News
News
వీడియోలు ఆటలు
X

ఆ సామాన్యుల చేతిలో ఆస్కార్ - పట్టరాని ఆనందంలో ‘ఎలిఫ్యాంట్ విష్పర్స్’ జంట

చరిత్రలో నిలిచిపోయే చిత్రం కదూ ఇది. ఎక్కడో మారు మూల అటవీ ప్రాంతంలో నివసించే ఆ జంట చేతికి ‘ఆస్కార్’ చిక్కుతుందని ఎప్పుడైనా ఊహించారా? అది ‘ఎలిఫ్యాంట్ విష్పర్స్’ వల్లే సాధ్యమైంది.

FOLLOW US: 
Share:

సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ ను అందుకున్న ఆనందంలో ఉన్న ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ షార్ట్ ఫిల్మ్ లో కనిపించిన నిజ జీవిత జంతు పోషకులు బొమ్మన్, బెల్లిలు మరో సారి వార్తల్లో నిలిచారు. ఆస్కార్ ను పట్టుకొని ఫొటోలకు ఫోజిచ్చారు. 

మార్చి 12న అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘‘నాటు నాటు’’ సాంగ్ కు గానూ ది బెస్ట్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ ను దక్కించుకొని అందరిచేత ప్రశంసలు అందుకుంది. దీంతో కేవలం అందులో నటించిన నటీ నటులకే కాదు.. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, రచయిత... ఇలా ఆ మూవీలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికీ ఎంతో పేరు వచ్చింది. అంత విలువ ఉన్నది కాబట్టే ఆస్కార్ అంటే అందరికీ ఎనలేని గౌరవం, మక్కువ. 

అదే తరహాలో ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ ది బెస్ట్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీని గునీత్ మోంగా నిర్మించారు. కార్తికి గోన్స్ లేవ్స్ తెరకెక్కించిన ఈ సినిమాలో రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ జంతువులను అమితంగా ప్రేమించే, సంరక్షించే బొమ్మన్, బెల్లీ అనే దంపతులు నటించి, మెప్పించారు. కాగా తాజాగా వీరిద్దరూ కలిసి ఆస్కార్ అవార్డును పట్టుకొని ఫొటోలు దిగారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా... దీంతో ఇవి వైరల్ గా మారాయి. 

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. డైరెక్టర్ కార్తికి తన ఇన్స్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. మనం విడిపోయి నాలుగు నెలలు అయింది.. ఇప్పుడు ఒకే ఇంట్లో ఉన్నట్టుగా భావిస్తున్నాను అంటూ ఆయన రాసుకొచ్చారు. దాంతో పాటు బొమ్మన్, బెల్లి దంపతులు ఆస్కార్ తో దిగిన ఫొటోను జత చేశారు. ఈ పోస్ట్ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ కు స్పందించిన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లాని.. ఎప్పటికైనా తనకు ది బెస్ట్ పిక్చర్ ఇదేనని కామెంట్ చేశారు. ఆయనతో పాటు చాలా మంది సినీ ప్రముఖులు కూడా వారిని ప్రశంసిస్తూ, అభినందిస్తూ రిప్లై ఇస్తున్నారు.

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ గెలుచుకొని పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. ఆ తర్వాత వీరి టాలెంట్ కు చిహ్నంగా మార్చి 15న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ... ఈ డాక్యుమెంటరీ లో నటించిన దంపతులు బొమ్మన్, బెల్లిలను సత్కరించారు. దాంతో పాటు ఒక్కరికీ రూ.1 లక్ష చెక్కును, ఓ షీల్డ్ ను అందజేశారు. ఇక ఇటీవలే డైరెక్టర్ కార్తికి రూ.1 కోటి నగదును, జ్ఞాపక, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ ను గెలుచుకున్నందుకు అభినందించారు.

Read Also: ఇండస్ట్రీలో నానికి పోటీనిచ్చే హీరో లేడట! ‘దసరా’ బాగా తీయలేదంటూ నేచురల్ స్టార్ వ్యాఖ్యలు

తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో...

బొమ్మన్, బెల్లి దంపతులకు జంతువులంటే ప్రాణం ఇచ్చేలా చూస్కుంటారు. ఆ మమకారంతోనే తప్పిపోయిన ఓ ఏనుగును చెరదీశారు. దాన్ని కూడా తమ జీవితంలో భాగం చేసుకొని, జీవనం సాగిస్తున్నారు. ఏనుగు బాధ్యతలు తీసుకున్న వారిద్దరూ.. పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఈ క్రమంలోనే ఆ ఏనుగుకు, వారి మధ్య అనుబంధం, ప్రేమ ఏర్పడింది.ఈ ప్రేమకే దృశ్య రూపం కల్పిస్తూ కార్తికి.. ది ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ అనే షార్ట్ ఫిల్మ్ ను  తెరకెక్కించారు. నిజ జీవితానికి దగ్గరగా ఉండే ఈ కథ అందరికీ నచ్చడంతో.. ఈనాడు ఈ డాక్యుమెంటరీ ప్రంపంచంలోనే ది బెస్ట్ షార్ట్ ఫిల్మ్ లలో ఒకటిగా నిలిచింది.

Published at : 24 Mar 2023 01:32 AM (IST) Tags: Oscar Award The Elephant Whisperers Bomman Belli

సంబంధిత కథనాలు

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు 

Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు 

ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు 

ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు 

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?

Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?