Mirzapur Movie: 'మీర్జాపూర్' మూవీ వచ్చేస్తోంది - వెబ్ సిరీస్‌ను మించిపోయేలా... బిగ్ అప్డేట్ ఇచ్చిన త్రిపాఠి
Mirzapur: ఇండియన్ టాప్ క్రేజీ వెబ్ సిరీస్‌ల్లో ఒకటైన 'మీర్జాపూర్' మూవీగా రాబోతోన్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించారు నటుడు పంకజ్ త్రిపాఠి.

Pankaj Tripathi About Mirzapur Movie: 'మీర్జాపూర్' ఈ పేరు వింటేనే ఇండియన్ ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్ మనకు గుర్తొస్తుంది. బోల్డ్ కంటెంట్, యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పటికే 3 సీజన్స్ పూర్తి కాగా... ఇందులోని రోల్స్ ఆడియన్స్ మదిలో ఓ చెరగని ముద్ర వేశాయి. మున్నా భయ్యా, త్రిపాఠీ రోల్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
ఈ సిరీస్‌లో బోల్డ్ కంటెంట్, మోతాదుకు మించి బూతులు, రాజకీయ ఎత్తులు, వాటికి పైఎత్తులు, రక్తపాతం, యాక్షన్ సీన్స్‌పై విపరీతంగా ట్రోలింగ్స్, విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా మున్నాభయ్యా రోల్‌పై సోషల్ మీడియా వేదికగా మీమ్స్ కూడా హల్చల్ చేశాయి. ఇప్పటికే 3 సీజన్లు పూర్తి చేసుకుంది ఈ సిరీస్. ఎన్ని విమర్శలు వచ్చినా ఒకదాన్ని మించి మరొకటి అనేలా మంచి రెస్పాన్స్ అందుకుంది.
ఈ సంచలన వెబ్ సిరీస్‌ను కరణ్ అన్షుమాన్, పునీత్ కృష్ణ రూపొందించగా... పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు శర్మ (మున్నా భయ్యా), శ్వేతా త్రిపాఠి, రసిక దుగల్, ఇషా తల్వార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించగా... ఫర్హాన్ అక్తర్ నిర్మాతగా వ్యవహరించారు.
మీర్జాపూర్ మూవీగా...
ఇప్పటికే 3 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ నాలుగో సీజన్ కూడా రూపొందుతోంది. 'అమెజాన్ ప్రైమ్' వీడియో ఓటీటీ వేదికగా సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా... 'మీర్జాపూర్' మూవీ కూడా రాబోతోంది. 'మీర్జాపూర్ ధి ఫిల్మ్' పేరుతో మూవీ రానున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. తాజాగా దీనిపై నటుడు పంకజ్ త్రిపాఠి స్పందించారు.
షూటింగ్ అప్పుడే స్టార్ట్
ఈ మూవీలో 'కాలీన్ భయ్యా' పాత్రలో పంకజ్ త్రిపాఠి కనిపించనున్నారు. 'ఈ సినిమా ఎప్పుడు మీ ముందుకు వస్తుందో నేను కచ్చితంగా చెప్పలేను. కుటుంబంతో కలిసి వెకేషన్‌కు వెళ్లి తిరిగివచ్చాను. 'మీర్జాపూర్' సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కానీ ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. మరో నెలలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని నేను బలంగా నమ్ముతున్నా.' అని చెప్పారు.
దీంతో పంకజ్ కామెంట్స్ వైరల్‌గా మారాయి. 'మీర్జాపూర్' సిరీస్ రూపొందించిన పునీత్ కృష్ణ మూవీకి స్టోరీ అందించనుండగా... గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామని నిర్మాత ఫర్హాన్ ఇదివరకే ప్రకటించారు. సిరీస్ ఎంత హిట్ అయ్యిందో మూవీ కూడా అంతే హిట్ అవుతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ - లగ్జరీ కారు కొనేసిన హీరోయిన్ శ్రీదేవి... ధర ఎంతో తెలుసా?
స్టోరీ ఏంటంటే?
యూపీలోని మీర్జాపూర్ జిల్లాలో జరిగే క్రైమ్, పాలిటిక్స్ గురించి ఈ సిరీస్‌లో చూపించారు. బోల్డ్ సీన్స్, బూతులు అక్కడక్కడ కొంచెం ఇబ్బంది పెడతాయి. అఖండానంద్ త్రిపాఠి (పంకజ్ త్రిపాఠి) అనే వ్యక్తి మాఫియా డాన్ కాగా... అతని కుమారుడు మున్నా భయ్యా (దివ్యేందు శర్మ) అధికారం కోసం పాకులాడుతుంటాడు. వీరి అక్రమాలకు వ్యతిరేకంగా గూడూ, గోలు అనే ఇద్దరు వ్యక్తులు తిరగబడతారు. ఈ ఘటన మీర్జాపూర్ రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొస్తుంది. మూడు సీజన్లలోనూ ఈ స్టోరీ ప్రధానాంశం కాగా... మున్నా భయ్యా రోల్ మరింత పాపులర్ అయ్యింది. ఈ జోష్‌తోనే నాలుగో సీజన్, మూవీ సైతం రూపొందుతున్నాయి.






















