అన్వేషించండి

Parineeti Chopra Marriage: పెళ్లి మూడ్‌లోకి పరిణీతి చోప్రా, ‘మిషన్ రాణిగంజ్‌‘ కంప్లీట్

బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా పెళ్లికి ముస్తాబవుతోంది. ఆప్ ఎంపీ రాఘవ్ తో త్వరలో మూడు ముళ్లు వేయించుకోబోతోంది. ఇప్పటికే తన సినిమాలను కంప్లీట్ చేసుకున్నట్లు తలుస్తోంది.

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ నెలలోనే  రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ వేదికగా మూడు ముళ్లతో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో లీలా ప్యాలెస్ తో పాటు ది ఒబెరాయ్ ఉదయవిలాస్‌లో వివాహ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. 200 మందికి పైగా అతిథులు ఈ వివాహ వేడుకలో పాల్గొననున్నారు. వీరు బస చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 50 మందికి పైగా వివిఐపి అతిథులు కూడా వివాహ వేడుకకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు హోటళ్లలో వివాహ వేడుకకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ పెళ్లికి ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన పంజాబ్ కౌంటర్ భగవంత్ మాన్ సహా పలువురు హాజరుకానున్నారు. పరిణీతి చోప్రా కజిన్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ కూడా ఈ వేడుకలో పాల్గొననున్నారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా రానున్నారు.    

పరిణీతి పెళ్లికి అంతా రెడీ 

సెప్టెంబర్ 23న హల్దీ, మెహందీ, సంగీత్‌ తో  వివాహ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. పెళ్లి తర్వాత, హర్యానాలోని గురుగ్రామ్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నారు. లీలా ప్యాలెస్, ఉదయవిలాస్‌తో పాటు సమీపంలోని మూడు హోటళ్లను కూడా పరిణీతి, రాఘవ్ కుటుంబ సభ్యులు బుక్ చేశారు. వీవీఐపీ అతిథులు వచ్చే అవకాశం ఉండటంతో ఇంటెలిజెన్స్ అధికారులు హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా ఉదయపూర్‌కు వెళ్లి హోటళ్లను చూశారు. అన్నీ ఓకే అనుకున్నాకే బుక్ చేశారు.  

పెళ్లి మూడ్ లోకి వెళ్లిపోయిన పరిణీతి

ప్రస్తుతం పరిణీతి చోప్రా పెళ్లి మూడ్ లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలన్నింటినీ పూర్తి చేసింది. ఆమె తాజా చిత్రం ‘మిషన్ రాణిగంజ్‌‘ షూటింగ్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సినిమాల విషయాన్ని పక్కన పెట్టి కుటుంబతో హ్యాపీగా జాలీగా గడుపుతోంది.   రెండు మూడు రోజుల్లో పెళ్లి కోసం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు వెళ్లనున్నట్లు తలుస్తోంది. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో పెళ్లి జరగనుంది.

పెళ్లి గురించి రాఘవ్ ఏమన్నారంటే?

త్వరలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్న పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా తమ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. “పరిణీతితో పెళ్లి మాయాజాలంలా అనిపిస్తోంది. నా జీవిత భాగస్వామిలా ఆమె రావడం సంతోషంగా ఉంది. తన లాంటి అమ్మాయిని భార్యగా పంపింపించబోతున్న దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను” అని రాఘవ్ వెల్లడించారు.   

ఇక ప్రస్తుతం పరిణీతి చోప్రా, అక్షయ్ కుమార్‌తో కలిసి నటించిన ‘మిషన్ రాణిగంజ్’ విడుదలకు సిద్ధమవుతోంది. 1989 రాణిగంజ్ కోల్ ఫీల్డ్స్ డిజాస్టర్ సమయంలో 65 మంది మైనర్లను రక్షించిన ఇంజనీర్ జస్వంత్ సింగ్ గిల్ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. అటు  ఇంతియాజ్ అలీ  జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘చమ్కిలా’లో కూడా  ఆమె కనిపించనుంది.  ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది.     

Read Also: మూవీ చూడండి, అనుష్కతో మాట్లాడండి - ప్రేక్షకులకు ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మేకర్స్ బంఫర్ ఆఫర్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget