By: ABP Desam | Updated at : 02 Apr 2023 04:35 PM (IST)
ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా సినిమా చిత్రీకరణ హైదరాబాదులో జరుగుతోంది. ఏప్రిల్ 8వ తేదీ వరకు ఈ షూటింగ్ జరుగుతుందని తెలిసింది. దీని తర్వాత షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేశారట.
గోవాలో ఎప్పటి నుంచి అంటే...
హీరోగా ఎన్టీఆర్ 30వ చిత్రమిది. దీనికి కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో సినిమా మొదలైంది. శ్రీరామ నవమి తర్వాత రోజు నుంచి చిత్రీకరణ ప్రారంభించారు. ఎన్టీఆర్ సెట్స్‌లో అడుగు పెట్టిన వీడియోను శనివారం విడుదల చేశారు.
''అప్పుడప్పుడూ ధైర్యానికి కూడా తెలియదు.... అవసరానికి మించి తను ఉండకూడదు అని! అప్పుడు భయానికి తెలియాలి... తను రావాల్సిన సమయం వచ్చిందని! వస్తున్నా'' అని ఎన్టీఆర్ 30 టీజర్‌లో తారక్ చెప్పిన డైలాగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ లాస్ట్ వర్డ్ 'వస్తున్నా'తో లేటెస్ట్ వీడియో విడుదల చేశారు. ఎన్టీఆర్ నడుచుకుంటూ వెళ్లి దర్శకుడు కొరటాల శివను కలిసి వీడియో విడుదల చేసింది ఎన్టీఆర్ 30 టీమ్! ప్రస్తుతం రాత్రి వేళలో చిత్రీకరణ చేస్తున్నారు. ఎన్టీఆర్ పాల్గొనగా ఫైట్ తీస్తున్నారని తెలిసింది.
ఏప్రిల్ రెండో వారంలో ఎన్టీఆర్ 30 యూనిట్ గోవా వెళుతుందని సమాచారం. రెండో షెడ్యూల్ అక్కడ ప్లాన్ చేశారు. సముద్ర తీర ప్రాంతంలో చిత్రకథ సాగుతుందని సినిమా ప్రారంభోత్సవంలో దర్శకుడు కొరటాల శివ తెలిపారు. ఇప్పుడు సముద్ర తీరంలో కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : సమంత పెళ్లి చేస్తున్న శోభితా ధూళిపాళ... ఆ క్షణంలో కన్నీళ్ళు ఆగలేదట!
ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కొంత గ్యాప్ తర్వాత తెలుగులో ఆయన సంగీతం అందిస్తున్న చిత్రమిది. ఇందులో ఎన్టీఆర్ జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కథానాయికగా సందడి చేయనున్నారు.
Also Read : ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ
ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ ను తీసుకు వచ్చారు. 'ఆక్వా మాన్', 'జస్టిస్ లీగ్', 'బ్రాడ్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్' సినిమాలకు వర్క్ చేసిన బ్రాడ్ మైనించ్ NTR 30లో కొన్ని కీలకమైన సన్నివేశాలకు వీఎఫ్ఎక్స్ సూపర్ విజన్ చేస్తారని నిర్మాతలు తెలిపారు. హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ సూపర్ హిట్ ఫ్రాంఛైజీల్లో ఒకటైన 'మిషన్ ఇంపాజిబుల్', 'ట్రాన్స్‌ఫార్మర్స్', 'రాంబో 3' తదితర హాలీవుడ్ సినిమాలకు పని చేసిన స్టంట్ డైరెక్టర్ కెన్నీ బాట్స్ ఎన్టీఆర్ 30 సినిమాకు పని చేయనున్నారు. తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో' సినిమాకు కూడా ఆయన పని చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల, సినిమాటోగ్రాఫర్ రత్నవేలుతో కెన్నీ బేట్స్ డిస్కస్ చేస్తున్న ఫోటో విడుదల చేశారు. అది చూస్తే... షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ అని తెలుస్తుంది. సినిమాలో మెజారిటీ ఫైట్స్ ఆయనే చేస్తారని ఎన్టీఆర్ 30 బృందం తెలిపింది.
భగవంత్ కేసరి టీజర్, రజనీ, అమితాబ్ కాంబినేషన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!
NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?
Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!
Ram Charan Shirt Cost : శర్వా రిసెప్షన్‌లో రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ రేటు ఎంతో తెలుసా?
KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట
TSPSC: నేడే 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!
Weather Latest Update: నేడు రాయలసీమకు వర్ష సూచన, రుతుపవనాల గమనం ఎలా ఉందంటే
Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!