Gangs of Godavari : 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' స్పెషల్ సాంగ్ - ఈషా రెబ్బను కాదని 'బిగ్ బాస్ బ్యూటీ' తో విశ్వక్ సేన్ స్టెప్పులు!
Ayesha Khan : విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఐటమ్ సాంగ్ లో హిందీ బిగ్ బాస్ 17 కంటెస్టెంట్ ఆయేషా ఖాన్ చిందులు వేయనున్నట్లు తెలుస్తోంది.
Not Eesha Rebba, but this Bigg Boss beauty shines in Gangs of Godavari : సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఇప్పుడు కామన్ అయిపోయాయి మాస్ సినిమాల్లో అయితే కచ్చితంగా ఐటెం సాంగ్ ఉండాల్సిందే. ఇక ఈ ఐటమ్ సాంగ్స్ కోసం స్టార్ హీరోయిన్లతో పాటు లేటెస్ట్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన గ్లామరస్ హీరోయిన్స్ ని తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే తాజాగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కొత్త సినిమాలోనూ అదిరిపోయే ఐటమ్ సాంగ్ ని ప్లాన్ చేశారు. ఈ ఐటెం సాంగ్ లో బిగ్ బాస్ బ్యూటీ చిందులు వేయనున్నట్లు తెలుస్తోంది.
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఐటమ్ సాంగ్ లో అయేషా ఖాన్ చిందులు
ఇటీవల హిందీలో ప్రసారమైన 'బిగ్ బాస్' సీజన్ 17 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఆయేషా ఖాన్ 'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' మూవీలోని ఐటమ్ సాంగ్ కి విశ్వక్ సేన్ తో కలిసి చిందులేయబోతున్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రే ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ పాటలో ఆయేషా మాస్ డ్యాన్స్ తో పాటూ తన గ్లామర్ ట్రీట్ తో మైమరిపించడం ఖాయమని అంటున్నారు. తెలుగులో ఈమె చేస్తున్న మొదటి ఐటమ్ సాంగ్ ఇదే. కానీ. 2022లోనే 'ముఖచిత్రం' అనే సినిమాలోను ఆయేషా ఖాన్ ఓ కీలక పాత్ర పోషించింది. నిజానికి 'గ్యాంగ్ ఆఫ్ గోదావరి' ఐటమ్ సాంగ్ లో తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ విశ్వక్ సేన్ తో ఆడి పాడనుందని ఇటీవలే వార్తలు వినిపించాయి. కానీ ఆమె ప్లేస్ లో ఆయేషా ఖాన్ ని మూవీ టీమ్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
మార్చ్ లో రానున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'
విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాను మొదటి డిసెంబర్ 8న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే అప్పటికి షూటింగ్ కంప్లీట్ కాలేదు. పైగా, 'సలార్' డిసెంబర్ 22కి రావడంతో ఆ వారంలో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్న నాని 'హాయ్ నాన్న', నితిన్ 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్' సినిమాలు ముందుకు వచ్చాయి. దాంతో విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నా రవితేజ 'ఈగల్' తో పాటూ సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన', సిద్దు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్' వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' వంటి సినిమాలు ఉండడంతో ఎట్టకేలకు మార్చి 8న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు.
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' కాస్ట్ అండ్ క్రూ
ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన DJ టిల్లు మూవీ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగమ్మాయి అంజలి మరో నాయిక. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు.
Also Read : పెళ్లి పీటలు ఎక్కబోతున్న 'వాన' హీరోయిన్ - మార్చిలోనే పెళ్లి, ఎప్పుడు.. ఎక్కడంటే?