పవిత్రాల కథే 'మళ్ళీ పెళ్లి'
'మళ్ళీ పెళ్లి' కల్పిత కథ అని సినిమా ప్రారంభానికి ముందు టైటిల్ కార్డులో వేశారు. అయితే, ఆ సినిమా చూసిన వాళ్ళు ఎవరికైనా సరే... అది నరేష్, రమ్యా రఘుపతి, పవిత్రా లోకేష్ మధ్య జరిగిన కథ అని కళ్ళకు కట్టినట్లు అర్థం అవుతోంది.
ఒకరి (తన మూడో భార్య రమ్యా రఘుపతి) మీద రివేంజ్ తీర్చుకోవడానికి కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీయాల్సిన అవసరం లేదని నరేష్ ఓసారి వ్యాఖ్యానించారు. అయితే, సినిమాలో వ్యవహారం వేరుగా ఉంది. కథను తనకు అనుకూలంగా ఆయన రాయించినట్లు అర్థం అవుతోంది. కేవలం డబ్బు కోసమే రమ్యా రఘుపతి తనను పెళ్లి చేసుకున్నారని ప్రేక్షకులకు అర్థం అయ్యేలా సినిమాలో వనితా విజయ్ కుమార్ పాత్రను రూపొందించారు. భర్త నుంచి నిరాదరణకు గురైన, జీవితంలో మోసపోయానని ఫీలవుతున్న పవిత్రా లోకేష్... ఆ సమయంలో పరిచయమైన నరేష్ కు దగ్గరైనట్లు చూపించారు.
'మళ్ళీ పెళ్లి' విడుదలకు ముందు స్టే కోరుతూ రమ్యా రఘుపతి కోర్టు మెట్లు ఎక్కారు. ఓటీటీలో అయినా విడుదల అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే... కోర్టు నుంచి ఆమెకు అనుకూలంగా తీర్పు రాలేదు. అదీ సంగతి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial