అన్వేషించండి

Oy Director Anand Ranga: ఒరేయ్ గుండు.. ఎటు పోయావ్ అంటూ నెటిజన్‌ కామెంట్‌ - ‘ఓయ్‌’ డైరెక్టర్ రియాక్షన్ ఇదే!

Oy Director Anand Ranga: 'ఓయ్' సినిమా రీ-రిలీజ్ నేపథ్యంలో డైరెక్టర్ ఆనంద్ రంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలో ‘గుండు..’ అని కామెంట్‌ చేసిన ఓ నెటిజన్ ట్వీట్ కి ఆయన స్పందించారు. 

Oy Director Anand Ranga: టాలీవుడ్‌‌లో ప్రస్తుతం కొనసాగుతున్న రీ-రిలీజ్ ట్రెండ్ లో భాగంగా మరోసారి థియేటర్లలోకి రాబోతున్న సినిమా 'ఓయ్'. బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా ఆనంద్ రంగా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. అప్పట్లో ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అవ్వకపోయినా, ఇప్పుడు కల్ట్ క్లాసిక్ స్టేటస్ అందుకుంది. అందుకే ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని వాలెంటైన్స్ డే స్పెషల్‌ గా ఫిబ్రవరి 14న రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. దీంతో చాలా కాలంగా ఆఫ్ లైన్ లో ఉన్న దర్శకుడు ఒక్కసారిగా సోషల్ మీడియాలో యాక్టీవ్ అయిపోయారు. అయితే తన సినిమా రీ-రిలీజ్ విషయాన్ని పంచుకున్న ఆయనకి ఓ అనుకోని అనుభవం ఎదురైంది. 

‘ఓయ్‌’ సినిమా ఈ నెల 14న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలియజేస్తూ ట్విటర్‌ ‘ఎక్స్‌’ లో తన ఆనందాన్ని పోస్టర్‌ పంచుకున్నారు ఆనంద్ రంగా. ఎప్పటి నుంచో ఈ మూవీ రీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న నెటిజన్లు అందరూ దీనిపై స్పందించారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘‘ఒరేయ్ గుండు నాయాలా.. ఇలాంటి మంచి సినిమా తీసి ఎటు వెళ్లిపోయావ్‌ రా’’ అని కామెంట్ చేసారు. దీనికి దర్శకుడు స్పందిస్తూ స్మైలీ ఎమోజీని పోస్ట్‌ చేశారు. రంగా రిప్లైకు షాక్‌ అయిన సదరు నెటిజన్‌.. 'గుండు అని పిలిచినందుకు సారీ సార్' అని క్షమాపణలు కోరారు. దీంతో ఆయన ‘‘ఏం ఫర్వాలేదు. మీరు అన్నది నిజమే’’ అని సమాధానమివ్వడంతో, నిన్నటి నుంచి డైరెక్టర్ టైం లైన్ అంతా గుండు కామెంట్స్ తో నిండిపోయింది. 

Also Read: గోపీచంద్‌కు పోటీగా ఆనంద్ దేవరకొండ - 'గం గం గణేశా' రిలీజ్ డేట్ ఫిక్స్?

‘‘మిమ్మల్ని గుండు గారు అని పిలవొచ్చా?’’ అని మరో నెటిజన్ అడగ్గా, 'మీ ఇష్టం' అంటూ రిప్లై ఇచ్చారు ఆనంద్. 'నాకు ఫ్రీ టికెట్స్ ఇవ్వకపోతే మీ గుండు మీద ఒట్టు' అని ఇంకో నెటిజన్ పోస్ట్ చేయగా, Lol అంటూ దాన్ని సరదాగా తీసుకున్నారు. 'ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ రంగా మీరేనా?' అని ప్రశ్నించగా, 'కాదు.. రాజీవన్ అని ఎక్ట్రార్డినరీ డైరెక్టర్' అని సెటైరికల్ గా బదులిచ్చారు. మాములుగా సోషల్‌ మీడియాలో కొందరు నెగెటివ్ కామెంట్స్ పెడుతూ ట్రోల్ చేస్తుంటారని సెలబ్రిటీలు ఎవరూ నెటిజన్లకు పెద్దగా రిప్లై ఇవ్వరు. అయితే ఆనంద్ రంగా మాత్రం అన్నిటికీ పాజిటివ్ గా రియాక్ట్ అవుతూ వచ్చారు. అంతేకాదు 'గుండు నాయాలా లేటెస్ట్ పిక్' అంటూ తన ఫోటోని కూడా షేర్ చేసారు. 

2009లో 'ఓయ్' సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయమయ్యారు. 'ఎ వాక్ టు రిమెంబర్' అనే హాలీవుడ్ సినిమా ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని RRR ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మించారు. ఫీల్ గుడ్ మూవీగా పేరు తెచ్చుకుంది కానీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో దర్శకుడికి మరో ఛాన్స్ రావడానికి టైం పట్టింది. అయితే 'ఆరెంజ్', 'కాదలి' లాంటి మరికొన్ని సినిమాలకు సాంగ్ డైరెక్టర్ గా, అడిషనల్ స్క్రీన్ ప్లే రైటర్ గా, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేసారు. 

2013లో సందీప్ కిషన్, నిషా అగర్వాల్ జంటగా 'డీకే బోస్' అనే చిత్రాన్ని నిర్మించారు ఆనంద్. కానీ 'అత్తారింటికి దారేది' సినిమా రిలీజ్ కారణంగా తన చిత్రాన్ని వాయిదా వేసుకున్నారు. దీని కారణంగా తాము కొంత డబ్బును కోల్పోయినప్పటికీ, నిర్మాత భారీ మొత్తంలో ఖర్చు చేసారు కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమానే రిలీజ్ అవ్వాలి అని ఆ సమయంలో ట్వీట్ కూడా చేశారు. అయితే ఆ సినిమా ఇంతవరకూ విడుదలకు నోచుకోలేదు. ఇక 2020లో మెగా డాటర్ సుష్మిత కొణిదెల నిర్మించిన 'షూట్ అవుట్ ఎట్ ఆలేరు' అనే వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించారు. అలానే 2023లో జీ5 కోసం 'వ్యవస్థ' అనే సిరీస్ రూపొందించారు. 

'ఓయ్' సినిమా రీరిలీజ్ కారణంగా డైరెక్టర్ ఆనంద్ రంగా వార్తల్లో నిలిచారు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ తన సొంత అనుభవంతో రాసుకున్నానని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పటికైతే 'ఓయ్ 2' ప్లాన్స్ ఏమీ లేవని బదులిచ్చారు. 'డీకే బోస్' చిత్రాన్ని ఓటీటీలో అయినా విడుదల చేయడానికి ట్రై చేస్తున్నానని చెప్పారు. 'ఆరెంజ్' మూవీలో 'సిడ్నీ నగరం' 'నేను నువ్వంటూ' 'హలో రమ్మంటే' వంటి మూడు సాంగ్స్ కి వర్క్ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం కొన్ని స్క్రిప్ట్స్ రాస్తున్నాని, హీరో - ప్రొడ్యూసర్ దొరికితే సినిమాలు చేస్తానని అన్నారు. 

Also Read: రాజమౌళి - మహేష్ బాబు సినిమాలో నాగార్జున? ఈ క్రేజీ కాంబోపై రెండేళ్ల క్రితమే హింట్?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget