NTR Teases Fans : ఫ్యాన్స్‌ను టీజ్ చేసిన ఎన్టీఆర్ - కొరటాల శివ సినిమా అప్డేట్ అడిగితే?
'దాస్ కా ధమ్కీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (Das Ka Dhamki Pre Release Event)లో అభిమానులను ఎన్టీఆర్ టీజ్ చేశారు. కొరటాల శివ సినిమా అప్డేట్ అడిగితే ఆయన ఫన్నీగా స్పందించారు.
అభిమానులను యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) టీజ్ చేశారు. కొరటాల శివ సినిమా అప్డేట్ గురించి అడిగితే సినిమా చేయడం లేదన్నారు. అలా ఆగిడితే ఆపేస్తానని చెప్పారు. ఆస్కార్స్ నుంచి తిరిగి వచ్చిన ఎన్టీఆర్ హుషారుగా ఉన్నారు. అసలు వివరాల్లోకి వెళితే...
'ఆర్ఆర్ఆర్' సినిమా (RRR Movie) చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళలేదు. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ... వివిధ కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అతి త్వరలో, ఈ నెలలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది.
ఆస్కార్స్ నుంచి వచ్చిన ఎన్టీఆర్... తన అభిమాని విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా సినిమా 'దాస్ కా ధమ్కీ' ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభిమానులు అందరూ కొత్త సినిమా అప్డేట్ కావాలని అడిగారు.
నెక్స్ట్ సినిమా చేయడం లేదు - ఎన్టీఆర్ సరదా స్పీచ్
''ఏంటి అబ్బాయ్! నెక్స్ట్ సినిమా నేనేమీ చేయడం లేదు. (నవ్వుతూ...) ఎన్నిసార్లు చెప్పాలి!? మొన్నే చెప్పాను కదా! త్వరలో మొదలు అవుతుంది, ఆగండి. మీరు అలా అడుగుతుంటే... నెక్స్ట్ సినిమా చేయడం లేదని చెప్పేస్తా. ఆపేస్తాను కూడా! మీరు (సినిమాలు) ఆపమన్నా... నేను ఆపలేను. ఒకవేళ నేను ఆపేసినా మీరు ఊరుకోరు. ఆ సినిమా గురించి చెప్పడానికి ఇది సరైన వేదిక కాదు. త్వరలో చెబుతా'' అని అభిమానులతో సరదాగా స్పందించారు ఎన్టీఆర్.
— .... (@ynakg2) March 17, 2023
అన్నయ్య కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్ వేడుకలో దర్శక, నిర్మాతలపై NTR 30 Movie అప్డేట్స్ చెప్పమని ఒత్తిడి తీసుకు రావద్దని ఎన్టీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. అప్పుడు ఓ షెడ్యూల్ వేసుకున్నారు. అయితే, నందమూరి తారక రత్న మరణం తర్వాత ముందుగా అనుకున్న ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. ఈ నెలలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం ఎన్టీఆర్ అలవాటు. 'దాస్ కా ధమ్కీ' ప్రీ రిలీజ్ వేడుకలో సైతం ఆయన సహజమైన పంథాలో మాట్లాడారు. 'ఫలక్ నుమా దాస్', 'పాగల్' చిత్రాల తర్వాత ఒక ఇమేజ్ ఛట్రంలో విశ్వక్ సేన్ వెళుతున్నట్లు తనకు అనిపించిందని, అయితే 'అశోక వనంలో అర్జున కళ్యాణం', 'హిట్' చిత్రాలతో తనకు షాక్ ఇచ్చాడని చెప్పుకొచ్చారు. నటుడిగా చేంజ్ అయ్యాడని పేర్కొన్నారు. తనకు చేంజ్ కావడానికి చాలా కాలం పట్టిందన్నారు.
లేటుగా రియలైజ్ అయ్యా - ఎన్టీఆర్
''నేను చేంజ్ అవ్వడానికి చాలా కాలం పట్టింది. నేను ఒక ఛట్రంలో వెళ్ళిపోతున్నాని టైములో ఎప్పటికో రియలైజ్ అయ్యి... కొత్త చిత్రాలు చేద్దామని, నటుడిగా నేను ఆనందపడే చిత్రాలు చేద్దామని చాలా లేటుగా రియలైజ్ అయ్యాను. నాకు బాగా గుర్తు ఉంది... అప్పుడు ఇదే వేదిక ఓ మాట అన్నాను. మీరు (అభిమానులకు) కాలర్ ఎగరేసేలా చేస్తానని! ఆ రోజు నేను నటుడిగా మళ్ళీ పుట్టాను. అందుకే, ఆ నటన కోసమే నేను తాపత్రయపడుతున్నాను కాబట్టే మీ అందరూ కాలర్ ఎత్తుకునేలా చేశానని అనుకుంటున్నాను'' అని ఎన్టీఆర్ మాట్లాడారు.
Also Read : మళ్ళీ ఆస్కార్ కొడతాం - స్టేజిపై ఇద్దరు తెలుగోళ్ళు కనిపించారు, కిక్ ఇచ్చే ఎన్టీఆర్ స్పీచ్
ఎన్టీఆర్ 30 విషయానికి వస్తే... జాన్వీ కపూర్ కథానాయికగా నటించనున్నట్లు ఆమె పుట్టినరోజున అధికారికంగా వెల్లడించారు. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఇంకా అధికారికంగా చెప్పలేదు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ : రత్నవేలు.
Also Read : రామ్ చరణ్‌కు అమిత్ షా సత్కారం - ఇండియన్ సినిమా లెజెండ్ చిరంజీవి అంటూ...