Nindha Movie Review: నింద ఆడియన్స్ రివ్యూ - వరుణ్ సందేశ్ సినిమా టాక్ ఎలా ఉందంటే?
Nindha Movie Twitter Review: వరుణ్ సందేశ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'నింద'. ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. అయితే, ముందు రోజు రాత్రి హైదరాబాద్‌లో ప్రీమియర్ షోలు పడ్డాయి. టాక్ ఎలా ఉందో చూడండి.
Varun Sandesh Nindha Movie Twitter Review In Telugu: వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్త సినిమా 'నింద'. ఏ కాండ్రకోట మిస్టరీ... అనేది ఉపశీర్షిక. రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహించడంతో పాటు స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రమిది. శుక్రవారం (జూన్ 21న) థియేటర్లలో విడుదల. అయితే... గురువారం రాత్రి హైదరాబాద్ సిటీలో స్పెషల్ ప్రీమియర్ షో వేశారు. దానికి సెలబ్రిటీలతో పాటు మీడియా, ప్రేక్షకులు కొంత మందిని ఆహ్వానించారు. ఆ షో రెస్పాన్స్ ఎలా ఉంది? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉంది? అనేది చూస్తే...
స్లోగా ఉన్నా... ఇంట్రెస్టింగ్ ఫిల్మ్!?
'నింద' డీసెంట్ ఫిల్మ్ అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ఈ సినిమా 'స్లో బర్నర్' అని చెప్పాడు. దర్శకుడు రాజేష్ జగన్నాథానికి తొలి చిత్రమైనా సరే... నటీనటుల నుంచి మంచి పెర్ఫార్మన్స్ రాబట్టుకున్నాడని చెప్పాడు. నిదానంగా సినిమా మొదలు పెట్టినా... చివరకు సరైన దారిలోకి తీసుకు వెళ్లాడని తెలిపాడు.
#Nindha is a decent slow burner.
— Nagaraj🌿 (@rajuvijai) June 20, 2024
Director @Rajesh_tweetss let's it simmer, simmer and then plays his cards right. For a first-time director, he manages to extract good performances from his cast.
రేసీ స్క్రీన్ ప్లే, ఎంగేజింగ్ నేరేటివ్ స్టైల్‌తో 'నింద' సినిమాను తీశారని మరొక నెటిజన్ తెలిపాడు. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అని చెప్పాడు. కొందరు అయితే ఫస్టాఫ్ ట్విస్ట్ రివీల్ చేసేలా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
Also Read: ఆహాలోకి వచ్చిన Rasavathi - పవన్ కళ్యాణ్ 'ఓజీ' ఫేమ్ అర్జున్ దాస్ హీరోగా నటించిన Romantic Thriller
.#Nindha Is A Interesting Film With Racy Screenplay & Engaging Narrative 👍. @itsvarunsandesh @Ranjith_Offl_ @rajesh_tweetss @tharan_tandle @ramiz_naveeth @synccinema @PROSaiSatish #NindhaOnJune21st pic.twitter.com/ZWT7ZfE7C8
— BA Raju's Team (@baraju_SuperHit) June 20, 2024
#ShowTime #Nindha #NindhaOnJune21st@itsvarunsandesh @tanikellabharni @actorbhadram @Ranjith_Offl_ @rajesh_tweetss @tharan_tandle @ramiz_naveeth @santhuomkar @synccinema @Aruncharlie14 @mimemadhu @sidhu_gollap @ArunkumarD70824 @shreyaranireddy #Qmadhu @sreeramsiddh #Archanarao… pic.twitter.com/YwRAa0engI
— Dileep Kumar Kandula (@TheLeapKandula) June 20, 2024
హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ రోల్ చేసిన వరుణ్ సందేశ్!
'నింద' సినిమాలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC)కి చెందిన అధికారి పాత్రలో వరుణ్ సందేశ్ (Varun Sandesh) నటించారు. కాండ్రకోటలోని మిస్టరీని అతడు ఎలా చేధించాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తనికెళ్ళ భరణి, 'ఛత్రపతి' శేఖర్, శ్రేయా రాణి రెడ్డి, యాని, భద్రమ్ తదితరులు నటించిన ఈ సినిమాకు సంతు ఓంకార్ సంగీతం అందించారు. తన భర్తకు ఈ సినిమా కమ్ బ్యాక్ అవుతుందని వరుణ్ సందేశ్ సతీమణి వితికా షేరు చెప్పారు. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.