Oscar 2023 Live : ఇండియాకు రెండు ఆస్కార్లు - చరిత్ర సృష్టించిన 'ఆర్ఆర్ఆర్', ఆస్కార్ విజేతలు ఎవరంటే?
Oscar Awards 2023 Live : ప్రపంచ సినిమా ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డ్స్ లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.
LIVE
Background
ఆస్కార్ అవార్డ్స్ (Oscars 2023) అంటే ఇండియాలో ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రపంచ సినిమా పురస్కారాల్లో ఆస్కార్ అవార్డులకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే, ఈ ఏడాది ఆస్కార్స్ మీద ఇండియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం మాత్రం 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమా అని చెప్పక తప్పదు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన సినిమా 'ఆర్ఆర్ఆర్' (RRR Movie Oscars). ఈ సినిమాలోని 'నాటు నాటు...' పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ లభించింది. ఎంఎం కీరవాణి సంగీతం అందించగా... చంద్రబోస్ రాసిన గీతమిది. యువ గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కీరవాణి తనయుడు కాలభైరవ ఆలపించారు. ఆస్కార్స్ వేదిక మీద ఈ పాటను లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. భారతీయ ప్రేక్షకులు ఈ ఏడాది ఆస్కార్స్ మీద ఎక్కువ ఆసక్తి చూపించడానికి కారణం ఈ పాట చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
'నాటు నాటు...' పాటతో పాటు డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 'ఆల్ దట్ బ్రీత్స్', డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' కూడా నామినేషన్ అందుకున్నాయి.
ఉత్తమ సినిమా కేటగిరీలో 'అవతార్: ది వే ఆఫ్ వాటర్', 'టాప్ గన్ : మావెరిక్', 'ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్', 'ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్', 'ఎల్విస్', 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్', 'ది ఫేబుల్ మ్యాన్స్', 'టార్', 'ట్రయాంగిల్ ఆఫ్ సాడ్ నెస్ ఉమెన్ టాకింగ్' పోటీ పడుతున్నాయి.
ఉత్తమ నటుడు విభాగంలో ఆస్టిన్ బట్లర్ (ఎల్విస్), కొలిన్ ఫార్రెల్ (ది బాన్షీస్ ఆఫ్ ఇనిషైరైన్), బ్రెండన్ ఫ్రాసెర్ (ది వేల్), పాల్ మెస్కల్ (ఆఫ్టర్ సన్), బిల్ నిగీ (లివింగ్)... ఉత్తమ నటి విభాగంలో కేట్ బ్లాంషెట్ (టార్), అన్నా దె అర్మాస్ (బ్లాండ్), ఆండ్రియా రైజ్‌బరో (టు లెస్లీ), మిషెల్ విలియమ్స్ (ది ఫేబుల్‌మ్యాన్స్), మిషెల్ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) పోటీ పడుతున్నారు.
నాటు నాటు (ఆర్‌ఆర్‌ఆర్)తో పాటు అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్), హోల్డ్ మై హ్యాండ్ ( టాప్‌గన్: మార్వెరిక్), లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్), ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) పాటలు ఆస్కార్ బరిలో నిలిచాయి.
ఉత్తమ దర్శకుడు విభాగంలో మార్టిన్ మెక్‌డొనాగ్ (ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్), డానియెల్ క్వాన్, డానియెల్ స్కీనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్), స్టీవెన్ స్పీల్ బర్గ్ (ది ఫేబుల్‌మ్యాన్స్), టడ్ ఫీల్డ్ (టార్), రూబెన్ ఆస్ట్లాండ్ (ట్రైయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్) పోటీ పడుతున్నారు.
'అవతార్'కు గాను జేమ్స్ కామెరూన్ ఉత్తమ దర్శకుడు పోటీలో లేరు. కానీ, ఆయన సినిమా పలు విభాగాల్లో పోటీ పడుతోంది. ఈ ఏడాది ఎవరు ఆస్కార్ గెలిచారు? ఏమైంది? వంటి వివరాల కోసం ఈ పేజీ చూడండి. తెలుగు ప్రేక్షకుల కోసం ఆస్కార్ లైవ్ అప్డేట్స్...
ఉత్తమ సినిమా ఏది అంటే?
ఉత్తమ సినిమాగా 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' నిలిచింది. 95వ ఆస్కార్ వేడుకల్లో ఆ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది.
ఉత్తమ నటి మిషెల్ యో
ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' సినిమాకి గాను మిషెల్ యో ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి ఏసియా మహిళగా ఆమె రికార్డ్ క్రియేట్ చేశారు.
ఉత్తమ నటుడు - బ్రెండన్ ఫ్రాసెర్
'ద వేల్' సినిమాకి గాను బ్రెండన్ ఫ్రాసెర్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్నారు.
టాప్ గన్ మావెరిక్ కి అవార్డు
బెస్ట్ సౌండ్ విభాగంలో 'టాప్ గన్ మావెరిక్' సినిమాకు అవార్డు వచ్చింది.
బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ ఎవరికి అంటే?
'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' సినిమాకు గాను డేనియల్ క్వాన్, డేనియల్ స్చెయింర్ట్ ఉత్తమ దర్శకులుగా అవార్డు అందుకున్నారు.