Nithin Srinu Vaitla: నితిన్ , శ్రీనువైట్ల కాంబినేషన్ - మైనస్ మైనస్ ప్లస్ అవుతుందా? మైత్రీ రిస్క్ చేస్తోందా?
Nithin Movie: ఫ్లాప్ హీరో..ఫ్లాప్ డైరెక్టర్.. వీళ్లద్దరి కాంబినేషన్లో మూవీ దాదాపు ఖరారైంది. మరి మైనస్ మైనస్ ప్లస్ అవుతుందా? అంత కాన్ఫిడెంట్ గా బరిలో దిగుతున్నారంటే ఈసారి హిట్ పక్కానా?

భీష్మ తర్వాత మరో హిట్ చూడని నితిన్
పదేళ్లుగా ఫ్లాపుల్లో కొట్టుకున్న పోతున్న శ్రీనువైట్ల
వీళ్లిద్దరి కాంబినేషన్లో రాబోతున్న కొత్త ప్రాజెక్ట్ ని నిర్మిస్తోన్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ
గతంలో నితిన్ తో రాబిన్ హుడ్ తెరకెక్కించి నష్టపోయిన మైత్రి మూవీ మేకర్స్
శ్రీనువైట్లతో అమర్ అక్బర్ ఆంటోని రూపొందించిన మైత్రి మూవీ మేకర్స్
వరుస ఫ్లాపుల నుంచి బయటపడడం ఖాయం అనే నమ్మకంతో అడుగేస్తున్న వైట్ల-నితిన్
శ్రీనువైట్ల, నితిన్ మూవీస్ తో వచ్చిన నష్టాన్ని కొత్త ప్రాజెక్ట్ తో భర్తీచేసేస్తాం అనే ధీమాతో మైత్రి మూవీ మేకర్స్
ఓవరాల్ గా టాలీవుడ్ లో అస్సలు ఊహించని ఈ కాంబినేషన్ పై సోషల్ మీడియాలో డిస్కషన్ ఓ రేంజ్ లో సాగుతోంది. ఫ్లాప్ డైరెక్టర్, ఫ్లాప్ హీరో .. మైనస్ మైనస్ కలసి ప్లస్ అవుతుందా మరింత మైనస్ పడుతుందా అంటూ సెటైర్స్ మోగిపోతున్నాయ్. ఎందుకంటే అప్పుడెప్పుడో జయం, సై తర్వాత వరుస ఫ్లాపుల్లో కొట్టుకుపోయిన నితిన్.. ఇష్క్ మూవీతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత కెరీర్ గాడినపడినట్టే అనుకుంటే భీష్మ మూవీ తర్వాత మళ్లీ సేమ్ రిపీట్ అయింది. భీష్మ సినిమా తర్వాత నటించిన మాచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్‌హుడ్, తమ్ముడు ఇవన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయ్. బలగం దర్శకుడు వేణుతో ఎల్లమ్మ ప్రాజెక్ట్ కి కమిటయ్యాడని...ఆ మూవీలో సాయిపల్లవి , కీర్తిసురేష్ పేర్లు వినిపించాయ్. వాళ్లిద్దరూ తప్పుకున్నారనే వార్తతో పాటూ రీసెంట్ గా నితిన్ కూడా ఆ సినిమా నుంచి బయటకువచ్చేశాడు.
వాట్ నెక్ట్స్ అంటే శ్రీనువైట్లతో ప్రాజెక్ట్ న్యూస్ బయటకొచ్చింది. శ్రీను వైట్ల కూడా మహేష్ బాబు దూకుడు, తారక్ తో బాద్షా తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు. ఆగడు నుంచి ఆగిపోయిన హిట్ మళ్లీ పలకరించలేదు... వరుసగా బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోని, విశ్వం ఇవన్నీ నిరాశపర్చాయ్. ఇప్పుడు నితిన్ తో వచ్చేందుకు సిద్ధమయ్యాడు శ్రీనువైట్ల
వాస్తవానికి ఇష్క్ తో మంచి కంబ్యాక్ ఇచ్చిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేయబోతున్నాడనే డిస్కషన్ నడిచింది. ఈ మూవీతో మళ్లీ అదృష్టం తలుపుతడుతుందని ఫిక్సయ్యారంతా..కానీ ఆ సినిమా ఇంకా ఆలస్యం అయ్యేలా ఉందని ఈ గ్యాప్ లో శ్రీనువైట్లతో వచ్చేందుకు సిధ్దమయ్యాడని టాక్. కామెడీ, యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రాబోయే ఈ సినిమా శ్రీనువైట్ల గత చిత్రాలైన...వెంకీ, ఢీ, దుబాయ్ శీను, దూకుడు, బాద్ షా లా ఉండబోతోందట. త్వరలోనే ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది.
ఇదే నిజమైతే నిజంగా నితిన్-శ్రీనువైట్లకు మంచి కంబ్యాక్ మూవీ అవుతుందని చెప్పుకోవచ్చు. కొత్త ప్రాజెక్ట్ కి రచయిత నందు కథ అందిస్తున్నట్లు తెలుస్తోంది. కథ విన్న తర్వాత తప్పనిసరిగా హిట్ కొడతాం అనే నమ్మకంతో నితిన్ ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. మరి ఇద్దరి నమ్మకం నిజమవుతుందా? వరుస ఫ్లాపులనుంచి నితిన్ - శ్రీనువైట్ల బయటపడతారా? వెయిట్ అండ్ సీ..






















