'వార్ 2'లో పవర్ ఫుల్ విలన్‌గా ఎన్టీఆర్ - కన్ఫర్మ్ చేసిన 'టైగర్ 3'
బాలీవుడ్ అగ్ర హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న 'వార్ 2' మూవీలో జూనియర్ ఎన్టీఆర్ విలన్ రోల్ పోషించబోతున్నట్లు 'టైగర్ 3' మూవీలో చూపించారు.
'RRR' మూవీతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే బాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నాడనే విషయం తెలిసిందే. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో రాబోతున్న 'వార్ 2'(War 2) మూవీలో ఎన్టీఆర్ నటిస్తున్నారనే వార్త బయటకు రావడంతో బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ 'వార్ 2' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ 'వార్ 2' ఎన్టీఆర్ పోషించబోయే పాత్ర కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం 'వార్ 2' మూవీలో ఎన్టీఆర్ పవర్ఫుల్ విలన్ పాత్ర చేయబోతున్నారని, హృతిక్ రోషన్ ను ఢీకొట్టే విలన్ గా తారక్ కనిపిస్తారంటూ వార్తలు వినిపించాయి.
అవన్నీ రూమర్స్ అని తెలిసినా ఫ్యాన్స్ మాత్రం ఆ న్యూస్ విని ఫుల్ ఖుషి అయ్యారు. ఎందుకంటే తారక్ విలన్ పాత్ర చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఇప్పటికే 'జై లవకుశ' సినిమాలో చూశాం. విలన్ పాత్రలో ఎన్టీఆర్ ఎంతో గంభీరంగా కనిపిస్తాడు. 'జై లవకుశ' లో ఎన్టీఆర్ విలనిజాన్ని ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అంత ఈజీగా మర్చిపోలేరు. ఇప్పుడు అదే విలనిజాన్ని బాలీవుడ్ స్పై అండ్ యాక్షన్ మూవీలో ఎన్టీఆర్ చూపించబోతున్నారంటే కచ్చితంగా ఆ ప్రాజెక్టు బ్లాక్ బాస్టర్ కావడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే 'వార్ 2' మూవీలో తారక్ చేయబోయే పాత్ర పై ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం 'వార్ 2' లో ఎన్టీఆర్ పవర్ఫుల్ విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇదే విషయాన్ని సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' మూవీలో చూపించారు. 'టైగర్ 3' మూవీ టైంలో 'వార్ 2' గ్లింప్స్ ను ఆడియన్స్ కు చూపించారు. అందులో హృతిక్ రోషన్ కి ఒక వ్యక్తి విలన్ గురించి చెబుతున్నాడు. "ఇండియాకు ఒక కొత్త శత్రువు తయారయ్యాడు. ఇప్పటివరకు ఎవరు చూడని అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. అతడు ఎలా ఉంటాడో తెలియదు. పేరు కూడా తెలియదు. పూర్తిగా చీకట్లో ఉంటాడు. అతన్ని ఎదుర్కోవాలంటే నువ్వు కూడా చీకట్లోనే వెళ్లాలి. అతని పోరాటం మరణం కంటే ప్రమాదం" అంటూ విలన్ పాత్రను పరిచయం చేశారు.
అయితే ఇక్కడ విలన్ ఎన్టీఆర్ అని గ్లింప్స్ లో చూపించలేదు. కానీ తారక్ గురించి చెబుతున్నట్లు అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే 'వార్ 2' లో హృతిక్ రోషన్ హీరో అయితే ఎన్టీఆర్ విలన్ రోల్ చేస్తున్నట్లు ముందే నుంచే వార్తలు వినిపించాయి. ఇక 'టైగర్ 3' మూవీ టైంలో వచ్చిన గ్లింప్స్ లో విలన్ పాత్రను హీరో కంటే పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేయడంతో కచ్చితంగా ఆ పాత్రను ఎన్టీఆర్ పోషిస్తున్నట్లు అందరికీ అర్థమయిపోయింది. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు. రీసెంట్ గానే 'వార్ 2' రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం విదేశాల్లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 'దేవర' షూటింగ్ పూర్తి అయిన అనంతరం ఎన్టీఆర్ 'వార్ 2' షూటింగ్లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది.
Also Read : ‘కంగువ’ స్పెషల్ పోస్టర్ - ఇంటెన్స్ లుక్ తో ఆకట్టుకున్న సూర్య!