Animal: 'యానిమల్'లో హీరోయిన్‌గా ఫస్ట్ ఆమెను సెలెక్ట్ చేశారా? అసలు చెప్పిన సందీప్ రెడ్డి వంగా
Animal : 'యానిమల్' మూవీలో హీరోయిన్ పాత్ర కోసం రష్మిక కంటే ముందు బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రాని ఎంపిక చేసినట్లు తాజా ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ తెలిపారు.
Sandeep Reddy Vanga : బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కిన 'యానిమల్'(Animal) మూవీ డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. తండ్రి, కొడుకుల అనుబంధం నేపథ్యంలో యాక్షన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో రణ్ బీర్ తన నట విశ్వరూపం చూపించాడు. దాంతోపాటు సందీప్ రెడ్డి వంగ మేకింగ్, స్క్రీన్ ప్లే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. సినిమాలో వైలెన్స్ తో పాటు బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉన్నా కూడా ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఈ మూవీకి బాగా కనెక్ట్ అవుతున్నారు.
మరో రెండు వారాలపాటు నార్త్ ఆడియన్స్ ఈ మూవీ ఫీవర్ నుంచి బయటికి రాకపోవచ్చునే టాక్ బాలీవుడ్ లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రణబీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. చాలాకాలం తర్వాత ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది రష్మిక. ఈమధ్య గ్లామర్ రోల్స్ లో మెరుస్తున్న ఈ ముద్దుగుమ్మకి 'యానిమల్' (Animal) మూవీలో యాక్టింగ్ కి స్కోప్ ఉన్న రోల్ దక్కడంతో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. సినిమాలో రణబీర్ నటనతో పాటు రష్మిక నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.
అయితే 'యానిమల్" మూవీలో రష్మిక పోషించిన గీతాంజలి పాత్రకి ముందుగా బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా(Pariniti Chopra)ని సెలెక్ట్ చేశారట. ఆమెతో అగ్రిమెంట్ కూడా అయిపోయిందట. కానీ ఆ పాత్రకి పరిణితి లుక్స్, పెర్ఫార్మెన్స్ సెట్ కాకపోవడంతో ఆమెను తప్పించాల్సి వచ్చిందని సందీప్ రెడ్డి వంగ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు." నిజానికి పరిణితి చోప్రా పెర్ఫార్మన్స్ కి నేను పెద్ద ఫ్యాన్. ఆమె యాక్టింగ్ చూసి యానిమల్ మూవీకి సెలెక్ట్ చేశాను. ఆడిషన్స్, రెండు, మూడు స్క్రీన్ టెస్టులు చేసిన తర్వాత కూడా నేను ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ లో ఆమె నుంచి పర్ఫామెన్స్ రాలేదు. దాంతో గీతాంజలి పాత్రకి ఆమె సెట్ అవ్వదని అర్థమైంది. దీంతో ఆమెకు సారీ చెప్పి రష్మిక కి స్క్రీన్ టెస్ట్ చేసి సెలెక్ట్ చేయడం జరిగింది" అంటూ సందీప్ రెడ్డి వంగ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
అలా 'యానిమల్' మూవీలో హీరోయిన్ పాత్రకి బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా స్థానంలో రష్మిక సెలెక్ట్ అయి తన పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేసింది. ఇక ప్రస్తుతం థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న యానిమల్ మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.116 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి అత్యధిక కలెక్షన్స్ అందుకున్న హిందీ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు మొదటి రోజు కంటే రెండో రోజు ఈ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ రావడం విశేషం. రెండో రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.236 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
Also Read : బిగ్ బాస్ బ్యూటీకి ఇన్ స్టా షాక్, అకౌంట్ ను సస్పెండ్, కానీ..
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply