'భోళా శంకర్'లో పవన్ స్టెప్ చూసి ఉలిక్కిపడ్డాను : పరుచూరి గోపాలకృష్ణ
మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన చిరు 'భోళా శంకర్' అందరూ చూడాలని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. ఈ సందర్భంగా చిరంజీవి వ్యక్తిత్వాన్ని ఆయన ప్రశంసించారు. మూవీలో చిరు వేసిన స్టెప్స్ పైనా పలు కామెంట్స్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటించిన 'భోళా శంకర్(Bhola Shankar)' ఇటీవలే థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కీర్తిసురేశ్(Keerthi Suresh).. మెగాస్టార్ చెల్లెలిగా నటించింది. ఈ సందర్భంగా ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ(Paruchuri Gopalakrishna).. చిరంజీవి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో, ఆయనతో అనుబంధం ఎలాంటిదో కొన్ని ఉదాహరణలతో వివరించారు.
"భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చూస్తున్నపుడు కలిగిన ఆశ్చర్యమేమిటంటే.. మెగాస్టార్ చిరంజీవిలో ఆ ఎనర్జీ.. అప్పట్నుంచి ఇప్పటివరకు అలాగే ఉంది. అంటే సాధారణంగా ఒక వయసు వచ్చిన తర్వాత చిన్న తేడా ఉంటుంది. ఆయన ఈ సినిమాలో వేసిన కొన్ని డ్యాన్స్ స్టెప్పులను గనక పరిశీలిస్తే.. అన్నీ ఓకే.. కానీ కొన్ని స్టెప్పులను చూస్తుంటే మాత్రం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ను గుర్తు చేసేలా ఉన్నాయి. అంటే ఆ స్టెప్ ఊరికే పెట్టారా.. లేదంటే సినిమాలో పెట్టాల్సి వచ్చిందా అన్నది మాత్రం నాకు తెలియదు. కానీ టీవీలో చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను" అని పరుచూరి వ్యాఖ్యానించారు. "చిరంజీవి గారితో మాకున్నది ఒక అద్భుతమైన, ఆత్మీయమైన అనుబంధం. ఖైదీ దగ్గర్నుంచి అలాగే కొనసాగుతుంది. అది జీవితకాలం వరకు కొనసాగుతుంది. ఈ కరోనా రావడం వల్ల మేం బయటికి వెళ్లడం లేదు కానీ ఆయన తప్పకుండా ఈ ఈవెంట్ కు పిలుచుండేవారు. మాకు తెలుసు" అని పరుచూరి మెగాస్టార్(Megastar Chiranjeevi) మీద నమ్మకం వ్యక్తం చేశారు.
"ఇక మెహర్ రమేష్ విషయానికొస్తే ఆయన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. భోళా శంకర్ అంటే భోళా తలం అని అర్ధం. సినీ ఇండస్ట్రీలో ఉంటూ ఎంత సామాజిక సేవ చేస్తున్నారో అందరికీ తెలుసు. ఎందుకంటే అదొక విచిత్రమైన సంస్కృతి. అంటే నా కుటుంబం, నా పిల్లలు.. నాది అని ఆలోచించే వాళ్లే చాలా మంది ఉంటారు. కానీ కొందరు మాత్రం నాతో పాటు ఎదుటి వ్యక్తి భావాన్ని చూద్దాం, వాళ్లక్కూడా ఒక అవకాశం ఇచ్చి చూద్దాం... అనుకునే కొంతమందిలో మెగాస్టార్ ఒకరు. ఆయన సంకల్పం ఎంత గొప్పదంటే.. శరీరంలోని రక్తాన్ని వేరొకరి ఇచ్చి ఒక ప్రాణాన్ని కాపాడాలనుకుంటున్నారు. అక్కడికి వచ్చి రక్తం ఇచ్చేవారు కూడా చాలా గొప్పవాళ్లు. ఈ రక్తం ఎంత మంది ప్రాణాలు నిలబెట్టిందో మనకు లెక్క తెలియకపోయినప్పటికీ.. చాలా మందే ఉంటార"ని చిరంజీవి గురించి పరుచూరి గొప్పగా చెప్పారు.
ఇక 'భోళా శంకర్' మొదటి రోజు రూ. 33 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 'వాల్తేరు వీరయ్య'తో పోలిస్తే... సగమే అని టాక్. చిత్ర బృందం 33 కోట్లు అంటే... 'భోళా శంకర్' సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 28 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial