Aha OTT Latest Movie: ఆహాలోకి వచ్చిన Rasavathi - పవన్ కళ్యాణ్ 'ఓజీ' ఫేమ్ అర్జున్ దాస్ హీరోగా నటించిన Romantic Thriller
Rasavathi OTT Streaming: కమల్ హాసన్ 'విక్రమ్', పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమాల్లో నటుడు అర్జున్ దాస్ హీరోగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ 'రసవతి'. ఆహా తమిళ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Rasavathi Movie OTT Platform Release Date: తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన సినిమాలతో అర్జున్ దాస్ (Arjun Das)కు తెలుగు ప్రేక్షకుల్లోనూ మాంచి ఫాలోయింగ్ ఏర్పడింది. కార్తీ 'ఖైదీ', విజయ్ 'మాస్టర్', కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాల్లో ఆయన పాత్రలు అందర్నీ అలరించాయి. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిల్మ్ 'అంధకారం', అర్జున్ దాస్ గొంతుకు అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన హీరోగా రూపొందిన తాజా తమిళ సినిమా 'రసవతి'. ప్రస్తుతం ఆహా తమిళ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
రసవతి... రొమాంటిక్ థ్రిల్లర్!
అర్జున్ దాస్ హీరోగా దర్శకుడు సంత కుమార్ తెరకెక్కించిన సినిమా 'రసవతి'. ది ఆల్కెమిస్ట్... అనేది ఉపశీర్షిక. తాన్యా రవిచంద్రన్ హీరోయిన్. ఈ అమ్మాయి మన తెలుగు ప్రేక్షకులకు తెలుసు. యువ హీరో కార్తికేయ గుమ్మకొండ 'రాజా విక్రమార్క' సినిమాలో నటించారు. రొమాంటిక్ థ్రిల్లర్ (Romantic Thriller Movies Tamil)గా తెరకెక్కిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. మే 10న థియేటర్లలో విడుదలైంది. ఈ రోజు (జూన్ 21) నుంచి ఆహా తమిళ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది (Rasavathi OTT Release Date). అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోనూ ఈ సినిమా ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
#Rasavathi is streaming now on #ahaTamil! Enter the world of thrills and chills!@Santhakumar_Dir @iam_arjundas @actortanya @actorramya @GMSundar_ @MusicThaman @EditorSabu @SPremChandra1 @minu_jayebal @dancersatz @donechannel1 @YugabhaarathiYb @iam_rishikanth @saranelavarasu pic.twitter.com/3fUxU0QGzz
— aha Tamil (@ahatamil) June 20, 2024
డాక్టర్ వర్సెస్ పోలీస్ ఆఫీసర్!
'రసవతి' సినిమాలో అర్జున్ దాస్ డాక్టర్ రోల్ చేశారు. కొడైకెనాల్ ఏరియాలో అతడు ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఆ ఊరిలో తాన్యా రవిచంద్రన్ హోటల్ మేనేజర్. వాళ్లిద్దరూ దగ్గర అవుతారు. ప్రేమలో పడతారు. అది పోలీస్ ఆఫీసర్ పరసురాజ్ (సుజిత్ శంకర్)కు నచ్చదు. డాక్టర్ గతానికి, అతడికి సంబంధం ఏమిటి? చివరకు ఏమైంది? అనేది ఆహా తమిళ్ ఓటీటీలో సినిమా చూసి తెలుసుకోవాలి.
Also Read: వేదిక ఈజ్ బ్యాక్... అప్పుడు 'ముని', ఇప్పుడు 'యక్షిణి'... హారర్‌తో హిట్స్
Sadha Siva Pandian-oda vaazhaka avara enga kondu podhunu paarunga😨#Rasavathi premiering on #ahaTamil from June 21@Santhakumar_Dir @iam_arjundas @actortanya @actorramya @GMSundar_ @MusicThaman @EditorSabu @SPremChandra1 @minu_jayebal @dancersatz pic.twitter.com/3WR74Mxy8Y
— aha Tamil (@ahatamil) June 19, 2024
పవన్ 'ఓజీ'లో నటిస్తున్న అర్జున్ దాస్!
తమిళ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అర్జున్ దాస్... తెలుగు చిత్ర పరిశ్రమకు 'బుట్టబొమ్మ' సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యారు. దాని కంటే ముందు గోపీచంద్ 'ఆక్సీజెన్'లో ఓ పాత్ర చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా 'రన్ రాజా రన్', 'సాహో ' ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న 'ఓజీ'లో నటిస్తున్నారు. త్వరలో 'రసవతి' తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.





















