Salman Khan Tiger 3 Collections : వరల్డ్ కప్ ఎఫెక్ట్, భారీగా తగ్గిన 'టైగర్ 3' కలెక్షన్స్ - మ్యాచ్ రోజు వచ్చింది ఇంతేనా?
Tiger 3 Collections : వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' కలెక్షన్స్ పై గట్టి ప్రభావాన్ని చూపింది.
Salman Khan Tiger 3 : సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' మూవీ పై వరల్డ్ కప్ మ్యాచ్ భారీ ప్రభావాన్ని చూపించింది. నవంబర్ 15 బుధవారం రోజున ఇండియా వర్సెస్ న్యూజిలాండ్(India Vs Newzeland) వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే కదా. ఈ మ్యాచ్ సందర్భంగా 'టైగర్ 3'(Tiger 3) మూవీ కలెక్షన్స్ ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. అప్పటివరకు భారీగా దూసుకుపోతున్న 'టైగర్ 3' కలెక్షన్స్ మ్యాచ్ రోజున ఏకంగా 45 శాతం వరకు పతనం అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. యశ్ రాజ్ పై యూనివర్స్(Yash Raj Spy Universe)లో భాగంగా తెరకెక్కిన 'టైగర్ 3' దీపావళి కానుకగా నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్ ని అందుకుంది. అయితే ఉన్నట్టుండి నాలుగో రోజు కలెక్షన్స్ పూర్తిగా డౌన్ అయిపోయాయి. అందుకు కారణం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్ ఉండడమే. రిలీజ్ అయిన రోజు 'టైగర్ 3' మూవీ ఇండియా వైడ్ గా రూ.44.5 కోట్ల ఓపెనింగ్స్ ని అందుకుంది. ఆ తర్వాత రెండో రోజు రూ.52 కోట్లు, మూడోరోజు రూ.48 కోట్లు రాబట్టింది. కానీ నాలుగో రోజు మాత్రం కేవలం రూ.23 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ కలెక్షన్స్ ని బట్టి 'టైగర్ 3' మూవీపై మ్యాచ్ ప్రభావం గట్టిగానే పడిందని చెప్పొచ్చు. మొత్తం నాలుగు రోజులు కలిపితే ఈ మూవీకి రూ.170 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
వరల్డ్ కప్ సెమీఫైనల్ కారణంగా భారీగా తగ్గిపోయిన కలెక్షన్స్ మళ్లీ పుంజుకుంటాయా? లేదా అనేది చూడాలి. ఇదిలా ఉంటే నవంబర్ 19 ఆదివారం వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఉంది. అప్పుడు కూడా ఈ మూవీపై మ్యాచ్ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కానీ దానికంటే ముందు వరకు మాత్రం 'టైగర్ 3' బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో ఈ మూవీకి బాక్సాఫీస్ దగ్గర ఎటువంటి కాంపిటీషన్ లేదు. సోలో గానే ఈ మూవీ బాక్సాఫీ దగ్గర సందడి చేస్తోంది.
కాబట్టి వరల్డ్ కప్ ఫైనల్ కు ముందు వరకు 'టైగర్ 3' కలెక్షన్స్ పెరుగుతాయని చెప్పడంతో ఎటువంటి సందేహం లేదు. ఇక 'టైగర్ 3' విషయానికి వస్తే మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్ తో పాటు షారుక్, హృతిక్ రోషన్ అతిథి పాత్రలు పోషించారు. ప్రముఖ దర్శక నిర్మాత యశ్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా ఈ సినిమాని నిర్మించడంతోపాటు కథ అందించారు. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందింది.
సల్మాన్, కత్రినా జంటగా నటించిన 'ఏక్తా టైగర్'(Ektha Tiger) మూవీ తో ఈ స్పై యూనివర్స్ మొదలవగా దానికి సీక్వెల్ గా వచ్చిన 'టైగర్ జిందా హై'(Tiger Zinda Hai) మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఆ మూవీకి కొనసాగింపుగా 'టైగర్ 3'(Tiger 3) ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అందుకుంది. గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న సల్మాన్ ఖాన్ కి ఈ మూవీ మంచి కం బ్యాక్ ఇచ్చింది.
Also Read : తండ్రి వర్థంతి సందర్భంగా మహేష్ కీలక నిర్ణయం, వారికి చేయుత?