Chiyaan Vikram New Movie: వెండితెరపై విక్రమ్ దళితవాదం - కొత్త సినిమా షురూ
Chiyaan 61 Started With Pooja: చియాన్ విక్రమ్ హీరోగా నటించనున్న కొత్త సినిమా ఈ రోజు చెన్నైలో మొదలైంది. ఈ సినిమాలో దళితుల సమస్యలను విక్రమ్ ప్రస్తావించనున్నారని తెలుస్తోంది.
వెండితెరపై చియాన్ విక్రమ్ దళితవాదం వినిపించనున్నారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా దళితులు ఎదుర్కొన్న / ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన సూటిగా ప్రస్తావించనున్నారని చెన్నై సమాచారం.
దర్శకుడు పా. రంజిత్‌తో చియాన్ విక్రమ్ ఒక సినిమా చేస్తున్నారు. హీరోగా ఆయన 61వ చిత్రమిది. స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఈ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ రోజు చెన్నైలో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. 1800 కాలం నాటి కథతో త్రీడీలో ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలిసింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : నాకు మా అమ్మాయి ఏమీ చెప్పలేదు - లలిత్ మోడీతో సుష్మితా సేన్ డేటింగ్‌పై తండ్రి స్పందన
Chiyaan 61 - Pooja - Chiyaan Vikram | Pa Ranjith | Studio Green | Neelam Productions https://t.co/sJNpjknvl3
— Studio Green (@StudioGreen2) July 16, 2022
దర్శకుడు పా రంజిత్ తీసిన సినిమాలు తెలుగులో కూడా అనువాదం అయ్యాయి. రజనీకాంత్ 'కాలా', 'కబాలి' చిత్రాలకు ఆయనే దర్శకుడు. దళితుల సమస్యలే ప్రధాన అజెండాగా పా రంజిత్ సినిమాలు తీస్తూ ఉంటారు. విక్రమ్ సినిమా కూడా ఆయన గత సినిమాల బాటలో ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో 1800 కాలంలో దళిత సమస్యలను ప్రస్తావించనున్నట్లు కోలీవుడ్ ఖబర్.
Also Read : మళ్ళీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు
View this post on Instagram