OG Guns N Roses Song: గన్స్ & రోజెస్... సోమవారమే 'ఓజీ'లో మూడో పాట రిలీజ్... టైమ్ తెలుసా?
OG Movie Updates: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' నుంచి మూడో పాట విడుదల కానుంది. గన్స్ అండ్ రోజెస్ రిలీజ్ డేట్ టైం చెప్పింది సినిమా యూనిట్. ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఆల్రెడీ ట్రెండ్ చేయడం స్టార్ట్ చేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'ఓజీ'. ఆల్రెడీ రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. 'ఫైర్ స్ట్రోమ్', 'సువ్వి సువ్వి' పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు ఇందులో మూడో పాట గన్స్ అండ్ రోజెస్ రిలీజ్ డేట్ అండ్ టైం అనౌన్స్ చేసింది యూనిట్.
సోమవారం సాయంత్రం గన్స్ అండ్ రోజెస్ రిలీజ్!
'ఓజీ' నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ వచ్చిన సరే ఒక రేంజ్‌లో వైరల్ అవుతోంది. 'ఫైర్ స్ట్రోమ్...' సాంగ్ అయితే యూట్యూబ్ రికార్డులు క్రియేట్ చేసింది. 'సువ్వి సువ్వి...' పాట మెలోడీ ప్రేమికులు అందరినీ ఆకట్టుకుంది. 'హంగ్రీ చీతా...' గురించి అయితే చెప్పావలసిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా 'ఓజీ' పాటలే వినపడుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరొక సాంగ్ రిలీజ్ అవ్వడానికి రెడీ అయింది.
'ఓజీ' కోసం గన్స్ అండ్ రోజెస్ సాంగ్ కంపోజ్ చేశారు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఈ సోమవారం అంటే సెప్టెంబర్ 15 సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాలకు గన్స్ అండ్ రోజెస్ రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం అనౌన్స్ చేసింది. ఇది ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని పేర్కొంది.
#GunsNRoses 🔫🌹
— DVV Entertainment (@DVVMovies) September 14, 2025
A SURESHOT BLOCKBUSTER song dropping tomorrow at 4:50 PM 🎯💯 #OG #TheyCallHimOG pic.twitter.com/V8IWj9Tdbq
అమెరికాలో కలెక్షన్స్ రికార్డులు క్రియేట్ చేస్తున్న 'ఓజీ'!
'ఓజీ' విడుదలకు 10 రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే నార్త్ అమెరికాలో ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయ్యాయి. పవర్ స్టార్ రేంజ్ ఏమిటో ఈ సినిమా చూపిస్తోంది అక్కడ. ప్రీమియర్స్ సేల్స్ విషయానికి వస్తే 50 వేల టికెట్స్ అమ్ముడు అయ్యాయి. మూవీ విడుదలకు 10 రోజుల ముందు ఈ ఫీట్ సాధించిన తొలి సినిమాగా 'ఓజీ' రికార్డు క్రియేట్ చేసింది. ప్రీమియర్స్ ద్వారా రెండు మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Records keep falling… the OG of Box Office keeps rising 😎🔥
— DVV Entertainment (@DVVMovies) September 14, 2025
ALL TIME FASTEST……#OG #TheyCallHimOG pic.twitter.com/ALUouxjJ0A
పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటించిన 'ఓజీ' సినిమాకు 'సాహో' ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద డివివి దానయ్య, ఆయన తనయుడు కళ్యాణ్ దాసరి ప్రొడ్యూస్ చేశారు. సెప్టెంబర్ 24న అమెరికాలో ప్రీమియర్ షోలు పడతాయి. సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతుంది.





















